8, మార్చి 2009, ఆదివారం

అభిమాన రచయితలు

అభిమాన హీరో గురించి ఇంత క్రితం మీతో పంచుకున్నాను ,.ఇకపోతే అభిమాన రచయితగురించి కూడా చెప్పాలి .నాకు ఒక్కో వయస్సులో ఒక్కొక్కరి మీద అభిమానం పుట్టేది ,వరుసగా నాలుగు పుస్తకాలు చదవగానే ,వారి అభిమానినవడం అన్నమాట !ఇలా చిన్నప్పుడు తరుచు పార్టీలు మారుస్తూ వుండేదాన్ని .టీనేజ్ వరకు ఇదే తంతు.
మా ఇంట్లో మా ఆరుగురు పిల్లలకు చదివే అలవాటు వుంది.వారపత్రికలకోసం,నొవెల్స్ కోసం ఒకరితరువాతఒకరని పోటి పడేవాళ్ళం .చదివాక వాటి మీద చర్చ కూడాఉండేది.మాతో పాటు మా అమ్మ కూడా సభ్యురాలే .
ఇప్పట్ల రచయితల ఫొటోస్ తరుచు వచ్చేయి కాదు ,అరుదుగా కనపడేవి ,వారి అడ్రసులు మాత్రం ప్రచురించేవారు .దాదాపు అందరి ఫొటోస్ చూసాం ,కాని ఒకరు మాత్రం ఎలా వుంటారో ,ఊహలక్కుడా అందేది కాదు .
ఆయన రాసిన కథలు చదువుతూ ,దాదాపు ఆ కథ లో హీరో పాత్ర తో రచయితను వుహించుకునేదాన్ని {నేను మాత్రమె సుమా} మీకు ఇప్పటికి అర్ధం అయ్యే వుంటుంది ,ఏ రచయిత గురించి చెబుతున్నానో .ఆయన రాసినవన్నీ చదివాను ,సీరియల్స్ క్రమం తప్పకుండాను చదివేదాన్ని ,చంద్ర బొమ్మల్లో,కరుణాకర్ బొమ్మల్లో ని హీరో తో రచయితను పోల్చుకున్న ,,అదండీ మన అభిమాన రచయిత పట్ల మనకున్న అడ్మిరషన్.
మా చిన్న చెల్లికి కూడా చాల ఇష్టపడేది ,క్లాస్ పుస్తకాలతో పాటు నొవెల్స్ కూడా పెట్టుకుని మంచం కి గోడ కి మద్య వున్నా స్థలం లో ఇరుక్కుని కూర్చొని చదివేది.{నాన్న కాని గదిలోకి వస్తే కనపడకుండా వుంటానికి }

ఒకరోజు చిన్నచేల్లి,పెద్దచేల్లి తబ్బిబ్బుగా ఒక వుత్తరం చదువుతు ,కనబడ్డారు ,వాకబు చేయగా మా చిన్నచేల్లి రచయితకు వుత్తరం రాయటం,ఆయన సమాధానం ఇవ్వడమే కాకుండా ,తను విజయవాడ వస్తోన్నట్లు ,కలవాలంటే మ్యుజ్యమ రోడ్లోని మహాలక్ష్మి బుక్ సెంటర్ కి రమ్మని టైం చెపుతూ రాసారు. మా చెల్లి ని అభినందిస్తూ ,{మనం ఆ పని చేయలేదుకదా ,ఎనిమిదవ తరగతి లో మా నాన్న ఇచిన క్లాసు వల్ల ఎవరికి రాయలేదు ఎంత మనసు లాగుతున్న }ముగ్గురం ఎమైనసరే వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకుని అమ్మకి విషయం చెప్పాము .అమ్మ నాన్నకి ఎలాను చెప్పదు.అప్పటికి మేము పెద్దోలం కూడాను.
మేము ముగ్గురం చెప్పిన అడ్రెస్స్ వెదుక్కొంటూ వెళ్ళాం ,మాకు ఏవి సరిగ్గా తెలిసేవి కాదు ,ఆటో అబ్బాయ్ సహాయం తో బుక్ సెంటర్ కి చేరాము. నాకైతే ఒకటే టెన్షన్ ఏదో అద్బుతం చూడబోతున్నాఅన్నంత .బుక్సెంటర్ లో యజమాని ,సేల్స్ కుర్రాడు తప్ప ఎవరు లేరు .మేము వచ్చిన పని చెప్పగానే ,వారు సాదరంగా మమ్మల్ని లోనికి పిలిచి కూర్చోమన్నారు ,,ఆ రచయిత బయట పని మీద వెల్లరని ,మమ్మల్ని వుండమన్నారని చెప్పారు .ముగ్గురం ఆ వుక్కలో,చెమటలు తుడుచుకొంటూ ఎదురు చూస్తో ,ఏ చిన్న అలికిడి అయిన అతనేమోనని చూస్తోండగా ,షాప్ ముందు కీచుమంటూ రిక్షా ఆగింది ,అందులోనుండి తెల్లగా,భారీగా వున్నా వ్యక్తి దిగి లోపలికి వచ్చారు ,మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంట ,హెవీ పర్సనాలిటీ ని ఆసక్తిగా గమనిస్తోండగా ,సదరు యజమాని వచ్చిన వ్యక్తి తో ,,మమ్మల్ని వుద్దేశించి వీరు మీకోసం ఎదురు చూస్తోన్నారు ,మీరు రమ్మన్నారట ,అని అన్నారు.
ఇక చూడండి నా అవస్థ ,వూహలకి ,వాస్తవానికి తేడ తో ,వారితో సరిగ్గా మాట్లాడలేక ,వారు ఆఫర్ చేసిన షోడా ను తాగలేదు ,ఆయన నాది కూడా తాగేసి ,తనకి షోడలంటే చాల ఇష్టమని డిక్లేర్ చేసారు.,మా ఇద్దరి చేల్లిల్ల పరిస్తితి కూడా ఇంచుమించు ఇదే ,కాని నాల గ బయటపడలేదు. అరగంట మాట్లాడి సెలవు తీసుకున్నాం. ఇంటికి వచ్చాక వారం రోజులు ఇదే టాపిక్ ,అందరు నన్నుటీజ్ చేసారు . ఇప్పడు తలుచుకుని నవ్వుకుంటాను , ఈ మద్య సాక్షి ఇంటర్ వ్యూ లో కూడా తన ఫోటో ఇవ్వలేదు .ఇప్పటికి ఆయన నా అభిమాన రచయితే.

11 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

వావ్.. ఆ రచయితని చాలా మంది వర్ణించగా విన్నానండి.. ఓ సారి చూసే అవకాశం వచ్చినా కలవలేదు.. ఊహలలోనే ఉంచుకుందామని.. నాకు ఆయన నాయికలు ఇష్టం :) ఈ మధ్యనే ఓ నవల చదివాను కూడా. అభిమాన రచయితని కలిసినందుకు అభినందనలు.. ఇంతకీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారా? ఆయన అభిమానులతో కూడా ఫొటోలకి అంగీకరించరని విన్నాను..

krishna rao jallipalli చెప్పారు...

,తనకి షోడలంటే చాల ఇష్టమని డిక్లేర్ చేసారు...వారికి ఒక్క సోడాలేమి ఖర్మ ఇంకా చాలా చాలా ఇస్టాలున్నాయి మరి. తన బయంకర అవతారం అందరకి చూపించడం ఇష్టం లేక అలా మొహం చాటేస్తాడు. అదొక రకమైన వాణిజ్య సూత్రం తనకి.

ఉమాశంకర్ చెప్పారు...

చిన్ని గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత కూడా తన ఫోటొ ప్రచురించటానికి ఇష్టపడేవారు కాదు. వారి గురించేనా మీరు చెప్తున్నది?

చిన్ని చెప్పారు...

@మురళి ఇంకేమి ఆటోగ్రాఫ్ ,శ్రోత ల కూర్చొన్న ,అంతే ,,
@ఉమా శంకర్ గారు ,,ఈయన డిటెక్టివ్ నొవెల్స్ రాసేవాళ్ళు కూడా ,ఇప్పుడు ఎక్కువ ఆద్యాత్మికం లో వున్నట్లు చదివాం ,వంశి తన కొన్ని పుస్తకాల్లో ఆయన ఫోటో ప్రచురించారు కదా! గుర్తుపట్టారా?

krishna rao jallipalli చెప్పారు...

ఇప్పుడు ఎక్కువ ఆద్యాత్మికం లో వున్నట్లు చదివాం...నిజమే. అంతకు మించి ఏమి చెయ్యగలడు లెండి?? ఇంకో సంచలన రచయత ... పాపం... తనంటే ఏమిటో tanake తెలియని స్థితిలో, ఇంకో శృంగార రచయత... పాపం addresse లేదు... పాపం t.v. లు వచ్చాక చాలా మంది అనాధలు అయ్యారు.

చిన్ని చెప్పారు...

@కృష్ణారావు గారు ,మీకేదో రచయతల మీద కోపం లా వుంది , నిజానికి టీవీ ,ల వల్లనే చదివే అలవాటు ,దూరం అవ్వుతుందని ,రచయతలు ,పాఠకులు తగ్గిపోతున్నారని నాలాటి వాళ్ళం ఆందోళన పడుతూ ,,పిల్లల్లో చదివే అలవాటు పెంచాలని చూస్తోంటే ,మీరేమో వేరేగా ,అంటున్నారు ,ఏదో సరదాకి కాలేజ్ రోజుల్లో ,పరిపక్వత లేని మనస్సు తో ,ఎలా ఫీల్ అయ్యామో చెప్పాను,,నిజానికి వారి పెర్సనల్ లైఫ్ తో పాఠకులుగా మనకు అవసరం లేదేమో,,

కొత్త పాళీ చెప్పారు...

చిన్ని గారూ, మీ జ్ఞాపకాలు సరదాగా బావుంటున్నాయి, కానీ అచ్చుతప్పులొకటీ, అటుపైన ఫులుస్టాపులూ కామాలూ అడ్డదిడ్డంగా కొట్టేస్తున్నారు. వీటి పద్మవ్యూహంలో చక్కర్లు కొడుతూ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.

చిన్ని చెప్పారు...

@కొత్త పాళీ గారు ధన్యవాదాలండి ,అందరు చెబుతున్నారు అయినా జాగ్రత్త తీసుకోలేక పోతున్న ,రాసింది రెండోసారి సరి చూసుకోలేకపోతున్న.నిజం చెప్పాలంటే సగం నిర్లక్ష్యం ,సగం రాసే విదానం తెలియకపోవడం .తప్పకుండ ప్రయత్నిస్తాను.

సుజాత చెప్పారు...

మీరు చెప్పింది మల్లాది గురించే అయితే నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన్ని కలిసాను ఆఫీసులోనే. ఆయన అని తెలీక, ఆయన ముందే ఆయన్ని పొగిడాను కూడా!

krishna rao jallipalli చెప్పారు...

పిల్లల్లో చదివే అలవాటు పెంచాలని చూస్తోంటే ,మీరేమో వేరేగా ,అంటున్నారు ...నేను వేరేగా ఏమి అనుకోవడం లేదు. అలనాటి కొందరి (రచయతల) ప్రవర్తనలు, మహిళా పాఠకుల బలహీనలతో వారు ఆడుకోవడాలు (ఆత్మహత్యలకి దారి తీసే విదంగా)...... అయినా వారేమి పురాణాలు, నీతి చంద్రికలు రాయలేదు మన పిల్లలతో చదివించడానికి. anyway... మీ మనసుని నొప్పించి ఉంటె క్చంతవ్యుడను.. bye.

చిన్ని చెప్పారు...

@సుజాత గారు చాలా థ్రిల్లింగ్ గా వుంటాయండి అటువంటి సంఘటనలు .మీరు చెప్పినవారే .
@కృష్ణారావు గారు మీరు టీవీ లు అన్నారని అన్నాను .నేను చదివే అలవాటు గురించి మాట్లాడాను.
ఇకపోతే అవకాశం వస్తే ఏ మగవాళ్ళు ఎక్సెప్షన్ కాదని నా అభిప్రాయం ,వాళ్ళు రచయితే కానక్కరలేదు .మీరు సారీ చెప్పనవసరం లేదండి.