12, డిసెంబర్ 2010, ఆదివారం

ప్రియం అయిన స్నేహం

కొంతమంది తో జీవితాంతం స్నేహం నిలిచిపోతుంది .అలాంటి వాళ్ళ లిస్టు లో మా "నాగు " చేరుతుంది.నాగు అంటే నా ఎనిమిదవ తరగతి స్నేహితురాలు.నేను అక్క తో పాటు ఏలూరు తెరిసాహాస్టల్లో చేరగానే నా క్లాస్స్ వాళ్ళు పది మంది చుట్టూ చేరి ఎక్కడి నుంచిఏ స్కూలి నుండి వచ్చానో వివరాలు అడుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అక్కడున్న వాళ్ళలో ఒకమ్మాయి (నాగమణి )మాత్రం స్వీట్ గా నవ్వుతు చూస్తూ నన్ను ఆకర్షించింది .అప్పట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక వారం కాస్త టీజింగ్ గా చూసేవాళ్ళు (నేను తరువాత అలానే చేసాను ). కాని నాగమణి మాత్రం అస్సలు అలా చేసేది కాదు.ఎవర్ని నొప్పించడం తనకి తెలీదు.చాల మితంగా మాట్లాడేది నేను మాత్రం తనకి అపోజిట్ అయిన మా ఇద్దరికీ స్నేహం కుదిరింది .చెప్పాలంటే నేను తన వెనుకపడి మైత్రి కుదుర్చుకున్నానేమో..నాకు నచ్చితే అలానే చేస్తాను ...గుర్తు రావడం లేదు .ఎవ్వరితోనయిన అభిప్రాయ బేధాలు వస్తే మాట్లాడటం మానేదాన్నికాని 'నాగు 'తో మాత్రం సర్దుకోవడం నేర్చుకున్నానుఎందుకో తెలీదు తనకి నచ్చని పని కి (స్టడీ అవర్ లో సిస్టర్స్ చూడకుండా పుస్తకాల్లోపెట్టి నవలలు చదవడం లాంటివి ) దూరం వుండేదాన్ని.నాగు కూడా నా అల్లరిని నవ్వుతు ఎంజాయ్ చేసేది, స్కూల్లో మా ఇద్దరి సెక్షన్స్ వేరయినా హాస్టల్లో ఉన్నంతసేపు కలిసే వుండేవాళ్ళం.నాగు కి చిన్నప్పుడే నాన్న లేరు ,అది తెలిసి తానంటే ఒకరకమైన కన్సర్న్ అంతర్లీనంగా వుండేది.ఇంటర్ మొదటి సంవత్సరం వరకి తనతోనే కలిసి చదివాను ,ఆ తరువాత నేను విజయవాడ వచ్చిన మా ఇద్దరి మద్య ఏ మాత్రం దూరం పెరగలేదు ,ఎప్పుడైనా ఫోనులో పలకరింపులు (హాస్టల్లో రేస్త్రిక్షన్స్ )చాలా వరకు ఉత్తరాలు ...నేను నాలుగు రాస్తే తను ఒకటి రాసేది అందులోనే ఎన్నో కబుర్లు ....దశాబ్దాలు గడచినా అదే ప్రేమ ,అదే ఆప్యాయత.ఇప్పటికి మెరుపులా మెరుస్తుంది. నాగు ఎవరితో టచ్ లో వున్నా లేకపోయినా నాతో మాత్రం కనీసం ఆరు నెలలకి ఒకసారయిన మెయిల్ రాయడమో ,మాట్లడటమో చేస్తుంది :-) చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చి మెరుపులా కనబడి మాయం అవుతుంది .నా స్నేహితులకి నాగు విశేషాలు తెలియాలంటే నన్ను అడగవల్సిందే...పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారే తిరిగి కాల్ చేస్తే ఎవరు మాత్రం ఓపిక పడతారు :-)ఎవరో నాలాంటి వాళ్ళు తప్పించి . రెండు నెలల క్రితం హటాత్తుగా ప్రొద్దున్న ప్రొద్దున్నే కాల్ చేసింది ,నేను మినిస్టర్ ప్రోగ్రాం హడావిడిలో వున్నాను,అయిన అన్నీ ప్రక్కన పెట్టి అరగంట మాట్లాడాను.అప్పుడు అర్ధం అయ్యింది తను నాకు ఎంత ముఖ్యమో....స్నేహం కాని ,ప్రేమ కాని ఇవ్వటమే కోరుకుంటుంది కాని అవతలి వారి నుంచి ఏమి కోరుకోదు అనుకుంటాను ..
నిన్న నాగు కి ఎందుకు గుర్తుకు వచ్చానో..ఒకే ఒక్క లైన్ ఎలా వున్నావు అని.రాసింది,అదే నాకు కొండంత సంభరం.రాత్రి విజ్జి కి వెంకట్ కి చెబితే ఒకటే నవ్వు ...ఆ ఒక్క లైన్ రాయడానికి దానికి ఎన్ని రోజులు పట్టిందో అంటూ ...మరి నాగు అంతే :-)

11 కామెంట్‌లు:

srinivas చెప్పారు...

అన్ని పత్రికల హెడ్ లైన్స్,సంపాదకీయాలు,స్పెషల్స్... టెలుగు బ్లాగుల టాజా పోస్టింగ్ లు ...రేడియో,టీవీ చానల్స్ ...తో నా క్రొత్త వెబ్ సైట్ ఆంధ్రావని.ఇన్ వచ్చింది... పత్రికా మిత్రులూ/ప్రియులూ దయచేసి ఒకసారి చూసి కామెంట్ చేయరూ..ప్లీజ్.. http://andhravani.in

కొత్త పాళీ చెప్పారు...

కొన్ని స్నేహితాలు అంతే

murthy చెప్పారు...

chakka ga undi mee snehithuraali tho meekunna atmeeya bandham.

teresa చెప్పారు...

:)
Last time I visited St.teresa's was in 1994. It was very nice to be remembered by all the staff. Quite thrilling is to receive oodles of compliments from Glamourous Ms.Iris who never used to say a word!

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి మీ స్నేహ బంధం.

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి మీ స్నేహ బంధం.

ఉమాశంకర్ చెప్పారు...

Lucky you (Both).

Hima bindu చెప్పారు...

@శ్రీనివాస్
ధన్యవాదాలు ..చూస్తాను.
@కొత్తపాళీ
ధన్యవాదాలండీ .
@తెరెసా
అవునండీ ...నాలుగు నెలల క్రితం మా క్లాస్స్ వాళ్ళం ఒక పాతికమందిమి రెండు రోజులు పూర్తిగా కేటాయించి ఒకే చోట (ఏలూరు జుట్మిల్ వాళ్ళ అమ్మాయి మా క్లాస్మేట్,వాళ్ళ ఇంట్లో కలిసాం ) స్కూల్లో ,కాలేజి లో టీచర్స్ని లెక్చరర్స్ ని కలిసి ఎంజాయ్ చేసాము ..క్లాస్ రూమ్స్ లో కుర్చుని ,హాస్టల్ డైనింగ్ రూమ్లో స్పెండ్ చేసి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం.కొంతమంది స్కూల్ టీచర్స్ కాలం లో కలిసిపోవడం ,కొన్ని చేదు వార్తలు వినడం ...తీపి చేదుల కలయికల గడిచిపోయాయి ఆ రెండు రోజులు .ఇప్పటికి ఆ స్కూలు అలానే ...కార్పోరాట్ స్కూల్స్ ప్రభావం వీటి మీద పడినట్లు మాసిపోయిన బల్లలు ,గోడలు ,పిల్లలు .....హ్మం .

Hima bindu చెప్పారు...

@మూర్తి
ధన్యవాదాలండీ :-)
@రాధిక (నాని)
థాంక్యూ..అన్నట్లు నిన్న ,ఈరోజు చూసారా :-)
@ఉమా
అవునండీ ఇటువంటి స్నేహితుల్ని కలిగి వుండటం లక్కినే:-)

జయ చెప్పారు...

అవును, నిజమైన ఆనందం స్నేహంలోనే ఉంది. కంగ్రాట్స్.

Hima bindu చెప్పారు...

@JAYA
THANQ:-)