ఇన్ని అందాలను ఆనందాలను ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మ !ఇప్పుడిప్పుడే మా ఊరు రావనుకున్నాము చెప్పాపెట్టకుండా మొన్న రాత్రి నీవు చూపిన దయతో మా ఊరంతా మురిసిపోయి తడిసి ముద్దయి పోయింది తెల్లారేసర్కి నీ జాడలు మాత్రం వదిలి వెళ్లి పోయావే !అప్పటినుంచి ఒళ్లంతా కళ్ళు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తున్నాను ఏమాత్రం అలికిడి అయిన నువ్వోచ్చేసావు అనుకుంటు కిటికీ పరదాలు తీసి మన ఇంట వాకిట
ఆడుకుంటున్న చిట్టి రెమ్మలని కొమ్మల్ని అడుగుతున్నాను . .
నీకు తెలుసా నీ కోసం మన ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో !అదిగదిగో మనస్సున్న మరుమల్లి యెలా
వాడి పోయిందో నీవులేక ,వన్నెచిన్నెల విరజాజి పందిరిని చూసావా తన నేస్తం చంపకం చెప్పే కబుర్లు మీద దృష్టి నిలపక మొర ఎత్తి కరిమబ్బుల లో నీ జాడలు వెదుకుతుంది చిట్టి చేమంతులు ముద్దు గులాబీలు మరువపు పొదలు
సైతం ఆత్రుతగా నీ చిరు సవ్వడి కోసం ఆలకిస్తున్నాయి .........
హమ్మయ్య ఇన్నాళ్ళకి మా పయి దయ కలిగిందా !చిరుగాలి తో మా ఊరు చూసి రమ్మని కబురు పంపావా !నీకు స్వాగతం పలకటానికి విరులన్నీ కొలువు తీరి ఉన్నాయమ్మావడిగా వచ్చి ఆనందపు జల్లుల్లో మమ్మల్ని ముంచెయ్యి !