21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏకాంత సౌధం లో

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు ఓ జహాపనా
నిదురించు ఓ జహాపనా

పండు వెన్నోల్లో ....వెండి కొండల్లే !పం !
తాజ్ మహల్ .....ధవళ కాంతుల్లో
నిదురించు.......... జహాపనా
నిదురించు........... జహాపనా

నీ జీవితా...జ్యోతీ.......నిను చూడ మూర్తీ
ముంతాజ సతి ....సమాధీ
సమీపానా నిదురించు జహాపనా
నిదురించు ......జహాపనా .!.ఈ !

నా డైరీ లో ఒక పేజీ .
ఈ పాటఎన్ని సార్లు విన్న మరీ మరీ వినాలనిపిస్తుంది పౌర్ణమి వెన్నెల్లో తాజ్ మహల్ అందాలు , చివరిరోజుల్లో కొడుకు చేత బందీ అయ్యి ప్రియమైన తన భార్య కోసం వేదన చెందే దృశ్యం మనోఫలకం పై గోచరిస్తుంది . పాట ఎవరు పాడేరో తెలియదుకాని సినిమా "నీరాజనం "ఇందులో పాటలన్నీ చాల చాల బాగుంటాయి .సంగీతం ఓ.పి.నయ్యర్.
.మనస్సు బరువెక్కుతుంది.. మనసులోని మమత ఏరులై కన్నీరై నన్ను తడిపేస్తుంది .ఒలికిన పాలను ఎత్తలేని నా నిస్సహాయత నన్ను కుదిపేస్తుంది .12 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

సినిమాకి పాడిన వారు ఎమ్మెస్ రామారావు గారండీ.. ('సుందరకాండ' (శ్రీ హనుమాను గురుదేవులు నాయెడ పలికిన సీతా రామ కథ) ఫేం) ..ఈ పాటని పాలగుమ్మి విశ్వనాధం గారి (కథారచయిత పాలగుమ్మి పద్మరాజు గారి సోదరుడు, మధుర గాయకుడు) గొంతులో వినలేదా ఎప్పుడూ? ఒక చిత్రమైన అనుభూతికి లోనవుతాం.. చక్కని పాట గుర్తు చేశారు..

కొత్త పాళీ చెప్పారు...

ఈ పాటని జ్యోతిగారి బ్లాగులో కొంతకాలం క్రితం పరిచయం చేసిన గుర్తు.
Anyway, welcome back.

జయ చెప్పారు...

ఏకాలమైనా ప్రేమ ఎంత గొప్పదో, విలువ తగ్గని ఆ ప్రాధాన్యత ఈ పాటలో ఇంక విశిష్టంగా తెలుస్తుంది. బాగుంటుందండి ఈ పాట. మీరన్నట్లు నిజంగానే కంట నీరు తెప్పిస్తుంది.

పరిమళం చెప్పారు...

నేను చెప్పాలనుకున్నది మురళిగారు చెప్పేశారు . నా చిన్నతనంలో స్వయంగా ఆయన పాడగా వినగలగటం నా అదృష్టం. మేం తెనాలిలో ఉన్నప్పుడు కన్యకాపరమేశ్వరి గుడిలో ఆయన సుందరకాండ పారాయణ జరిగింది.ప్రతిరోజూ అమ్మ చేయిపట్టుకొని వెళ్ళేదాన్ని.ఆయన సంతకంచేసిన సుందరకాండం పుస్తకం ఆయన చేతులమీదుగా అందుకోవడం మరచిపోలేని అనుభవం !మరోసారి ఆయన గానమాదుర్యాన్ని తలుచుకొనే అవకాశం కలిగించారు .ధన్యవాదాలండీ ..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్ గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్.. గుర్.. గుర్ర్గుర్

:-)

సుజాత వేల్పూరి చెప్పారు...

చిన్ని గారూ,
ఆ పాట నీరాజనం సినిమా కోసం పాడలేదు ఎమ్మెస్ రామారావు గారు. దశాబ్దాల క్రితం ఆయన పాడిన లలిత గీతం అది. అదే ట్యూన్ ని సినిమాలో ఇంటర్ లూడ్స్ మార్చి ప్లెయిన్ గా( తబ్లా లేకుండా) వాడుకున్నారు.మంచి పాట!

Hima bindu చెప్పారు...

@మురళి
నచ్చింది పదేపదే వినడమే తప్పించి మిగిలినవాటి జోలికి పోవడం తక్కువ ,మనకి పాండిత్యం తక్కువ
@కొత్తపాళీ
నిజానికి ఆ పాటవిన్నప్పుడల్లా చాల దుఖం వస్తుందిఅలాగే రాయప్రోలు రాసిన మాతృగీతాలు చదివిన ఇదే ఫీలింగ్.స్మృతిగా మిగిలిపోయిన నా చిన్నారి శాశ్వతంగా నిద్రపోయిన ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటూ రాసుకున్నానండీ ..(దగ్గరలో వున్నతన పుట్టిన రోజు తలుచుకుని )
జ్యోతిగారు రాసింది చూడలేదండీ .మీరు చెప్పాక వెదికాను.కనబడలేదు .
@జయ
అవునండి ప్రేమ గొప్పదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు .
@పరిమళం
ధన్యవాదాలు .
@భా.రా.రె
అంత ఫుల్ల్గా తిన్నారా? ఏం వండారేంటిగుర్రు పెట్టి నిద్రపోతున్నారు .
@సుజాత
ధన్యవాదాలండీ ..

జ్యోతి చెప్పారు...

http://jyothivalaboju.blogspot.com/2008/07/blog-post_23.html

Hima bindu చెప్పారు...

@JYOTHI
thanksandee ..touching.

Hima bindu చెప్పారు...

చిన్న సవరణ ;మాతృ గీతాలు రాసింది నాయని సుబ్బ్బారావు పొరపాటున రాయప్రోలు అని రాసాను ..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Paata vintu nidrapoyi madhyalo comment vraaste ilaage vuntindi. Emi ledandi, jyothy gaari blog lo raatri aa paata vintinte haayigaa nidra vacciindi.

భావన చెప్పారు...

మంచి పాట. రామారావు గారి నోటి నుంచి ఇంకా హృద్యం గా పలికింది.