ఉరుకులు పరుగులతో సుడులు తిరుగుతూ , నురగలు కక్కుతూ , గలగల పారుతూ హొయలు పోయే కృష్ణవేణి కి ఆనకట్ట వేసి రైతన్నల పెదవులపై చిరునవ్వులు పూయించిన క్రుషివలుడతను. ఆయనే లేకుంటే కృష్ణాజిల్లా ఇంత సుభిక్షంగా ఉండేది కాదు . ఆయనే లేకుంటే విజయవాడ నగరానికి మరో ట్యాంక్ బండ్ లాంటి "ప్రకాశం బ్యారజే లభించేది కాదు . ఆయన మరెవ్వరో కాదు .....అపర భగీరధుడు గా పేరొందిన "సర్ అర్ధర్ కాటన్ ". కృష్ణా గోదావరి డెల్టా ను సస్యశ్యామలం చేసిన కాటన్ కు తెలుగువారు గుండెల్లో గుడి కట్టి ఆరాధిస్తున్నారు .తమ పిల్లలకు ఆయన పెరుపెట్టుకుంటున్నారు.( చూసారా ఎవ్వరో యూరపు వాళ్లు వచ్చి చేస్తే కాని మనకి తెలిలేదు -:))
ఈ నెల మనము ఆయన ౨౦౬ (రెండొందల ఆరు ) వ జయంతి జరుపుకుంటున్నాము . మనమందరము ఆయనకు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుందాము.
(మా రోటరీ క్లబ్ సౌజన్యంతో )
22, మే 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 కామెంట్‌లు:
మా గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా కాటన్ మహాశయుడిదే.. మా జిల్లాలలో ఆయన విగ్రహాలు ఉంటాయి.. అంత భక్తి మాకు ఆయన అంటే.. చక్కని టపా అండి.. (హెడ్డింగ్ చూసి ఇంకేమిటో అనుకున్నా :) )
ఇప్పుడు క్రొత్త అపరభగీరథుడొచ్చాడండి,చిరుజల్లులకే కొట్టుకుపోయే ఆనకట్టలు కట్టిస్తున్న మగానుభావుడాయన.మరి ఆయనకు చెప్పరా శుభాకాంక్షలు
మా గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా కాటన్ మహాశయుడిదే.. మా జిల్లాలలో ఆయన విగ్రహాలు ఉంటాయి.. అంత భక్తి మాకు ఆయన అంటే.. చక్కని టపా అండి..
ఎక్కడో చదివినట్టు ఉందా :)
మురళి గారి కామెంటే నాది కూడా !
నా కాయనంటే కోపం, దోచి అన్ని నీళ్ళు మీ జిల్లాలకు కట్టపెట్టి రతనాల మా రాయలసీమను ( ఆంధ్రా అయినా మమ్మలెవరూ ఆంధ్రా వాసులనరండి ) ఎడారి చేసి బొంద పెట్టిన సన్మార్గుడు ( అం తె మంచి వ్యక్తిని దుర్మార్గుడనలేక సన్మార్గుడు అన్నానండి). మా రాష్ట్రం రానివ్వండి దగ్గరలో ఓ నాలుగు నదులను తవ్వుకొని మీకు చుక్క కూడా రానివ్వం.
Good information....
మేమూ గోదావరి జిల్లాల వాళ్ళమేనండి. అందునా ధవళేస్వరంలో నాన్న గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన ఆర్థర్ దొర గారు కట్టించిన గెస్ట్ హవుసులోనే నివాసముండేవారం. ఆయన గొప్పదనాన్ని అనునిత్యం తలపోసుకుంటూవుండేవారం. అంతేకాక నాన్న గారి వలన ఆయన లో ని ఇంజనీరింగు నైపుణ్యత గురించి కూడా తెలుసుకున్నాను. దేశం, భాష పనిలో అంకితభావం గలవారికి అడ్డుగోడలు కావన్నదానికి ఆయనే తార్కాణం.
ఇప్పుడే తడిచాను వర్షంలో...
భలేగా ఉందండి!!!!
కాటన్ దొర పేరు అంటే .. 'కాటయ్య' లాంటివా? ఒకట్రెండు ఉదాహరణలు చెప్పండి.
nenu tommidava taragatilo undagaa maaku , Sir Aurther Cottonane paatham undedi.Kaani daanni chadavaalante maatram daannanta bore lesson unkoti ledanipinchedi.Ivaala mee post choosi aa 'APARA BHAGEERATHUNI' ki nenu kooda nivaali arpinchi tirigi
aa paatham malli chaduvutaanu......thanq chinni gaaru aayanni gurtuchesinanduku.
@మురళి
@పరిమళం
@ఉష
@ఈ గోదారి వాళ్లకి ప్రేమలేక్కువండి ...అందుకే ఒకే మాట ఒకే భాట :) ఉష గారు నిజంగా మీరు చాల అదృష్టవంతులు .@అబ్రకదబ్ర గారు ....మీ పిల్లలకి ఎవరికైనా ఆయన పేరు పెట్టదలిచార?...:)
@అజ్ఞాత ధైర్యంగా మీ బ్లాగ్ నుండి కామెంట్ రాయొచ్చు కదా ....ఆ మాత్రం ధైర్యం వుండాలి .
@పద్మర్పిత ధన్యవాదములు
@సంఘమిత్ర ...నా బ్లాగ్ కి వచ్చినందుకు ధన్యవాదములు .
@భాస్కర రామిరెడ్డి గారు
ఏంటండీ మీరు ఆంద్ర వాళ్ళు కాదన్నది ఎవరండి? మనది రాయలసీమా! ఇంకేం తవ్వుతారండి ....మొత్తం మీదేగా రాజ్యం ..తొమ్మిదేళ్ళు రాయలసీమ బాబు గత ఐదు ఏళ్ళుగా రాజ వారు మరో ఐదేళ్లు వీరే ....ఇంకేముందండి కృష్ణా గోదారిలో ......:) అన్నట్టు మీ తిట్టు బాగుందండోయ్ "సన్మార్గుడు".....
కామెంట్‌ను పోస్ట్ చేయండి