8, జనవరి 2010, శుక్రవారం

శ్రీవారు -డైరీలు

కొత్త సంవత్సరం రాబోతుందంటే మా గవర్నమెంటు ఆఫీసులో డిసెంబర్ నెల మద్య నుండే సందడి మొదలవుతుంది గ్రీటింగ్ కార్డ్స్ ,డైరీలు పంపడం తీసుకోవడం లాటివన్నమాట.నేనైతే రెండు మూడేళ్ళ నుండి కార్డ్స్ పంపడం కూడా తగ్గించేసి ఫోన్ల మీద ,షార్ట్ మెస్సేజెస్ మీద నడిపేస్తున్నాను .గతం లో ముఖ్యమైన వారికి ఎక్కడున్నా ఫ్లవర్స్ కొరియర్ ద్వారా పంపేదాన్ని అలానే నాకు ఎవరు ఫ్లవర్స్ ఇచ్చిన ముచ్చటపడి తీసేసుకునేదాన్ని చక్కగా వాటిని వారం రోజులు పోషణ చేసి కాపాడుతుంటాను .గత తొమ్మిది యేళ్ళగా మొట్టమొదటి డైరీ ప్రముఖ దినపత్రిక నుండి అందుకుంటున్నాను ఆ తరువాతే మిగిలినవారి నుండి ....డైరీ లను చూస్తుంటే చాల ముచ్చటగా అనిపిస్తుంది అలా అని అన్నింటిని వాడలేముకదారెండు మూడు వుంచేసుకుని కావలసిన వారందరికీ పంచేస్తుంటాను .
మావారిది క్లైంట్స్ ని ఆకర్షించుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వుద్యోగం ,వాళ్ళు తరువాతి ఏడాదికి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కొత్త సంవత్సరం రోజు వాళ్ళని తగిన రీతిలో సత్కరిస్తుంటారు పూలు ,పళ్ళు డైరీలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు .ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాదగ్గర ఏతావాతా చాల డైరీ లు మిగిలి ఉంటాయికదా మావారు వాటిని జాతీయం చేసి (పాపం అడుగుతాడు ) చక్కా వాళ్ళ క్లైంట్స్ కి ఇస్తుంటారు .అలానే ఈ ఇయర్ కూడా నా దగ్గర కొన్ని తీసుకున్నారు .

ఈ రోజు ఉదయం నేను హడావిడిగా బయటికి వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గరకి వచ్చి రెండు పేపర్లు (రెండు పేజీలు )నా చేతికి ఇచ్చి "ఇదిగో నిన్న నరసింహారావుగారు పంపారు ,నీవు ఏదో రాసుకున్నావు "అన్నారు . నేను రాయడం ఏవిటాఅని అర్ధం కాక ఆ పేజీలు చూసేసరికి నా బుర్ర గిర్రున తిరిగింది ,అది నా చేతి రాతే డిసెంబర్ ఇరవయ్యి ఆరు ,ఏడు తారికుల్లో రాసాను కొత్త డైరీలో చివరి పేజీలు . ఒక పేజిలో డిపార్టుమెంటు సభంధించిన డేటా అది హెడ్ ఆఫీసు నుండి కాల్ వస్తే ఎదురుగా ఏమి దొరక్క పై అధికార్ని వెయిట్ చేయించే ధైర్యం లేక గబగాబ ఎవరో ముందే ఇచ్చిన డైరీలో నోట్ చేసుకుని ,ఇంఫర్మషన్ పాస్ చేసాను ఇంకొక పేజిలో ఒక ఫ్రెండ్ పూజ విధానం ఫోనేలోనే చెబితే రాసాను ఎదురుగా వుంది కదా అని ,ఆ తరువాత ఆ పేజీలే మరచిపోయాను ,అన్ని డైరీల తోపాటు అది కలసిపోయింది .మావారు తీసుకున్న డైరీల్లో ఇదికూడా వుండి సదరు నరసింహం గార్ని చేరి ,మావారిచ్చిన డైరీ చూసుకుని ముచ్చటపడి నిన్నో మొన్నో పేజీ లు త్రిప్పి పాపం నా మీద జాలిపడి జాగ్రత్తగా ఆరెండు పేజీలు మావారికి అందచేసారు "మీ మేడం గారు ఏదో నోట్ చేసుకున్నారు " అంటూ.ఒక్క క్షణం తెల్లబోయి తరువాత పడిపడీ నవ్వాను .పాపం అయన ఏం అనుకున్నారో వాడేసిన డైరీ తెచ్చారనుకున్నారో అని మా శ్రీవార్ని ఎదురు ఆటపట్టించాను .ఉడుక్కుంటూ ఇష్టం వచ్చినట్టు రాసేయడమేనా చిన్నపిల్ల లాగ అని ఎదురు దాడి కి దిగారు . ఇక నుండి జాగ్రత్త పడతారేమో చూడాలి -:)

7 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ha ha ha. good show.

తృష్ణ చెప్పారు...

అన్ని డైరీలు వస్తే ఓటి ఇటిచ్చేయండీ...నాకసలే డైరీల పిచ్చి! నా పుస్తకాల్లో సగ భాగం డైరీలతోనే నిండి ఉంటుంది. ఒక్కో భాష పాటలకూ ఒకోటి,కొటేషన్స్ కీ , వంటలకీ, హెల్త్ రిలేటెడ్ ఆటికల్స్ పేస్ట్ చేసినవి, ఇలా రాసుకుంటూ పోతే లిస్ట్ అనంతం....!
ఎదురుగా ఉన్న కాయితం మీద రాసేసి, తర్వాత అది ఎక్కడ పెట్టానో మర్చిపోయి...మెత్తగా చివాట్లు తినే అలవాట్లు నాకూ ఉందండోయ్..:)
"డైరీ" అనేసరికీ ఎంత కామెంట్ వచ్చేసిందో చూశారా...!

మురళి చెప్పారు...

పాపం నరసింహారావు గారు :-) :-) అన్నట్టు గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి డైరీల పంపిణీ తగ్గిందండీ.. మాంద్యం ప్రభావం అనుకుంటా..

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
-:(
@తృష్ణ
సరే అయితే పంపిస్తాను .ఎక్కడికి పంపాలో చెప్పండీ .
నిజం చెప్పాలంటే ఆ రెండు పేజీల్లో ఎమిరాసానో అని ఒక సెకను గుండె దడ దడ లాడింది ..కొంపదీసి మనం రాసిన భావావేశాలు అందులోగాని ఉన్నాయేమోనని -:)
@మురళి
నేనయితే మా వారు పాపం అనుకున్న :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-) :-)
పాపం మీ వారిని అలా మీకు తెలీకుండానే బుక్ చేసేసారన్నమాట...అసలు ఆ పెద్దాయన మీరు వాడేసిన డైరీలు ఇచ్చారు అని తెలపటం కోసమే మీ రెండు పేజీలు జాగ్రత్తగా చింపి మీవారికి ఇచ్చుంటారని నా అనుమానం...
జాతీయం చేయడం అనే పదం మేము తరచుగా వాడుతుంటామండీ...

Hima bindu చెప్పారు...

@శేఖర్
నాకు అదే అనుమానం -:)

మాలా కుమార్ చెప్పారు...

మావారు కూడా అలానే డైరీ లు డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇస్తూవుంటారు . పాపం సరి పోక నాకిచ్చినదీ తీసేసుకుంటారు . ఏమో ఎప్పుడైనా మీ డైరీ లాగే నా డైరీ కూడా వెళ్ళిందేమో తెలీదు . బాగుంది . హీ హి హి