3, జూన్ 2010, గురువారం

ఇదీ అసలు కథ

ట్రింగ్ ట్రింగ్ ...ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ ఫోన్ ఒకటే గగ్గోలు ..చేతిలో చదువుతున్న పుస్తకం తీసి ప్రక్కన పడేసి టైం చూసాను ఇంచుమించు చిన్న ముల్లు పెద్దముల్లుపన్నెండు దగ్గర కలుసుకుంటున్నాయి...ఈ టైం లో ఎవరు చేస్తారా అనుకుంటూ ఫోన్ వైపు కదిలి నంబర్ డిస్ప్లే వైపు చూసాను .....రెండు వీదులవతల వున్నా అమ్మ నుంచో లేక ఇంటి పైన ఉంటున్న చెల్లి ఇంటి నుండో అని ఊహిస్తూ ..నా ఊహ నిజం చేస్తూ అమ్మ నుండే ...ఏంటమ్మా ఈ టైములో ఒకింత కంగారుగా అడిగాను .సాయంత్రం మొదలైన తలనొప్పి ఇప్పటివరకు తగ్గలేదని ,బి.పి టాబ్లెట్ వేసుకున్న అలానే వుందని , క్రోసిన్ టాబ్లెట్ పడితేనే తగ్గోచ్చని ,వేసుకుందాం అంటే ఇంట్లో లేవని కాస్త ఇంట్లో వుంటే పంపమని సారాంశం .గబగబా మందుల డబ్బా వెదికి క్రోసిన్ షీట్ దొరకబుచ్చుకుని ఈయన గాని మెలకువగా వుంటే పంపిద్దాం అని బెడ్రూం తలుపు తెరచి చూసాను గాడంగా నిద్రపోతున్న తనని చుస్తే లేపాలి అనిపించక స్టాండ్ మీదున్న చున్ని తీసి బుజాలపై పడేసుకుని మెయిన్ డోర్ తీసి లాక్ చేసి అమ్మ వాళ్ళింటి వైపు కదిలాను .
బజారు నిర్మానుష్యంగా వుంది .మా వీది కి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ,అమ్మ వాళ్ళ ఇల్లు రెండు వీధులు దాటితే వస్తుంది ఆ కాలనీ అంతా చెట్లతో వీధిలో వున్నా దీపాల కాంతికూడా సరిగ్గా పడదు ,కొంచెం దూరం నడిచానో లేదో పక్క బజార్ నుండి ఒక అమ్మాయి గాజులు గలగలా లాడించుకుంటూ నా ముందు నడుస్తూ వెళ్తుంది.హమ్మయ్య నాకు ఒక తోడున్నారు కదా అనుకుంటూ కాలికి అడ్డం పడుతున్న నెయిటితో అవస్థపడుతూ కాస్త వేగంగా నడిచే ప్రయత్నం చేస్తూ ముందు వెళ్తున్న అమ్మాయి వైపు చూసాను నడక వింతగా అనిపించింది భూమి మీద కాళ్ళు ఆని ఆననట్లు వున్నాయి ....తేరిపార చూద్దును కదా కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ...అంతే గుండె జల్లుమని గొంతులో కేక గొంతులోనే వుండగా ఆమెను దాటుకుని వేగంగా పరుగు పెట్టాను..నా వెనుక కొంత దూరం వస్తున్నట్లు గాజుల సవ్వడి ఎక్కడిలేని ధైర్యం తో అమ్మ వాళ్ళ గేటు లో అడుగు పెట్టాను .ఇంటిముందున్న లాన్ ని దాటుకుంటూ గుమ్మం వైపు చూడగా గుమ్మంలో అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ......
అయ్యో నువ్వు వచ్చావేంటి తల్లి అబ్బాయి లేడా.....అయిన ఏవిటా చెమటలు అంత కంగారుగా వున్నవేంటి అంటూనే నా చేతిలో టాబ్లెట్స్ తీసుకుంది ,నేను ఒగురుస్తూ దారిలో జరిగిన విషయం చెప్పాను వీధిలోకి చూస్తూ ...."అమ్మఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ,దేయ్యలకేగా అలా వుండేది "అన్నాను .
అమ్మ నా వైపు తేరిపార చూస్తూ ......అవునా ఎలా ఉన్నాయమ్మ ...ఇలా ఉన్నాయా అంటూ చీర కుచ్చిళ్ళు కొంచెం పైకి జరిపింది .....
ఒక్కసారే కెవ్వున కేక వేసి వెనక్కి పరుగు తీశాను వెనక్కి తిరిగి వున్నా ఆ పాదాలను చూసి ......నా కేకలకి చెళ్ళుమని బుజం ఒక్కదెబ్బ వేసి లేపెసారు మావారు ...త్రుళ్ళి పడి లేచి చుట్టూ చూసాను .....మంచం మీద వున్నాను ....మంచి నీళ్ళు త్రాగి పడుకో పీడకల వచ్చినట్లుందని నీళ్ళ సీస చేతికిచ్చారు .........(ఇదండి మనం చుసిన దయ్యం ....పిచ్చి కథలు విని ఇలా కలవరపడటం అలవాటే )

12 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఆ కలలో దెయ్యంకు మీపోలికలేనా లేక చిన్నప్పుడు చాక్లేట్ ఇయ్యమంటే ఊరించి ఊరించి తిన్న మిమ్మల్ని చూసి కసి పెట్టుకున్న మీ చిన్నప్పటి దెయ్యమా? ;)

Anil Dasari చెప్పారు...

దెయ్యాలూ క్రోసిన్ వేసుకుంటాయన్న మాట :-)

భావన చెప్పారు...

చిన్ని బంగారు తల్లి ఇలాంటి కలలు కూడా కంటావా? నా యమ్మే.. :-)

Hima bindu చెప్పారు...

@బా రా.రె
అర్రే చెప్పడం మరిచాను ..ఆ దెయ్యం న్యూ జెర్సీ నుండి వచ్చిన భా .రా.రె దేయ్యమాట !అమ్మాయి రూపం లో వచ్చిందట:-) ....ఇండియా చూసి చాల కాలం అయ్యింది..పనిలోపని చిన్ని ని కూడా ఒక సారి చూసిపోదామని వచ్చిందట .
@అబ్రకదబ్ర
నాకు మొన్నే తెలిసిందండి వాటికి క్రోసిన్ లు కావాలని :-)
@బావన
మన దగ్గర చాలా కళలు వున్నాయ్ మామ్:-)

ఉమాశంకర్ చెప్పారు...

ఇంకా నయం మీవారిని కాళ్ళు చూపించమని అడగలేదు..

శ్రీనివాస్ చెప్పారు...

దయ్యాలు ఆలా ఉండవ్ చల్లగా మంచుగాడ్డలాగా ఉంటాయి.

Hima bindu చెప్పారు...

@ఉమాశంకర్
ఇంకా నయం ఆ ఆలోచన రాలేదు అడిగినట్లయితే తన కాళ్ళు అలానే ఉన్నట్లయితే ఎక్కడికి పారిపోలేక దయ్యం ప్రక్కన ఉండలేక గుండాగి పోయేదేమో :-)
@శ్రీనివాస్
అమ్మో !నిజంగానే మీకు దయ్యలతో సహవాసం ఉన్నట్లుంది .....కూల్ కూల్ గా ఉంటుందని అంటున్నారు :-)

ప్రణీత స్వాతి చెప్పారు...

అబ్బ..ఎంత భయపెట్టారండీ..

Hima bindu చెప్పారు...

@ప్రణీత స్వాతి
నేను అలానే చాల భయపడ్డా అండీ .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కొంపదీసి రాం గోపాల్ వర్మ దెయ్యం సిరీస్ సినిమాల్లో ఒకదాని స్టోరీ ఎవరైనా మీకు చెప్పటం వల్ల ఇలా కల కన్నారా ఏంటి? లేకపోతే ఈవిల్ డెడ్ లాంటి సినిమాని పడుకోబోయే ముందు చేతివేళ్ళ మద్యనుండి చూసిచూడనట్టు చూశారా? ఏమాట కామాటే చెప్పాలి..మీ కల మాత్రం సూపర్బ్..:-)

Hima bindu చెప్పారు...

@శేఖర్
అబ్బే మనం అలాటి భయానకమైన సీన్స్ పొరపాటున చూడం..చదువుతాం ,వింటాం :)తలుచుకుంటేనే భయం అనిపిస్తుంటే సూపర్బ్ అంటారా :-(

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ గారికి అలవాటేమోనండీ..ఇలాంటి కలలు.