26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

హై వే ఎప్పుడొస్తుందో ?


మొన్నీ మధ్య అత్యవసరంగా హెడ్ ఆఫీసు కి వెళ్ళాల్సి వచ్చింది .మీటింగ్ అటెండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చేయొచ్చు ఏ టైం అయిన అని రోడ్ మార్గం ఎంచుకున్న .నాతో పాటు క్యాంపు క్లార్క్ ,ఆఫీసు సబ్ స్టాఫ్ వున్నారు .ఆ సబ్ స్టాఫ్ ఏడాది క్రితం తండ్రి చనిపోతే కంపషినాట్ గ్రౌండ్స్ లో చేరాడు ,చదువు పెద్దగ లేదు పది చదివినట్లున్నాడు వయసు పందొమ్మిది ఉండొచ్చు . నా ఆఫీసు కి వచ్చే ఫ్రెండ్స్ అతన్ని ముద్దుగా అతి వినయం అని పిలుచుకుంటారు .నేను ఊరు బయలుదేరుతుంటే "అమ్మ నేను వస్తాను ఇంతవరకి హైదరాబాద్ చూడలేదు " అన్నాడు . అతనికి వైజాగ్ నుండి నెల్లూరు వరకే తెలుసు తరచూ నా కూడా ఉంటాడు .ప్రయాణం మొదలవ్వగానే అలవాటు ప్రకారం పుస్తకం తీశాను ,ఎప్పుడో మొదలెట్టి వదిలేసినా 'ది అల్కెమిస్ట్ ' తీశాను . ఈ పుస్తకం కంటే ఈ ముగ్గురి పిల్లల కబుర్లే ఆసక్తిగా వున్నాయి .డ్రైవర్ కూడా ఇంచుమించు మా అతివినయం వయసే .పుస్తకం పక్కన పడేసి నేను కూడా వాళ్ళ సంభాషణలో పడిపోయాను .అప్పటికి మేం బయలుదేరి మూడు గంటలు అయ్యింది .ముందు సీట్లో వున్నా డ్రైవెర్ని వినయం విసిగిస్తున్నాడు నాకు వినబడకుండా .డ్రైవెర్ తెగ నవ్వేసుకుంటూ వస్తుంది ..వస్తుంది అంటున్నాడు .మా క్లార్క్ కూడా నవ్వుతున్నాడు .,ఇద్దరు కలసి ఆ అబ్బాయిని ఎడ్పిస్తున్నారు.ఏవిటని అడిగితె ఎమిలేదంటారు .మరో అరగంట తరువాత ఆ పిల్లాడు అడగడం మరల అదే సమాధానం చెప్పి నవ్వడం చేస్తున్నారు . ఇక వాళ్ళు నవ్వలేక నాకు చెప్పారు ,.."హై వే ఎప్పుడొస్తుంది" అని మూడు గంటల నుండి అతివినయం వాళ్ళ ప్రాణం తీస్తున్నాడని ,డొంక రోడ్లో ఎందుకన్నా బండి తీస్కేల్తావు హై వే లో పోనీయమని .వీళ్లేమో ముందు వస్తుంది అని మభ్యపెడుతూ అతన్ని ఆడుకుంటున్నారు .అతని అమాయకత్వానికి నేను కూడా నవ్వులు కలిపి ఇంకో గంటలో రావొచ్చు అన్నాను .మేం ఇంకో గంట ప్రయాణం చేస్తే ఫోర్ వే వస్తుంది అని ,మనం ఇప్పటివరకి ప్రయాణం చేసింది హై వే నే 'డొంక రోడ్డు "కాదు ,ఇంకా ఈ రూట్ చెన్నై కలకత్తా రూట్ లా ముస్తాబు అవ్వడానికి మరికొంత కాలం పట్టొచ్చు అని వివరించాను .ఎంతో గొప్పగా ఊహించి హైదరాబాద్ ప్రయాణం అయ్యిన మా వాడికి ఊహించని షాక్ ఈ హై వే . అయిదవ నంబరు జాతీయ రహదారి మీద ప్రయాణం చేసిన వారికి తొమ్మిదో నంబరు రహదారి అదీ నందిగామ నుండి హైదరాబాద్ వరకి నరకమే . నల్గొండ జిల్లా మొదలైన దగ్గరనుండి అడుగడుగునా మోహరించిన ' రక్షక దళం' రహదారి కి రెండు చోట్ల చిన్చిఛిన్న గోడలు, కూల్చి వేసిన దృశ్యాలు .ఈ రక్షకదళం లేకపోతె సురక్షిత ప్రయాణం కల.
నిత్యం వేల వాహనాలు తో అతి రద్దీ గా వుండే ఆ రహదారి ఇప్పటికి అభివృద్ధి చెందలేదు. ఇరుకైన దారులు ,మలుపులు దారుణమైన ఆక్సిడెంట్లు ఆ దారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా అవతల వచ్చే క్వారీ లారీ వాళ్ళు జాగ్రత్తగా వుండరు .పదిహేను ఏళ్ళ క్రితం నాన్న కజిన్ ఫ్యామిలీ తో మా భందువుల పెళ్ళికి వస్తు చిట్యాల దగ్గర దారుణమైన ఆక్సిడెంట్ కి గురయ్యారు. స్టేట్స్ లో చదువుతున్న పెద్ద అమ్మాయి తప్పించి నలుగురు పిల్లలు ,ఆ పిన్ని బాబాయి తీవ్రంగా గాయపడ్డారు ఆయన స్పాట్ డెడ్ చిన్న వయసులోనే . .ఆ దారి నా చిన్నప్పటి నుండి ఇప్పటికి అలానే వుంది.ఆ దారి మృత్యు రహదారి .
ఆ రోడ్ మార్గాన్ని ఆధునికరించాల్సిన అవసరం యంతైన వుంది ప్రమాదాలు నివారించే దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలి ......
చూడాలి ఈ హై వే ఎప్పుడొస్తుందో -:):). .
.

9 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

హ హ. మాది సూర్యాపేట (ఇదివరలో) . ఆ హైవే దానిమీదుగానే వెళుతుంది కాబట్టి దానిగురించి బాగా తెలుసు. మా ఇల్లు కూడా కొత్త బస్సు స్టాండు ఎదురుగ్గా హైవే పక్కనే వుండేది. ఎన్నడో నాలుగు లేన్ల హైవే కావాల్సింది కానీ వివిధ రాజకీయాల వల్ల అలా అలా పని అవకుండా సా..గుతూనేవుంది. ఆ హైవే గురించి కొన్ని ప్రజాందోళనలూ జరిగాయి కానీ, జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా వున్నా కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. మాకు తెలిసిన వారు కూడా కొద్ది మంది చనిపోయారు. ఎప్పుడన్నా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాదు నుండి సూర్యాపేట వెళితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళుతుంటాను.

Change Maker చెప్పారు...

హైవే లేనప్పుడు బాధ ఒకటైతే , అది వచ్చిన తరువాత కూడా దానిని వాడే విధానపు భాధలు ఇంకొన్నండి. లేన్ ఉపయోగం లేదు, లారీ ఆటో అందరూ రోడ్ మధ్యలొనే రెండు లేన్లకు మధ్యలో వెల్తుంటారు. ఇంకా అపాయం, డివైడర్ ఉంది అని రాంగ్ రూట్ లో వచ్చేస్తుంటారు . వెరసి ప్రాణాలను బిగ పట్టుకుని వెళ్ళాలి.

కొత్త పాళీ చెప్పారు...

నాదీ మీ అతివినయం ప్రశ్నే. హైవే ఎప్పుడొస్తుంది?

భావన చెప్పారు...

అవును నేను కూడా ఇండీయా వచ్చినప్పుడు మా డ్రైవరోడు విసుక్కుని అంత భయమైతే వెనక కూర్చోడి అని చెప్పేడు ఆ రోడ్ మీద వెళ్ళేప్పుడు. జాగర్త.

మురళి చెప్పారు...

అలాంటి రోడ్డు మీద ప్రయాణం కన్నా ఏ ట్రైన్ కో వెళ్ళడం మంచిది కదండీ.. అంతగా ఐతే హైవే వచ్చాక కార్లో వెళ్దురు గాని :):)

జయ చెప్పారు...

పాపం. హైవే...మీరెప్పుడు చూపిస్తారో ఏవిటో! ఎప్పుడైనా సరే, ఆ కోరిక తీర్చండి పాపం. అంత అతివినయంగా ఉన్నాడని, ఒదిలేయకుండా తప్పకుండా చూపించండి. లేకపోతే హైద్రాబాద్ రోడ్లమీద తిప్పినాక, మీరొచ్చిందే హైవే అని చెప్పండి. అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటాడు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయిదో నెం. రహదారి చాలా బాగుంటుందండి..నీట్ గా ఇరువైపులా పూల మొక్కలతో అందంగా ఉంటుంది..పాపం ఆ అబ్బాయిని అలా ఆడుకున్నారా మీ డైవర్...అతివినయం దూత లక్షణం అని ఆ అబ్బాయితో చెప్పండి..:).

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఛీ..మీ ఊర్లన్నీ గబ్బు ఊర్లు. మా ఊరికి బండ్లబాట వుంది. తెలుసా !

ఈ సూర్యాపేట రోడ్డులో ఒక్కసారి ప్రయాణించానండీ..అప్పటినుంచి ఇంక ఆ రోడ్డులో పోకూడదనుకొని రూటు మార్చేసి, సాగర్ రోడ్డులో వెళ్ళేవాళ్ళము.

Hima bindu చెప్పారు...

@శరత్ 'కాలం '
ప్రశాంతంగా అయితే వెళ్ళలేము కళ్ళన్నీ డ్రైవర్ మీద పెట్టుకుని చూడాల్సిందే
@బాటసారి
నిజానికి ఫోర్ వే వచ్చాక ఆక్సిడెంట్ల శాతం తగ్గిందండి ,రద్దీ అంతా సర్వీసు రోడ్స్లోనే వుంటుంది .
@కొత్తపాళీ
బహుశ నేను రిటైర్ అయ్యాక వస్తుందేమో -:):)
@బావన
ఇంట్లో వాళ్ళు అస్సలు ఉరుకోరు ఆ రోడ్ మీద బుల్లివాహన ప్రయాణం. అత్యవసరం అయినపుడే మనం అలా
@మురళి
హిహీ కొత్తపాళీ గారికి చెప్పిన సమాధానమే మీకును .
@జయ
మా అతివినయం ఐదో నంబరు జాతీయ రహదారి కి సుపరిచుతుడు ,హైదరాబాద్ షార్ట్ కట్ లో 'డొంకరోడ్లో ' వెళ్తున్నాం అని అనుకున్నాడు .
@శేఖర్
అవునండీ ఆ రహదారిలో ప్రయాణం ఆహ్లాదంగా వుంటుంది మా వినయం వాళ్ళ నాన్న వారసత్వం పుణికి పుచ్చుకున్నడులెండి..పాపం చిన్నోడుగా అందుకే అంత వినయం .
@భా.రా.రె
హమ్మ్ .!ఎంతమాట ....మీ ఊరికి బండ్లబాట ?నేనింకా ముళ్ళ బాట అనుకుంటున్నా ..అయినా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు మా జిల్లాని చుస్తే ఓర్చుకోలేరు ....