సంవత్సరం నుండి రీడింగ్ గ్లాస్సెస్ తో నడుపుతున్న నాకు అవి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇక లాభం లేదని నిన్న కళ్ళడాక్టర్ దర్శనం చేసుకున్నాను ,కేవలం చదివేప్పుడే కాకుండా పెర్మనెంట్ గా వాడండీ కంఫర్ట్ ఉంటుందని సెలవిచ్చారు డాక్టర్ గారు అదనంగా ఈరోజు నుండి మనతోనే ఈ రెండు కళ్ళు .
డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో మా కాలేజిలో సగం పైనే కళ్ళద్దాలు పెట్టుకునేవాళ్ళు అదేంటో అలాటి వాళ్ళను చూస్తే మేధావుల్లా కనబడేవాళ్ళు(చదువుల్లో ఎంత మొద్దు వాళ్ళయిన ) గొప్ప ఆరాధనగా చూసేదాన్ని.నిజానికి అప్పట్లో ఫాషన్ కూడా :-) మా క్లాస్స్ లోను చెప్పాలంటే మా కాలేజీలోను (మారిస్ స్టెల్ల కాలేజివిజయవాడ ) గ్లాస్సెస్ వాడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందికారణం మా కాలేజికి దగ్గరలో కొత్తగా కంటి హాస్పిటల్ పెట్టారని తెలిసింది .
ఆ డాక్టర్ చాల అందంగా ఉంటారని కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు .
నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ డాక్టర్ ని చూసి రావాలని నిర్ణయించుకుని వురకనే వెళ్తే బాగోదని కళ్ళు టెస్ట్ అనో తలనొప్పి అనో కారణం చెప్దాము అని మద్యాహ్నం లంచ్ సమయం లో నలుగురం వెళ్ళాము తీరా ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడిగితె అందరం తలనొప్పి అని చెప్పాము (ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది )మా లలితా అయితే ఆయనేమి అడిగిన గుడ్లప్పగించి చూసింది డాక్టర్ కి మా ప్రాబ్లం అర్ధం అయినట్లుంది నవ్వుకుంటూ మా నలుగురికి గ్లాస్సెస్ రాసారు .
రెండ్రోజుల తరువాత మా నలుగురి ఫ్రెండ్స్ కి స్క్వేర్ టైపు అద్దాలు అమరాయి (నన్ను ఇంట్లో అమ్మ తిట్టింది చెప్పకుండా నా అంతట నేను ఫ్రెండ్స్ తో వెళ్ళినందుకు )...అవి కళ్ళకి పెట్టుకోవాలంటే చిరాగ్గా వుండేది అవి తీసి ఎప్పుడు తలపైన తగిలించుకునే దాన్ని...కొన్నాళ్ళు కష్టం మీద భరించానుమిగిలిన వాళ్ళ పరిస్థితి ఇదే ...నా పెళ్లినాటికి కి వున్నాయి కంటి చూపు ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నారట మావారు,..తరువాతరువాత అవి తీసి అవతల పడేసాను ....ఇక ఇప్పుడు నిజంగా పెట్టుకోక తప్పడం లేదు .
ఆ డాక్టర్ చాల అందంగా వున్నాడు అప్పట్లో మా కళ్ళకి సినిమా హీరోలానే వున్నాడు ఆ క్లినిక్ పేరు గొర్రెపాటి క్లినిక్ ..కళ్ళ డాక్టర్ అనగానే మా అందరికి ఆయనే గుర్తొస్తారు తలుచుకుని నవ్వుకుంటాము .
29, అక్టోబర్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
మీ "బంగారం" కుక్క అనుకున్నాను, ప్రొఫైల్లో పిల్లి బొమ్మ ఉందేంటి?
బంగారం కాదు బుజ్జులు అండీ దాని పేరు మారింది ,మా ఇంట్లో వున్నా పిల్లి పిల్ల అలా పెట్టింది .
Welcome :)
నాకు నిన్ననే కొత్త కళ్ళు వచ్చాయి , నాలుగు కళ్ళయ్యాయి :)
@ఉమా
థాంక్సండీ మీ గ్రూప్ లో ఆహ్వానానికి .
@మాలాకుమార్
ఓహ్!మీరు కూడా మా గ్రూపే :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి