26, జులై 2010, సోమవారం

ఆషాడం -గోరింటాకు

ఆషాడం లో గోరింట పుట్టింటికి వెళ్తుందట ,అని మా నాయనమ్మ చెబుతుండేది అందుకే అడిగినంత పండుతుందట ,అందుకని తప్పనిసరిగా శాస్త్రనికయినా పెట్టుకోవాలనేది ,ఇప్పుడు ఇలా గుర్తుచేయడానికి దగ్గరుండి మా అందరికి పెట్టడానికి నాయనమ్మ లేదు కాని ఆషాడం రాగానే ఆ మాటలు పదే పదే గుర్తొస్తాయి .
మా అమ్మ కూడా అంతే తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటుంది ,లేత చిగురుటాకులు తెప్పించి కాటుకలా రుబ్బించి మా అందరికి పంపిస్తుంది .చిన్నప్పుడైతే ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం ,పెద్దయ్యాక ఆ ఇంటరెస్ట్ లు తగ్గిపోయాయి కాని అమ్మ మాత్రం వెంటపడి మరచిపోకుండా మా చేత గోరింటాకు పెట్టిస్తుంది .
నిన్న ఆదివారం సాయంత్రం అమ్మ గోరింటాకు పంపి మరల మేం ఎక్కడ పెట్టుకోకుండా మరచిపోతామో అని రాత్రి ఫోన్ చేసి మరీ గుర్తు చేసి మా చేత చేతికి రంగులు అద్దించింది ,ప్రొద్దున్నే నిద్రకళ్ళ తో లేచి అరచేతులు చూసుకుంటే యంత మురిపెంగా అనిపించిందో చిన్నప్పుడు నాది బాగా పండింది అంటే నాది పండింది అని పోటీలు పెద్దోల్ల దగ్గర తీర్పులు ...... ఆ పచ్చివాసనలో ఎన్నెన్నిజ్ఞాపకాలో ........

3 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

Photo pettalsindi kadandi..

రాధిక(నాని ) చెప్పారు...

నేను కూడా పెట్టుకున్ననండి గోరింటాకు . మా ఊరిలో ఈ టైంలో గోరింటాకు మొక్కలకు ఒక్క ఆకు కుడా ఉండదండి .అన్దరూ కోసేస్తారు.

Hima bindu చెప్పారు...

@మురళి
ఈసారి గోరింట పెట్టినప్పుడు ఫోటో పెడతానండి:-)
@రాధిక (నాని)
చిన్నప్పుడు మనము అంతే ,ఆఖరికి పల్లెటూరు వెళ్ళినప్పుడు సీమతుమ్మఆకులు కూడా గోరింటాకు అనుకుని కోసేసేవాళ్ళం:-)