8, జనవరి 2010, శుక్రవారం

మా అమ్మాయి "అమ్మమ్మ"అయ్యింది

మా అమ్మాయి అమ్మమ్మ అయ్యిందంట .ఎంతో సంబరపడిపోతుంది.అప్పుడే పుట్టిన ఆ పిల్లలు చక చక చుట్టూ కలయ తిరుగుతున్నాయి ఆ ఇల్లంతా ముందే తెలుసన్నట్టు ఆ నీళ్ళలో పై నుంచి క్రిందికి విన్యాసాలు చేసేస్తున్నాయి .మా పాపమద్యహ్నం నుంచి ఒకటే హడావిడి పడిపోతుంది .పెద్ద టబ్ లోనుంచి సదరు "మీనాకుమారి "ని వేరు చేసి గాజుగోళం(ప్రసూతి రూం )లోకి మార్చి తను చదువుకునే టేబుల్ మీద పెట్టుకుని ఎదురుగా తెరిచి ఉంచిన పుస్తకం కన్నా కళ్ళన్నీవాటి మీదే పెట్టుకుని మొత్తానికి గంపెడు పిల్లల్ని కళ్ళతో చూసింది .బుల్లిగా తోకలాడిస్తూ భలే ముద్దోస్తున్నాయి .అరగంట నుండి అందరికి కాల్ చేసి మరి చెబుతుంది తన "రంగు చేపల"ముచ్చట్లు .నా బ్లాగ్ ప్రపంచానికి చెప్పమంది ,తను అమ్మమ్మ అయ్యిందని .-:)

10 వ్యాఖ్యలు:

Rani చెప్పారు...

cute!
mundu meeku congrats, jeji ayinanduku :P

జయ చెప్పారు...

మీ ఇద్దరికీ కూడా అభినందనలు. అలాగే మీ అమ్మాయికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందచేయండి.

మధురవాణి చెప్పారు...

So sweet..! బొమ్మలు పెడితే చూసి మరింత సంతోషించేవాళ్ళం కదా :)

చిన్ని చెప్పారు...

@రాణి
హుమ్మ్... అవునుకదా ..నేను జేజి ని అయ్యాను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు :).
@జయ
ధన్యవాదాలు ...మీకును నూతన సంవత్సర శుభాకాంక్షలు .
@మధురవాణి
ఆ బుజ్జికూనలు ఫోటో లోకి నలకల్లా వస్తాయేమో -:)ప్రయత్నిస్తాం .

'Padmarpita' చెప్పారు...

అభినందనలు....జాగ్రత్తగా చూసుకోమనండి మీ అమ్మాయిని.

మురళి చెప్పారు...

జేజమ్మగారికి అభినందనలు..

చిన్ని చెప్పారు...

@పద్మర్పిత
అమ్మాయ్ ఆటల్లో మరచిన అమ్మ ఉందిలెండి -:)
@మురళి
ఆయ్ అందుకున్నమండీ అభినందనలు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్ని గారు...నన్ను కూడా నా ఆక్వేరియంలోని చేపలు చాలా సార్లు తాతయ్యని చేసాయండీ...ముఖ్యంగా నల్ల చేపలు(బ్లాక్ మాలీస్), ఆ రంగు రంగుల తోకల చేపలు(గప్పీలు) అస్సలు కుటుంబనియంత్రణ పాటించవండి... :-)
మీ పాపకు శుభాకాంక్షలు తెలియజేయండి మరి...

చిన్ని చెప్పారు...

@శేఖర్
చాల రోజులకి కనబడ్డారు . మరల మూడురోజుల క్రిందట గప్పిస్ మరొక పందొమ్మిది పిల్లల్ని ఇచ్చిందండీ .మీకు వీటి పెంపకం లో మంచి అనుభవం ఉన్నట్లుంది -:) ఇప్పటివరకు గోల్డ్ ఫిష్ లు గ్రుడ్లు కాని పిల్లల్న్ కాని పెట్టడం ఇంట్లో జరగలేదు .ఎప్పుడు ఎదురుచుస్తుంటాం.

మాలా కుమార్ చెప్పారు...

ఓ ఐతే జేజమ్మ అయ్యరన్నమాట . ఆలస్యంగా అభినందనలు చెబుతున్నాను . బుజ్జి కూనలు కులాసా అని తలుస్తాను .