9, మే 2009, శనివారం

మా వంటింటి కథ

మా ఇంట్లో నాకెంతో ఇష్టమయిన వాటిల్లో "వంటగది" ఒకటి ....మిగిలినవి ఏంటా అని ఆలోచిస్తున్నారా ...అవి ఇంకోసారి చెప్తాను ...వంటింటిని అంత ఇష్టపడ్తున్నాను అంటే మనమేదో సూపర్ స్టార్ కుక్ అనుకుంటారేమో ,,అలాంటి కళలు మనదగ్గరేమి లేవు ...కాని సుబ్బరంగా పాత కాలం వంటలు చేస్తాను (అక్క ,చెల్లి అంటారు ,,మనది అంతా పాత అని)ఈ పాత వంటకాలు మా ఇంట్లో ఉన్నా ప్రాణులకి అలవాటయ్యి ఎవ్వరోండిన(పనివాళ్ళు ) సరిగ్గా తినరు ...అందుకని మా వంటింటికి నేనే మహా రాణీ ని ...ఉదయం ఐదున్నరకి నిద్రకళ్ళతో పూజగదిలోకి ఓ లుక్ వేసి ...ఈరోజు అంతా బాగుండాలని బాబాకి ఒక అప్లికషన్ పడేసి (చూపులతో ) పక్కనే వున్న వంటగది లోకి నడుస్తా టీ చేయడానికి ....అలా భారంగా వేసిన అడుగు మనం ఆఫీసు కి వెళ్ళేవరకు ముడిపడే వుంటది ...మద్య మధ్య కొద్దిపాటి విరామలతో .నాకు వంటపని ఉదయం చేయడమే ఇష్టం .....అలానే సాయంత్రాలు ఇష్టమే ...కాని సాయంత్రాలు ఎప్పుడో సండే లేదా మనం బద్దకించి ఆఫీసు డుమ్మా కొడితే తప్ప తప్ప కుదరదు ....సాదారణంగా రాత్రి అవ్వుతుంది ....అస్సలు ఎప్పుడైతేనేం తినడానికి వండటానికి అనుకుంటున్నారా ?..........మా వంటగది ఇంటి సింహ ద్వారం కన్నా తూర్పు ముఖంగా ముందుకి వచ్చింది అందుకని వంటింటికి తలుపు వుండదు వాటి స్థానంలో విశాలమయిన కిటికీలు తూర్పు వైపు దక్షిణం వైపు అమర్చారు ఇక మనం గదిలో అడుగు పెడితే మల్టిపుల్ కలర్స్ లో బయటి ప్రపంచాన్ని చూడొచ్చు ....ఇల్లు బాగా ఎత్తు మీద కట్టడం వల్ల వంటింట్లో వున్న మా దక్షిణ గోడను ఆనుకుని వున్న పక్కింటి వారిల్లు ..అలానే మా కాలనీ లోకి వచ్చేపోయే కార్స్ ...హీరోల్లా బైక్ ల మీద రివ్వుమంటూ వచ్చే అబ్బాయిలు ...సీతాకోక చిలుకల్లాటి నర్సింగ్ స్కూల్ అమ్మాయిలూ .....అస్సలు వంటచేసినట్లే వుండదు ....కథ రేపు చెబుతాను

10 వ్యాఖ్యలు:

PAVANKALYAN[I.A.S] చెప్పారు...

మా వంటింటి కథ బావుంది మ్యాడం .

మురళి చెప్పారు...

మళ్ళీ సీరియల్ అన్నమాట! బాగున్నాయండి మీ వంటింటి కబుర్లు..

పరిమళం చెప్పారు...

అబ్బా ! వంటగది అంటే నాకు తగని భయం ! ఎప్పుడు బయటపడదామా అని చూస్తాను ...మీలా అందమైన దృశ్యాలు కనపడవు మరి ...

భావన చెప్పారు...

అబ్బ మీ వంట గంది ఎంత బాగుందండి. నాకు వంట గదంటే ఇష్టం ఏమి వుండదు కాని అలా పెద్ద కిటికి వుంటే ఏ గది ఐనా బాగుంటుంది.

Ajay :) చెప్పారు...

nenu kuda poddune baba ni smarinchukunta chinii :)

చిన్ని చెప్పారు...

@పవన్ కళ్యాన్ ఐ.ఏ.ఎస్ .. నా వంటిల్లు నచ్చినందుకు థాంక్స్ .

@మురళి ....ఇది మరో సీరియల్ కాదు ...ఆ రోజు రాయటానికి కుదరలేదు ....ఇప్పటికి కుదరడం లేదు ....కొత్త ప్రభుత్వం వచ్చాక తీరికగా రాసేస్తా :)

@పరిమళం ...వంటిల్లు ఇష్టం లేదా?:) గది లో వున్నా కాసేపు అబ్సేస్సేన్ గా క్లీన్ చేస్తూంటాను ...అలానే పనమ్మాయిని ఆ గది కోసం ఎక్కువ విసిగిస్తాను .

చిన్ని చెప్పారు...

@భావన గార్కి
నిజమేనండి ... రావిచెట్టు చిగురుటాకులనుండి ఉదయించే సూర్యుడిని ..కిటికీ అద్దాలనుండి స్టవ్ మీద పడే కిరణాలను మస్తు ఎంజాయ్ చేస్తానండి .

@అజయ్
భక్తిలో మనం మనం ఒకటేనన్నమాట ...అన్నట్లు మీ మూడోవాడ్ని (తింగరి వాడ్ని ) ఇచ్చేశాను వెనక్కి :)

Ajay :) చెప్పారు...

@ chinnii...chusanu maa vaadini teesesavu :)

కొత్త పాళీ చెప్పారు...

amusing ..
మనం మనం ఒకటేననుకోండీ, కానీ మరీ బహువచనం కొంచెం టూమచ్ కాలే? :)

చిన్ని చెప్పారు...

@kottapaali gaaru "manam" annadhi naaku ardham kaaledhu