
ఈ రోజు ఇంకొకరకం దేశవాళి తిండి పరిచయం చేస్తున్నాను .పైన ఫోటోలోని చక్రం ఆకారం చూసి పిడక అని భ్రమ పడతున్నారేమో కానేకాదు ,దీనిని "రేగుపండు వడియం "అంటారు .ఒక సంవత్సర కాలం నిలువ వుంటాయి.ఇవి ఎక్కవగా గోదావరి జిల్లవాళ్ళు అక్కడక్కడ మావంటి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా పట్టి నిలువ ఉంచుతారు .పైన చూసేది కొన్న రేగువడియం ..ఇంట్లో చేస్తే ముద్దగా ఇంకొంచెం చిన్నగా రంగు పండు మిరప కలిగి వుంటాయి .రుచి ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా ,కారం కారంగా కొంచెం తియ్యగా వుంటుంది .నేను అత్యంత ఇష్టపడే ఫుడ్ లో రేగువడియాలు ఒకటి .అమ్మ మాకోసం తప్పనిసరిగా సీసన్ లో తయారు చేసేది .మా చిన్న తమ్ముడు శ్రీను కి ప్రాణం ఇవి వుంటే వేరే ఫుడ్ గురించి ధ్యాస వుండదు ...వాడి కి సప్తసముద్రాల అవతల వున్నా కొరియర్ చేయడం మరిచిపోము .
రుచి చూస్తారా ?అడ్రెస్స్ ఇవ్వండీ పంపిస్తాను :-)