నిదురించు ఓ జహాపనా
నిదురించు ఓ జహాపనా
పండు వెన్నోల్లో ....వెండి కొండల్లే !పం !
తాజ్ మహల్ .....ధవళ కాంతుల్లో
నిదురించు.......... జహాపనా
నిదురించు........... జహాపనా
నీ జీవితా...జ్యోతీ.......నిను చూడ మూర్తీ
ముంతాజ సతి ....సమాధీ
సమీపానా నిదురించు జహాపనా
నిదురించు ......జహాపనా .!.ఈ !
నా డైరీ లో ఒక పేజీ .
ఈ పాటఎన్ని సార్లు విన్న మరీ మరీ వినాలనిపిస్తుంది పౌర్ణమి వెన్నెల్లో తాజ్ మహల్ అందాలు , చివరిరోజుల్లో కొడుకు చేత బందీ అయ్యి ప్రియమైన తన భార్య కోసం వేదన చెందే దృశ్యం మనోఫలకం పై గోచరిస్తుంది . పాట ఎవరు పాడేరో తెలియదుకాని సినిమా "నీరాజనం "ఇందులో పాటలన్నీ చాల చాల బాగుంటాయి .సంగీతం ఓ.పి.నయ్యర్.
.మనస్సు బరువెక్కుతుంది.. మనసులోని మమత ఏరులై కన్నీరై నన్ను తడిపేస్తుంది .ఒలికిన పాలను ఎత్తలేని నా నిస్సహాయత నన్ను కుదిపేస్తుంది .