ఆదివారమైన మహిళను కావడం వల్ల ,మహిళలదినం కార్యక్రమం లో బిజీ గ గడిపి సాయంత్రంనుండి తీరికగా బ్లాగ్ ముందు కూర్చున్న .అస్సలు ఈరోజు జరుపుకునే కార్యక్రమాల గురించి వారం ముందు నుండి మనకు ఒకటే వత్తిడి ,ఎక్కడెక్కడి వాళ్ళో మనలాటి వాళ్ల మొబైల్ ,అడ్రస్ వెదుక్కుని మరి వచ్చి కనీసం పది నిమిషlలు అయిన వచ్చి వెళ్ళమని ,రిక్వెస్ట్ చేస్తే ,వెళ్ళ దగ్గవి అని అన్పించినవి ఆరిటికి టిక్ పెట్టాను ఒకదాని తరువాత ఒకటి వుండేట్లు మార్చుకుని , కాస్త రన్నింగ్ రేస్ చేస్తూ ,లంచ్ తరువాత వున్నా వాటికి "హ్యాండ్ "ఇచ్చి ఇల్లు చేరాను .ఏమిలేని చోట ఆముద వృక్షంలా మనం కనబడతమాయే ,
మూడు రోజుల క్రిందట ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్లు నా వద్ద కు వచ్చి ,వుమెన్స్ డే జరుపుకుంటున్నాము , మా స్టూడెంట్స్ మదర్స్ ని పిలుస్తున్నాము ,ఎందుకంటె వారి భర్తల చేతిలో అణిచి వేయబడుతున్నారు ,వారికి మహిళా చట్టాలు ,గృహ హింస చట్టాలు ,ఎలా ఎదుర్కొనాలోచెప్పమని ,కొన్ని సమస్యలు చర్చించి మరి వెళ్లారు ,అనచబడుచున్న స్త్రీ లంత ధనిక వర్గం,బిజినెస్ వాళ్లు ,.
ఈ ప్రోగ్రాం కి వేహికాల్స్ పంపి మరి చిల్ద్రెన్ యొక్క మదర్స్ ని పిలిపిమ్చామన్నారు . నేను మూడు ప్రోగ్రాం లకు వెళ్లి నాలుగో దాంట్లో నా మీద బృహతర భాద్యత వుందికదా ,అని దారి పొడవునా ఏమేమి చెప్పాలో ఆలోచించుకుంటూ చేరాను .అతిధి మర్యదలయ్యాక ఫంక్షన్ హాల్లో కి వెళ్ళగానే ,చాలామంది ఆడవాళ్ళ తో పాటు కొన్ని జంటలు మగవాళ్ళు కనబడ్డారు ,, ప్రోగ్రాం మొదలవుతుండగా వరుసగా భార్య,భర్తలు రావడం ,కొన్ని క్షణాల్లో హాల్ సగ ఆడ,మగ జంటల తో నిండిపోయింది .
నాకైతే చచ్చేంత నవ్వు వచ్చింది ,ప్రిన్సిపాల్ కి ఇది షాక్ లానే వుంది .మనం మహిళా దినోతవం లో మహిళలకు ,హితవులు చెప్పాం ,అవి ఏమనగా సహనం తో మెలగండి ,భర్త తోను ,అత్త గారితోనూ , రేపు మీరు కాబోయే అత్త లు కదా ,,మంచితో మీరు సాధించుకొంది ,పిల్లల పెంపకం వగైరాలు చెప్పి బుద్ధిగా ముగించ ,{అక్కడ భర్త ల మార్కులు కూడా కొట్టేసనులెండి}మరి ఇంతకన్నా ఏమి చేయగలం ,స్కూలు వారు తిరుగుబాటు భావాలు తమ భార్యలకు నేర్పిస్తున్నారు అనుకునే ప్రమాదం వుంది.
గృహ హింస చట్టం మహిళా చట్టాలు తదితరవి చర్చించాలనుకున్న., కాని వారి భర్తలు మహిళా దినోతవం సైతం వదలకుండా ,వారేం నేర్చుకుంటారో అనే భయామ్తో వారి వెన్నంటే వచినట్లు అనిపించింది .ఏమైతేనేం వివాదం లేకుండా ప్రశాంతంగా గ బయటపడ్డాను రివెర్స్ లో వెళ్ళడం వల్ల.
8, మార్చి 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్‌లు:
గిరీశం గుర్తొచ్చాడండి.. కుంచం నిలువుగా కొలవడం వీలు కాకపొతే తిరగేసి కొలవమన్నాడు, కనీసం నాలుగు గింజలైనా మిగులుతాయని.. మొత్తానికి 'నొప్పించక..తానొవ్వక' తరహాలో బయట పడ్డారన్న మాట..
(సరదాగా)
చూసారా ? కారు డ్రయివింగు మీ మనసులో ఉండబట్టే కదా "రివర్స్ గేర్" అని మీ టపా కి పేరు పెట్టారు? స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నిటినీ పాటిస్తూ జాగ్రత్తగా ముందుకు దూసుకుపొండి..
కాస్త అచ్చుతప్పులు, వ్యాక్య నిర్మాణం సరిచూసుకోండి.. :)
@ఉమా గారు
భలే కనిపెట్టేసారే , మన మనస్సులో కోరిక వున్నప్పుడు అది ఏదో రూపంలో బయటపడుతుంది అంటారు ఇలానే కాబోలు .ప్రయత్నిస్తాను.
ఇకపోతే మీకన్నా చిన్నదాన్ని {నేను ఫిబ్రవరి ఆరునే కళ్ళు తెరిచాను ,బ్లాగ్ లోకంలో }అందుకే చిన్ని ,తప్పులు చేస్తూ తప్పటడుగులు వేస్తోంది .కొన్నాళ్ళు భరించక తప్పదేమో పూర్తీ స్థాయిలో నడిచేదాక.
:( :( ! :)!
కామెంట్‌ను పోస్ట్ చేయండి