ధన్యవాదాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధన్యవాదాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఫిబ్రవరి 2010, శనివారం

సంవత్సరం అయ్యింది !

శుక్రవారం 6 ఫిబ్రవరి 2009

కొత్తగా బ్లాగు లోకం లోకి..

ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..



మళ్లీ ఇదేమి పిచ్చి అనుకుని నవ్వకండే... గత ఏడాది ఇదేరోజు బ్లాగ్ లోకంలోకి ప్రవేశించాను . పైన టైపు చేసింది నేను కాదు ,నేను ఏమనుకుంటున్న నో చెబితే నా ఫ్రెండ్ రాసారు ఓపికగా నా అల్లరి భరిస్తూ (అర్ధం కాక విసిగిచ్చేసాను ).......
నాలోని ఊహలుకు నాలోని ఊసులకు నడకలు నేర్పావు -:) మా బ్లాగ్ గురువుగారికి నమస్కారములతో .
-చిన్ని