26, నవంబర్ 2010, శుక్రవారం

దేశవాళి తిండ్లు -రేగువడియాలు


ఈ రోజు ఇంకొకరకం దేశవాళి తిండి పరిచయం చేస్తున్నాను .పైన ఫోటోలోని చక్రం ఆకారం చూసి పిడక అని భ్రమ పడతున్నారేమో కానేకాదు ,దీనిని "రేగుపండు వడియం "అంటారు .ఒక సంవత్సర కాలం నిలువ వుంటాయి.ఇవి ఎక్కవగా గోదావరి జిల్లవాళ్ళు అక్కడక్కడ మావంటి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా పట్టి నిలువ ఉంచుతారు .పైన చూసేది కొన్న రేగువడియం ..ఇంట్లో చేస్తే ముద్దగా ఇంకొంచెం చిన్నగా రంగు పండు మిరప కలిగి వుంటాయి .
రుచి ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా ,కారం కారంగా కొంచెం తియ్యగా వుంటుంది .నేను అత్యంత ఇష్టపడే ఫుడ్ లో రేగువడియాలు ఒకటి .అమ్మ మాకోసం తప్పనిసరిగా సీసన్ లో తయారు చేసేది .మా చిన్న తమ్ముడు శ్రీను కి ప్రాణం ఇవి వుంటే వేరే ఫుడ్ గురించి ధ్యాస వుండదు ...వాడి కి సప్తసముద్రాల అవతల వున్నా కొరియర్ చేయడం మరిచిపోము .
రుచి చూస్తారా ?అడ్రెస్స్ ఇవ్వండీ పంపిస్తాను :-)

9 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

ఈ రేగు వడియాలను , మురమరాల వడియాలను , మా వంటావిడ విజీనగరం ( విజయనగరం -ఆవిడ అలానే అనేది లేండి:) ) నుండి తీసుకొచ్చేది . కాబట్టి వాటి రుచి తెలుసు . అందుకని పంపమని అడగను లెండి :)

teresa చెప్పారు...

chinnappudeppudO tinnanu. palate kottukupotumdi ganee bhale ruchiga umtaayi :)
bazar lO ammutarani teleedu.

జయ చెప్పారు...

ఏవిటోనండి...అంత క్లోజప్ లో నల్లగా చూస్తోంటే భయమేస్తోంది. ఇంకోసారి, మీరింట్లో చేసినప్పుడు అడిగి తింటాలెండి. ప్లీజ్. నా మాటిని కొంచెం బుజ్జులుక్కూడా దూరంగా ఉంచండి.

ఉమాశంకర్ చెప్పారు...

గుంటూరు జిల్లా దేశవాళీ చిరుతిండ్లు కూడా కొన్ని పరిచయం చేయండి... :)

అజ్ఞాత చెప్పారు...

రేగొడియాలు అని ఒక బ్లాగు కూడా ఉంది.
నాకు తెలుగు బ్లాగులని పరిచయం చేసింది ఆయనే.
http://trajarao.wordpress.com/

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
ఒకే ఒకే అండీ చెల్లాయిగారిలా వాటిని చూసి జడుసుకుని నైస్ గా చెప్పెసినట్లున్నారు విజీనగరం వాళ్ళ ద్వారా రుచి చుసేసాం అని ....సరే సరే పంపం లెండీ :-)
@teresa
నిజమేనండీ ..అయిన ఆ రుచి ముందు ఏమి ఆలోచించలేము .చాగల్లు దగ్గరలో రేగువడియాలు తయారుచేసే పరిశ్రమ కూడా వుందని విన్నాను నాకు తెలిసి ఎప్పటినుంచో అమ్మకం జరుగుతుంది .నాల్గేళ్ళ క్రిందటే రాజమండ్రి నుంచి ఒక ఫ్రెండ్ కొని పంపారు .
@జయ
అయ్యో చూడటానికి అలా వున్నాయి కాని తింటే బాగున్నాయండీ .బుజ్జులు ని వెళ్ళనీయను లెండీ..కాని తేగలు మాత్రం తెగ తినేస్తుంది .సరే నేను పట్టినపుడు చెప్తానులేన్డీ :-)
@ఉమా
గుంటూరు వాళ్ళు అనగానే గోంగూర పండుమిరపకారం గుర్తోస్తుందండీ.పచ్చళ్ళు గురించి రాయమంటే రాసేస్తాను .:-).మీరే పరిచయం చేయాలి మీ చిరు తిండ్ల గురించి .
@bonagiri
చుస్తానండీ ..ధన్యవాదాలు .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

:-)

Hima bindu చెప్పారు...

@బా .రా.రె
ఏంది బాబు ఆ నవ్వుకి అర్ధం ?ఓహో !ప్రకాశం వాళ్ళకి చింతపండు మాత్రమె తెలుసు ఇది తెలీదని అర్ధమా........... అప్పుడెప్పుడో మీకు లలితగారు రేగొడియాలు ఇమానం ద్వారా పంపిస్తాం అన్నారు ,బద్రంగా చేరాయా:-)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఓహో మీరు నవ్వుల అర్థాలు భలే చెప్తున్నారే.... ఇంతకీ ఈ నవ్వు అర్థమేమిటో :)