28, మే 2009, గురువారం

"ఇప్ప పూలు "

ఈ మద్య సాక్షి పేపర్ లో వరుసగా సమ్మర్ స్పెషల్ -చెట్టు కథలు వరుసగా ప్రచురిస్తున్నారు ,అవి చాల బాగుంటున్నాయి .మనల్ని భాల్యం లోకి మరి ఇంక్కేక్కడికో తీస్కుని వెళ్తున్నాయి .వీలయితే తప్పకుండా చదవండి . ఈ రోజు ఫలవంతమైన చెట్టు ,నిన్న అరుణమ్మ ఏరూ....పత్తాటి చెట్ల రేవూ రాసారు .నిన్నటి చెట్టు కథ రాసింది స.వెం .రమేశ్,ఈ కథని రెండు మూడు సార్లు చదుకున్నాను ,నాకైతే చాల నచ్చింది .పత్తటి చెట్టు కథ చదివి తాటి చెట్టు తో నా అనుభంధం రాద్దామనుకున్నాను బ్లాగ్ లో ....ఈ లోపు మన నెమలికన్ను "మురళి "రాసేసారు ..అందుకే మన ప్రయత్నం విరమించేసాం . ఆ మద్య ఒకరు సాక్షి లో విప్పపూల చెట్టు (ఇప్ప పూలు ) గురించిరాసి మన జ్ఞాపకాల తేనె తుట్టు ను కదిపెసారు ,అప్పుడే పంచుకోవాలనుకున్నాను కాని టైం కుదరలేదు .


ఈపాటికి అందరికి అర్ధం అయ్యే వుంటుంది మనకున్న "పూల పిచ్చి" ...మనం ఏ పువ్వును వదలం చిన్నప్పుడైతే తల లోకి ఇప్పుడేమో ఫ్లవేర్ వాస్ లోకి వెళ్తుంటాయి .(మనం ఆఫీసు కి పూలు పెట్టుకోం బాగోదని ప్చ్.....) పూలు అనే మాట వినబడితే చాలు ఎక్కడ అని అనేదాన్ని ....అలాంటి పిచ్చన్న మాట :)


నేను రెండవ తరగతి లో వుండగా మా నాన్నగారికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యింది ,మాకు ఫైనల్ పరీక్షలు జరుగు తున్నాయని నాన్న ముందు ఒక్కరే వెళ్లి జాయిన్ అయ్యారు . ఒక వారం తరువాత అక్కడి జవాన్లను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు ,,వాళ్లు సామాను షిఫ్ట్ చేయడానికి సహాయపడ్తారని. మేము వెళ్లబోయే ఇల్లు ,ఆఫీసు ఇల్లు కలిపే వుంటుందని ,వేహికాల్స్ చెకింగ్ కి అన్ని అక్కడికే వస్తాయని మా అమ్మతో జవాన్ (అటెండర్ ) చెప్తుంటే విన్నాము ..మా అమ్మ కుతూహలంగా ఆ ఇంటి వైశాల్యం ,గదులు పెరడు ,,అంతక్రితం వుండి వెళ్ళిన ఆఫీసర్ ఫ్యామిలీ వివరాలు ,పని మనుషుల వివరాలు అన్ని అడుగుతుంటే వాళ్లు హుషారుగా ఇంక అడిగినవి అడగనివి చెబుతుంటే మనము నోరు తెరుచుకొని మరి విన్నాము ...మేము వెళ్ళ బోయే ఇంట్లో ప్రహరీ లా సీతాఫల చెట్లు వున్నాయని సీజన్లో లో గంపలు గంపలు పండి తినలేక పారేయ్యలని మొక్కల కోసం ఎక్కడత్రవ్విన రాక్షసి బొగ్గు వస్తుందని ఇంటి వెనుక విప్పపూల చేట్టుందని కావలసినన్ని పూలని చెబుతుంటే ఇక మనం ఈస్ట్మాన్ కలర్లో ఆ పూలన్నీ కోసేసుకున్నట్లు (ఇప్పటికి కళ్ళల్లో మెదులుతుంది ) ఇక మా అమ్మని ఊపిరాడ నీయలేదు ,ఆ పూలు బీరు (సార ) చేయడానికి వుపయోగిస్తారని చెప్పింది ...అప్పటివరకు హైదరాబాద్ వదిలి వెళ్లడానికి బెంగాపడ్డ మనం ఎప్పుడెప్పుడు కొత్తగూడెం చెట్టు .తరువాత రెండురోజులకు మేము కొత్తగూడెం వెళ్ళాం .మేము అక్కడికి చేరడం గుర్తు లేదు ,,నిద్ర లేచేసరికి కొత్త ఊర్లో కొత్త ఇంట్లో వున్నాం . నేను లేచేసరికి అమ్మ జవాను తీసుకొచ్చిన ఎల్లమ్మ (పనమ్మాయి )తో మాట్లద్తోందిఆ అమ్మాయికి మా అందరిని పరిచయం చేసింది ..నాకయితే ఎప్పుడెప్పుడు పూలు చూడాలా అని కోరిక ,ఎల్లమ్మని అడిగాను మన ఇంటి వెనుక
7 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

టపా abrupt గా కట్ అయింది.. ఒకసారి సరి చూడండి.. ఆసక్తికరంగా ఉంది.. నేను రాశానని మీరు మానేయడం అన్యాయం.. బాల్యం తాలూకు అనుభూతులు ఏ ఇద్దరివీ ఒక్కలా ఉండవు.. తాటిచెట్టు గురించి కూడా రాయండి..

Padmarpita చెప్పారు...

చిన్నిగారు... కధలో కిక్ కోసం కట్ చేసారా!!
లేక ఏదైనా ప్రాబ్లమా కధ ఇంట్రెస్టింగా సాగుతున్న సమయంలో ఇదేవిటండీ?

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రెండో తరగతిలో ఫైనల్ పరీక్షలు.... హిహి హీ

మరువం ఉష చెప్పారు...

ఒక్కసారిగా యడ్లపాడు నుండి హైదరాబాదుకి లారీ వెనక సామాన్లు పెట్టగా మిగిలిన జాగాలో రెండు నవారు మంచాలు, ఓ నాలుగు కేను కుర్చీలు వేసి అమ్మ, మామ్మ, నాన్న గారు, మేం నలుగురం పిల్లలం రాత్రి ప్రయాణంగా వెళ్ళటం గుర్తొచ్చింది. లెక్క ప్రకారం తెల్లవారక మునుపే వెళ్ళపోతాం అని ప్లానట. మధ్యలో ఏవో ఇబ్బందులొచ్చి మేము నగర శివార్లకి వెళ్ళటమే 8am అయిపోయింది. మాకేమో చిన్న చిన్న బస్తీలే కానీ అంత పెద్ద వూర్లు చూడటం క్రొత్త, మేము నోర్లు తెరుచుకు చూడటం, మమ్మల్ని చూసిన వారు నోర్లు తెరుచు నవ్వటం, అదీ ఆ తంతు. నాకు ఎనిమిదేళ్ళే కనుక సరిపోయింది. ఇపుడైతే అందులోంచి "అతడు" లో భూమిక దూకినట్లు దూకి పారిపోతానేమో... ;)

మరువం ఉష చెప్పారు...

ప్చ్, "అతడు" తర్వాత "ఒక్కడు" "పోకిరి" "సైనికుడు" "అతిథి" చూసినా ఇవేవీ నచ్చక మనసు "అతడు" తో ఆగిపోయింది. పైన "అతడు" బదులుగా "ఒక్కడు" అని మార్చి చదువుకోండేం :(

Hima bindu చెప్పారు...

@ఉష గారు ,
మీరు చెబుతుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గిర్రున కళ్ళ ముందు బ్లాకు అండ్ వైట్ లో కనబడుతున్నాయి ...ప్చ్ ఆ రోజులు రావాలన్న రావుగా ..

తృష్ణ చెప్పారు...

సాక్షిపేపరులో చెట్టుకధలు నేనూ వదలకుండా చదివేదాన్ని(మా ఇంట్లో ఇప్పుడు పేపరు మార్చేసారు).నాకు కూదా మా చిన్నప్పటి చెట్లూ,నేను పెంచిన గార్డెనూ జ్ఞాపకం వచాయి ఇప్పుడు మీ పోస్టు చూస్తే.మేము గవర్నమెంటు క్వార్టర్సులో ఉండేవాళ్ళము.ఆడివిలాగ పెద్దపెద్ద చెట్లు ,రకరకాల పూలచెట్లతో బాగుండేది.నేను కూడా చాలారకాల పూలచెట్లని పెంచేదాన్ని అప్పుడు!!