28, మే 2009, గురువారం

ఇప్పపూలు -మొదటిదాని తరువాత

విప్పపూల చెట్టు దగ్గరకి తీసుకెళ్ళమని కొత్తగకుదిరిన పనమ్మాయి ఎల్లమ్మ వెంటపడ్డాను(ఆ ప్రదేశం కొత్త అవ్వటం వలన అలా ఆధారపడల్సోచ్చింది) అదంతా పెద్ద ఆవరణ ,నిజమయిన అడివిలా వుంది (అప్పుడు నా చిన్ని బుర్రకు )మొత్తానికి ధంతావధానం అవ్వకుండానే నిద్రకళ్ళతో ఎల్లమ్మ వెంటపడి వెళ్లాను ,మా ఇంటి ఫెన్సింగ్ ఆవథలకి తీసుకెళ్ళి ఓ పెద్ద చెట్టు కింద నిలబడింది ....నేనేమో సహనం పట్టలేక ఇంకెక్కడా ,ఎంత దూరం అంటుంటే ...ఆ అమ్మి సావధానంగా "ఇక్కడ ఏరుకోవచ్చు ఎవరు నడవరు "అంటూ వంగి ఎండిపోయిన ద్రాక్ష ,చిన్న కుంకుడు తొక్కలు లాటివి ఏరడం మొదలెట్టింది ,,నేనేమో అయ్యేవో తరువాత యేరుకో ముందు విప్పపూలు కోసుకోచ్చుకుందాం పద అనటం తడవు ..ఇవ్వెగధఇప్పపూలు నూ కూడా మంచి చూసి యేరు అంటు ..ఇది బాగుంది తిని సుడు అని నా నోట్లో పెట్టింది ..మనం "దూ ' అని వుమ్మి ఛీ ఇయ్యేవరికి కావాలి అంటూ ఇంట్లోకి వురికాను ....నా వెనుకే ఎల్లమ్మ పమిట కొంగు నిండా బోలెడన్ని తెచ్చి వంటగదిలో అమ్మ ముందు పోసింది ...మా అమ్మ కి విషయం తెలిసి ఒకటే నవ్వు ...నేను అవి తలలో పెట్టుకునే పూలనుకుని వాటికోసం కలవరించానని ..నోరంతా చేదుగా కుంకుడు రసం నోట్లో పడ్డట్లు వుండే విప్పపూలు నాకస్సలు ఇష్టం లేదు . వారం తరువాత భద్రాచలం వెళ్ళినప్పుడు గుడి దగ్గర ప్రసాదం ల ఇస్తోంటే ఇంకా ఆశ్చర్యపోయాను .... తరువాత అమ్మ వాటి ప్రాశస్త్యం చెప్పింధనుకోండి ....మొన్నామధ్య సాక్షిలో చదివి గుర్తు చేసుకున్నాం . ......తరువాత ఆటలకోసం చాల ఎరేదాన్ని :) అలా నా రంగుల కల విప్పపూవు వెలీసిపోయింది .
( ప్రాబ్లం వల్ల కొంత పోయింది అందుకే మరల రాసాను )

11 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

>>ప్రాబ్లం వల్ల కొంత పోయింది.. అంటే కథంతా మళ్ళీ మొదటికి వచ్చిందా ? త్వరగా మిగిలినదీ రాయండి.

Hima bindu చెప్పారు...

@మురళి
రాసినది ఎగిరిపోయింది అందుకనే మరల మిగిలింది క్లుప్తంగా ముగించాను .ధన్యవాదములు
@పద్మర్పిత
కిక్ కోసం కాదండి రాస్తుంటే అస్తమాను ప్రాబ్లం వస్తోంది .థన్క్యు.
@బాస్కర రామిరెడ్డి
ఏంటండీ మా అమ్మ నాన్నకు నేను ఒక్కదానే కాదు ,మేము ఆరుగురం ,,,మరి రొండో తరగతి ఫైనల్ రాయకపోతే నన్ను నాలుగులో ఎవరు చేర్చుకుంటారు :(

మురళి చెప్పారు...

మరక్కడ తలలో పెట్టుకునే పూలేవీ కనబడలేదా మీకు?

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఓ.. మీరు చిన్నప్పుడే హైజంప్ లు చేశారే :)

Hima bindu చెప్పారు...

@మురళి
ఆ తుప్పల నిండా పరుచుకున్న విప్ప పూలు చూసి దెబ్బ తిన్న లేడిపిల్ల లా ఇంట్లోకి పరిగెత్తా ఆ క్షణాన ...........తరువాతతరువాత బోలెడన్ని అడివి పూలు మనతో ఆడుకున్నాయి లెండి
@భాస్కర రామిరెడ్డి
అవునండి చిన్నప్పుడు మా పెద్దచేల్లి ,నేను ఒకటే క్లాసు ఇద్దరికీ ఒక యేడాదే తేడ ...ఒకే బాక్స్ ,ఒకటే పుస్తకం వాటికోసం గొడవపడటం భరించలేక రాక్షసిపిల్లనయిన నన్ను తీస్కెళ్ళి హై జంప్ చేయించారు మా చెల్లిని రక్షిస్తానికి .

మరువం ఉష చెప్పారు...

ఇప్పపూలు భద్రాచలం ప్రసాదంగా బాగా తిన్నాను. అలాగే చిన్న తిరుపతి (ద్వారకాతిరుమల) కి ఓ మాదిరి చిట్టడవి దారుల్లో నడిచి వెళ్ళినపుడు ఆ పొదలు, వెలగ చెట్లు చూడటం, అలాగే శ్రీశైలం అడవుల్లో ఆగి, అడవి పళ్ళతో పాటు ఈ పూలు కోసుకోవటం మరపురాని అనుభూతి. నిజానికి ఓ సారి అడవిలోపలగా వున్నపుడు పులి గాండ్రింపు కూడా విన్నాను. ఆ రకంగా కొంత ప్రకృతి వొడిలోకి జారిపోవటం అన్న ఆసక్తి కుంటువడింది. ఇక మిగిలిన కల, తీరుతుందని ఆశగా వున్న కోరిక, ఇప్ప సారా తాగటం. ;) తంతాను అంటున్నారా, హ హ హ్హా

Hima bindu చెప్పారు...

నిజంగా మీకు విప్పపూల ప్రసాదం ఇష్టమా! మీరు చెప్పిన రూటు లో ప్రయాణం చాల బాగుంటది ...అల చిట్టడవుల్లో వాగులు దాటుతూ సన్నటి తుంపర్లలో అల ఎంత దూరమైన ప్రయాణం చేయొచ్చు ..జంగారెడ్డిగూడెం దాటాక ట్రిబల్ ఏజెన్సీ వుంటది ...ఆ కొండల మీద గెస్ట్ హౌస్ ...మాటల్లో చెప్పలేము ...నా ఉద్యోగరీత్యా అక్కడకు మూడు నెలలకోసారి వెళ్ళాలి ...ఆ ట్రిప్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను ....ఈ వారం నా టూర్ ప్రోగ్రమం లో వుంది .
ఇక పోతే మీ తీరని కోరిక (నాదా?) విప్పసార ...ఇండియా వచ్చినప్పుడు చెప్పండి కొండ కోనా గాలించి పుట్టతేనే,ఇప్పసారా సమర్పించుకుంటాం .మీ పేరు చెప్పుకుని మేము ఆ రుచి చూస్తాం .

విశ్వక్శేనుడు చెప్పారు...

విప్పసారా, పుట్టతేనె మీరు మీరు తాగితే సరిపొతుందా, నాకు కూడా...............

పరిమళం చెప్పారు...

చిన్నిగారు , నేను కొంచెం లేటుగా రావడం వల్ల మీ ఇప్పపూల జ్ఞాపకాలు రెండు భాగాలూ ఒకే సారి చదివేశాను . నిజానికి వాటిని నేనెప్పుడూ చూడలేదు .భద్రాచలం లో ప్రసాదంగా ఇస్తారని కూడా తెలీదు . థాంక్స్ !

Hima bindu చెప్పారు...

@విజయమాధవ
తేనె వరకు ఒకే .... ..ఇప్పసారనే ఆలోచించాలి .-:)
@పరిమళం
మీరు విప్పపూలు ఏదొక సందర్భంలో చూసే వుంటారు ,పేరు వేరుగా వుండొచ్చేమో కదా ..ఇప్పుడు అది ప్రసాదం అవునో కాదో తెలీదు ,కాని అవి అక్కడ విరివిగా దొరకవచ్చు .ఈ సారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి

విశ్వక్శేనుడు చెప్పారు...

మీరు ఒకటి చూడండి. రెండోది నేనే సాదిస్తా(మీ పేరు చెప్పి). మనం అసలే సందు దొరికితే దూసుకుపొతాం.