20, జనవరి 2010, బుధవారం

బ్లాగ్ లోకం -బంగారులోకం ......

బ్లాగ్ ల వలన ప్రపంచంలోని సమాచారం మెరుపుకన్న వేగంగాతెలుసుకోగలుగుతాం ,అనేక మంది భావసారుప్యం వున్నా వ్యక్తుల్ని అంతర్జాలం ద్వారా కలవడం చర్చించడం విషయసేకరణ కి అవకాశం కలుగుతుంది .వార్తపత్రికల కన్నా మిన్నగా ఒక అంశం గురించి రాసినపుడు భిన్న కోణాల్లో అభిప్రాయ వ్యక్తీకరణ వెరసి అన్నిటికి మంచి వేదిక .రాజకీయ ,ఆర్ధిక సామాజిక ,సాహిత్య చర్చలు నిరంతరం ఒక చోటే నిత్యనూతనంగా అందుబాటులోవుంటాయి . పరోక్షంగా విజ్ఞానం పంచి పెంచడంలో బ్లాగ్స్ దోహదపడుతున్నాయి .
ఇక చెప్పాలంటే బ్లాగ్స్ రాసే వ్యక్తులు చాలా వరకి అజ్ఞాతంగా వుంటారు .కాని ఈ అజ్ఞాతంలో ఎన్నో వర్గ ,వర్ణ వైషమ్యాలో.ఇవి ఎంతవరకంటే వ్యక్తిగత దూషణల వరకి వెళ్ళడం వరకి వుంటుంది .తెలియని ప్రపంచంలో తెలియని వ్యక్తుల మీద కూడా విషం వెదజల్లే వర్గాలు వుంటారు అవకాశం దొరికినపుడు అవహేళన చేస్తారు ,పోనీ వారేమైనా మేధావులా అంటే అదీను కాదు ..నేను గమనించినంత వరకి విషయ పరిజ్ఞానం తో రాసేవాళ్ళు చాల తక్కువ .చాలవరకి పై పైన రాసేవాళ్ళే ఎక్కువ (నాలాగ-:) ) బ్లాగ్ ని డైరీ లా రాసేవాళ్ళ గురించి కాదు ఈ వ్యాఖ్యలు ..
బ్లాగ్ లో నా ప్రవేశం అనుకోకుండా జరిగింది . బ్లాగ్ డిజైన్ చేసి దానికి ఒక పేరు పెట్టడం అంత నా ఫ్రెండ్ తో కలిసే చేసాను .సాద్యమైనంతవరకి మన వివరాలు గోప్యంగా ఉంటేనే మంచిది అనిన తన మాటకి "ఏమవుతుంది తెలిస్తే "అని మొండిగా వాదించిన సందర్భం లేకపోలేదు ....కాలక్రమేణ నాకే తెలిసి వచ్చింది ,తెలియకపోయినా అవకాశం తీసుకుని బురదలు జల్లే వ్యక్తులు ఇక తెలిస్తే బ్రతకనివ్వరని.స్వేచ్చగానచ్చినట్లు రాసిన ,జ్ఞాపకాలు ,అనుభవాలు ఆయా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో పారడిలుగా ప్రాణం పోసుకుంటాయి .వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కూడా ఇదే వేదిక అనుకోవచ్చు
బ్లాగ్ లు రాయండి ,తెలుగును ప్రోత్శాహించండీ అంతర్జాలం లో సాహిత్యాభివ్రుద్ది చేయండీ అంటే బాగానే వుంది కాని విపరీత పోకడలతో రాసే బ్లాగ్స్ ని అదేవిధంగా డిస్కరేజ్ చేయకపోవడం ప్రధానలోపం
బ్లాగ్ మొదలెట్టడం అంటే నెట్ కి అడిక్ట్ కావడం లానే గమనించాను ,.కచ్చితంగా అందులో మంచి చెడు రెండు వుంటాయి వాటి వలన గొప్పగా ఒరిగేది ఎమిలేకపోయిన నిజ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి .వీటిపై వెచ్చించే సమయం పరిమితంగా ఉంటేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాను .చూడాలి ఎంతవరకి నియంత్రణ చేయగలనో ...ఈ నెట్ అడిక్షన్ సిగరెట్లు,కాఫీ ,మత్తు పానీయాలు లాటిదే అనికూడా నా అనుమానం ...ఇది "బంగారు లోకమా "?....అనుమానమే........ ..

12 వ్యాఖ్యలు:

శరత్ 'కాలమ్' చెప్పారు...

అవునండీ. బ్లాగులు వ్రాయడం ద్వారా మనం సాధించేది కొద్దిగా మనని మనం 'సాధించు'కునేది ఎక్కువ అనిపిస్తుంది.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

నిజమే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు మన పెద్దలు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే మంచిది.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

చిన్నీ దీనికి మూడో భాగం వ్రాయ 1౦౦ posts అవుతాయి.

పరిమళం చెప్పారు...

ప్చ్ .......ఏమోమరి :(
మీ నూరవ టపాకు ముందస్తు శుభాకాంక్షలండీ :) :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హ్మ్..కరెక్టే..

మాలా కుమార్ చెప్పారు...

ఐతే ఇది సీరియల్ కథన్నమాట .మరి మూడవ భాగం రాసి సెంచరీ కొడుతున్నారా ? బెస్ట్ అఫ్ లక్ .

'Padmarpita' చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాలా నిజం...
ఏది ఏమైనా నేను ఎడిక్ట్ అయ్యాను
ఈ బంగారు లోకంలో సభ్యురాలినైనాను.

కొత్త పాళీ చెప్పారు...

తెలుగు బ్లాగులను గురించి వ్రాయుము అని ఎవరన్నా ఐదు మార్కుల వ్యాసరూప ప్రశ్న ఇచ్చారా? మీ పాప హోంవర్కా?

రాధిక చెప్పారు...

చిన్నీగారూ ,మీరన్నది నిజమే . నేను ఇదివరకు కాళీ సమయంలో చీరల మీద కుట్లు కుట్టడం చేసేదానిని.ఇఫ్ఫుడు టైం దొరికితే బ్లాగ్ తోనే సరిపోతుంది . కుట్టడం తగ్గించేసాను .అన్నట్టు చెప్పడం మరిచాను మాచిన్నక్కను చిన్నీ అంటారు .

మురళి చెప్పారు...

నేను మాత్రం బ్లాగింగ్ ని ఎంజాయ్ చేస్తున్నానండి.. బహుశా నాకు టైము ఎక్కువ దొరుకుతోందేమో.. చూడకుండా ఉండలేక పోవడం లాంటివి ఐతే ఏమీ లేవు..
రకరకాల మనుషులు అంటే.. బ్లాగ్లోకం కూడా మామూలు మనుష్య సమాజం లాంటిదేనండీ.. మంచితో పాటు చెడూ ఉంటుంది.. వంద టపాలకి చేరువైనందుకు శుభాకాంక్షలు..

భావన చెప్పారు...

అప్పుడప్పుడూ మాయమై మళ్ళీ అలా బోర్ కొట్టినప్పుడు ఇటూ రండి. బ్లాగ్ ల మూలం గా నాకు చాలానే కొత్త విషయాలు తెలిసేయి, మంచి స్నేహితులు వచ్చారు. అంటే నష్టాలు లేవని కాదు. చల్తా..

చిన్ని చెప్పారు...

@శరత్ 'కాలం'
ధన్యవాదాలు
@నరసింహ (వేదుల బాల కృష్ణ మూర్తి )
అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి :)
@పరిమళం
ధన్యవాదాలు
@శేఖర్
-:)
@మాలా కుమార్
ధన్యవాదాలండీ
@పద్మర్పిత
అదృష్టవంతులు ....-:)
@కొత్తపాళీ
అయ్యో మీకు తేలియకుండానా ! మా పాప హోం వర్క్ తన బుక్ లో రాస్తాకాని ఇక్కడెందుకు రాస్తాను .
@రాధిక
-:) నాకు 'చిన్ని 'అంటే ప్రాణం అండీ .
@ మురళి
నాకు అయిష్టం లేదండీ అలా అయితే ఈ గోల ఉండదుగా ,నిరంతర సంచారులం అన్నిటికి సమన్యాయం కావాలి కదా.ఎడిక్ట్ కాకపొతే అదృష్టవంతులే !
@భావన
మన్నించేదము తమరి సూచన .-:)