21, జనవరి 2010, గురువారం

బ్లాగ్ లోకం -బంగారులోకం ముగింపు

బ్లాగ్ మిత్రులు భా.రా.రె బంగారులోకం మూడవ భాగం కూడా రాసి నూరు టపాలు పూర్తి చేయమని సలహా ఇచ్చారు .నిజానికి నేను చాల రాసినదాన్నే ఎందుకులే గొడవలు క్లుప్తంగా నాలుగు ముక్కలు రాస్తేపోలా అని ముగించేసాను .నావి వంద అని వారు చెప్పగానే వెళ్లి కౌంట్ చేసాను ....ఒక్కసారే నవ్వు వచ్చింది ..అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన పద్యం లీలగా గుర్తొచ్చింది .,"గంగి గోవుపాలు గరిట డయిన చాలు ....కడివిడయిన నేమి ఖరము పాలు "అన్నట్లు..మనం తోచనప్పుడల్లా నాలుగయిదు లైన్లు గెల్కి దానికి వంద లోకి ప్రవేశామా ! దానికి తగ్గట్లు మిత్రులు ముందస్తు శుభాకంక్షలా !

బ్లాగ్ లోకం -బంగారులోకం కొనసాగింపు తానోవ్వి నొవ్వక యెం రాయాలా అని ఆలోచిస్తే ''నిగ్రహం లేక నియంత్రణ" గుర్తొచ్చింది. ఇంకోమాటలో ఆత్మనిగ్రహం అనుకొందాం .నాకు నిగ్రహం అనగానే "ప్రవరుడు"గుర్తొస్తాడు .ప్రవరుడికి ఉన్నంత నిగ్రహం వుండాలని ..ప్రవరుడు ఎవరా అంటారా ?మా చుట్టం కాదండోయ్ ..(నేను రాసేది పండితులకు కాదని మనవి ) ప్రవరుడెవరో అతని ఆత్మా నియంత్రణ యేపాటిదో నాకు తెలిసిన కథ కొంచెం చెప్తాను .

పెద్దన రాసిన మహా ప్రభంధం "స్వారోచిష మను సంభవం" మన వాడుకలో 'మను చరిత్ర ' హీరో ప్రవరుడు -:) ఈ విప్రకుమారుడి ఊరి పేరు అరుణాస్పదం.చాలా బుద్దిమంతుడు ,ఇక చెప్పాలంటే సద్గుణ సంపన్నుడు .రోజు పూజ పునస్కారం ,ఇల్లు చక్కదిద్దుకుంటూ వుండగా ,ఒక రోజు వయసులో చిన్న అయిన "సిద్దుడు "లోక సంచారం చేసి మన హీరోగారి ఇంటికి వస్తాడు .వచ్చిన అతిధికి మర్యాదలు చేసి "స్వామి తవరికి ఇంత జ్ఞానం యల వచ్చింది ,ఏయే ప్రదేశాలు ,గిరి వన సముద్రాలు చూసారు చెప్పండీ ,అదీ ఇంత చిన్న వయస్సులో ,ఇంత స్వల్ప వ్యవధిలో ప్రపంచాన్ని ఎట్లా చుట్టారు (బ్లాగ్లంటే ఏంటి అని యల చూడాలో అని నేను అన్నట్లుగా అన్నమాట )అని ప్రవరుడు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు .అపుడు ఆ సిద్దుడు ,తనకి ఈశ్వరుని కృపచే పాద లేపనం అనే దివ్యవుషధం లభ్యం అయ్యిందని,ఆ ప్రభావంతో మనో వాయువేగంతో అన్ని ప్రదేశాలు సంచరించవచ్చని(అంతర్జాలం లా) తను చుసిన ప్రదేశాలు వర్ణించి చెబుతుంటే మన ప్రవరుడు కూడాచూడాలనిపించి తనకి కూడా ఆ దివ్యవుషధంఇమ్మనితను చూసి పుణ్యం తెచ్చుకుంటానని సిద్దుడిని కోరతాడు . సిద్దుడు దంతపు భరిణ తీసి పాదలేపనం ప్రవరుడి పాదాలకి పూసి వెళ్తాడు . ప్రవరునికి ఎప్పటినుండో "హిమవత్పర్వతం" చూడాలని కోరిక అనుకున్నదే తడవు అక్కడ వాయువేగం తో వాలిపోయాడు .

ఆ హిమవన్నగా సౌందర్యం చూసి ప్రవరుడు మైమరచికొండకొలను చెట్టుపుట్టల్లోతిరుగుతూ సూర్యకాంతి నడినెత్తికి వచ్చేసరికి ఉలిక్కిపడిఇల్లు గుర్తుకి వచ్చి తన నిత్య కృత్యాలు గతి తప్పుతాయేమోనని బెంగపడిఇంటికి వెళ్ళడానికి వెనక్కి మళ్లుతాడు.హిమపర్వతం మంచు వలనఎండ వేడికి సిద్దుడు రాసిన లేపనం కరిగిపోయి ఇల్లు చేరు దారి మరచిపోతాడు .యేల ఇల్లు చేరాలో తెలియక చింతా సాగరం లో మునిగి తన ఇంటికి దారి ఎవరైనా చెబుతారేమోనని వెదుకు చుండగా ,గరుడ పచ్చలతో పొదగబడిన భవనం లో వీణమీటుతున్న ఒక దేవకాంతని చూస్తాడు .ఆమె సౌందర్యానికి చిత్తుడై ఇలా అంటాడు
ఎవ్వతే నీవు భీత హరిణేక్షణ ! భయం లేకుండా ఇక్కడున్నావు ,మా ఊరి దారి మరిచిపోయాను దారి చెప్పి పుణ్యం కట్టుకో అని ..అప్పటికే ఆ దేవకన్య ప్రవరుడిని చూసి ప్రేమలో పడిపోయి కావలేనే పలకరిస్తున్నాడనుకొని,..ఇంతలు కన్నులుండ దేరు వెవ్వరి వేడెదు? ఏకాంతం లో వున్నా జవరండ్రని నెపం మీద పలుకరిస్తున్నావు అని ప్రవరుని పయి తనకి కలిగిన ప్రేమ ,మోహాం నిసిగ్గుగా
ఈ విధంగా వెల్లడిస్తుంది ..."నిక్కము దాపనేల ?ధరణి సురనందన !యింకా నీ పయిం
జిక్కె మనంబు నాకు ,నను జిత్తజుభారికి నప్పగించేదో?
చొక్కి మరంద మద్యముల చూరల భాటలు వాడుతేంట్ల సొం
పెక్కిన ,యట్టిపూవు బోదరిండ్లను గౌగిట గారవించేదో?

అప్పుడు మన కథానాయకుడు ,తప్పు ఏదో బుద్ధి గడ్డి తిని ఇక్కడ ఏమేమి వింతలున్నాయో చూడటానికి వచ్చాను ,నాకోసం ఎదురు చూసే బంధు జనాలు వున్నారు ,నాకు చాలా భాద్యతలు వున్నాయి వెళ్లి నా పనులు నేను చూసుకోవాలి ...చూడటానికి వచ్చానే కాని ఉండటానికి కాదు అని .....మత్తు వదుల్చుకొని "అగ్ని దేవుడిని "ప్రార్ధించి తన నిజమందిరం కి చేరిపోతాడు .
అది ప్రవరాఖ్యుని నిగ్రహం .....తాత్కాలిక ఆనందాలకి లోనయితే నిత్యకర్మ కలాపాలు భంగం అవుతాయని అది ధర్మం కాదని మన ప్రవరుడు చెబుతున్నాడు ...-:):)
ఇది చదివినవారు ఎవరికి తోచినరీతిలో వారు తీసుకోవచ్చు ........చివరికి చెప్పొచ్చేది ఏవిటంటే "సెల్ఫ్ కంట్రోల్ ".......దేనికిని ఎడిక్ట్ కాకుండా .కళ్ళ ముందు "లాప్ టాప్ " కనబడిన ,మనం ఎంత విశ్రాంతిగా వున్నా నియంత్రించుకున్న సమయంలోనే అటు చూడాలని-:):) ..చివరిగా ఒక మాట ,రాసినదంతా నాలాంటి వారికోసమే సుమా !పెద్దోళ్ళ కోసం కాదు .

11 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ముందుగా వందటపాసులను టపటప లాడించినందుకు ధన్యవాదాలు.

మొత్తానికి మంచి ఉదాహరణ తీసుకొని భలే ఎత్తుగడ ఎత్తారు. ఇంతకీ హిమాలయాలలో నయా వరూధిని హితబోధతో ఇల్లుచేరానా లేక ఇంకా దారితెన్నులేక కొండమీద కలియతిరుగుతున్నానా ఏమో... ఎప్పటికి తెలిసేనో.

ఏమాటకామాటే సందర్భానుసారంగా పద్యాలను టపాలో భలే ఇరికించారు.

చిన్ని చెప్పారు...

@భా .రా.రె
ఎవరు నాయనా ఆ నయా వరూధిని ?నిక్కము జెప్పవే నిపుడయినా..నిజంతః పురములోని పట్టుపు రాణి వారికి జెప్పి పులిహోర కలపడానికిఏర్పాట్లు జేయిన్చెద.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

నయా వరూధిని= బ్లాగులోకం లేకా కొద్దిగా సినిమా డవిలాగ్ అయితే బ్లాగులోకం..బంగారు పాప

తూచ్ తూచ్...ఇలాంటోటికి పులిహోర లుండవు. ఓన్లీ హోరా హోరీ :)

జయ చెప్పారు...

చిన్ని గారు మొత్తానికి బ్లాగ్లోకం బాగా వివరించారు. మీకు 100 టపాల శుభాకాంక్షలు.

భావన చెప్పారు...

వంద పోస్ట్ ల శుభాకాంక్షలు చిన్ని. బాగా చెప్పేరు నియత్రించుకోవటం అనే దాని మీద వుదాహరణలతో.. హ హ హ .

మురళి చెప్పారు...

ఇప్పుడింతకీ బ్లాగు లోకాన్ని వరూధిని అంటారు.. ప్రవరాఖ్యుడే మీకు ఆదర్శం అంటారు.. కానివ్వండి..

satish చెప్పారు...

మంచి ఉదాహరణతో బాగా వివరించారు
నూరు టపా శుభాకాంక్షలు! :)

sunita చెప్పారు...

బాగా చెప్పేరు చిన్ని గారూ నియత్రించుకోవటం గురుంచి. వంద పోస్ట్ ల శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

100 టపాలకు అభినందనలు .

సిరిసిరిమువ్వ చెప్పారు...

శతటపోత్సవ శుభాకాంక్షలు..వరూధినీప్రవరాఖుల కథ బ్లాగు లోకానికి బాగానే అన్వయించారు!!

చిన్ని చెప్పారు...

@భా.రా.రె
@జయ
@భావన
@మురళి
@సతీష్
@సునీత
@మాలా కుమార్
@సిరిసిరి మువ్వ
అందరికి 'ధన్యవాదాలు ' .