30, మార్చి 2009, సోమవారం
ఈనాడు కథ
ఆదివారం ఈనాడు పుస్తకం లో వచ్చిన కథ నేటి మానవసంభందాలు కి అద్దం పడుతుంది .తమ కెరీర్ అంటు పెద్ద వారైన తల్లితండ్రులని వారి మానన వారిని వదిలేసినాఆస్తి లో మాత్రం హక్కులు కోర్టులు అంటు తిరిగే బిడ్డలు నేటి సమాజం లో పెరిగి పోతున్నారు . డబ్బు కోసం {తమ కష్టార్జితం కాపోఇన }వ్రుద్దులైన తల్లితండ్రులను చంపడానికి ,వదిలేయడానికి వెనకాడడం లేదు . పెన్మత్స శ్రీకాంత్ రాసిన కథ చదివినంతసేపూ ఆ కొడుకు పాత్ర ను అస్సహ్యిన్చుకుంటూ చదువుతాము. చాల బాధగా అన్పించింది ఆ తల్లి పాత్ర .నిన్నటి ఆదివారం పుస్తకం ఇప్పుడు తీరికగా చదివి మనస్సు పాడు చేసుకున్నాను.మూడ్ పాడు చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఈ కథ చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
చిన్ని గారు,
ఇలాంటివే అప్పుడప్పుడు వార్తల్లో చదువుతుంటాం కదా, అవి చదివాక మాత్రం చాలా బాధకలిగేది, ఈ కథ చదివినప్పటికంటె
అమ్మ-దొంగ కథ నేనూ చదివానండి.. ఈనాడు వాళ్ళు ఈ తల్లి, తండ్రి, పిల్లల కథల చట్రం నుంచి ఎప్పుడు బయటపడతారో? ప్రతివారం కొంచం అటు ఇటు గా ఇదే సబ్జక్టు మీద ఓ కథ..
@ఉమా నిజమే చదువుతుంటాము ఈ మద్య మరి ఎక్కువయ్యాయి కన్నబిడ్డలు తమ భాద్యత మరచి పెద్ద వారి సంపాదన లో మాత్రం జన్మ హక్కుగా భావిస్తున్నారు.
@మురళి ఈనాడు వాళ్ళు మానవసంభందాలు పటిష్ట పరచడానికి కృషి చేస్తున్నారండి .కథ చదివి కొంత మందయినా ఆలోచిస్తారని
కామెంట్‌ను పోస్ట్ చేయండి