7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఇదీ జీవితం

 చూడవద్దు అనుకుంటూనే కళ్ళప్పగించి టివి చూస్తుండిపోయాను .ఆ పెద్దాయనకి ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చింది !సర్వం కోల్పోయి పాలుగారేవయస్సున్నమనవడి భుజంపైన కుండ ఆని ఆన్చకుండా తన హస్తాలలో ఇముడ్చుకుని    హాలాహలం లాంటి నిజాన్ని దిగమింగుతూ తన కొడుకు పార్థివదేహం చుట్టూ తిరుగుతుంటే  ఇక చూడలేక టివి ఆఫ్ చేసేసాను న్యూస్ కోసం తప్పించి నాకు టివి చూసే అలవాటు లేదు .వాళ్ళు వీళ్ళు టివి సీరియల్స్ చూస్తుంటే ఒక లుక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్పించి పూర్తిగా చూసింది ఎప్పుడు లేదు .సుమన్ గురించి విన్నాను ,చదివాను బహుశ వాళ్ళ స్వగ్రామం మా స్వగ్రామం ప్రక్క ప్రక్కనే వుండటం ఒకే మండలం కావడం వలన ఒకింత ఆసక్తి .గత రెండు సంవత్సరాలుగా అతని ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా ఆశ్చర్యపోయేదాన్నిఆ మహమ్మారి ఎప్పటికైనా తనని కబళిస్తుంది అని తెలిసిన మామూలు వ్యక్తిలా తను గడిపిన జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం .తెలుగు పట్ల ఆ  కుటుంబం తీసుకున్న శ్రద్ద అబినందనీయం ,నిజానికి  ఈ మధ్యనే నేను ఆ పెద్దాయన నుంచి అందుకున్న" తెలుగు వెలుగు"
గురించి రాయాలనుకున్నకాని విధివశాత్తు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ప్రస్తావించాల్సి వచ్చింది.
బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ,భర్తను కోల్పోయిన భార్య ,తండ్రిని కోల్పోయిన పిల్లలు ,సోదరుని కోల్పోయిన సహోదరుడు ఈ తీరని దుఖం నుండి తీరుకోవాలని సుమన్ ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. 

6, సెప్టెంబర్ 2012, గురువారం

నాన్న

నాన్నని రేపు  డిస్చార్జ్ చేయొచ్చు అన్న మాట చెవుల్లో అమృతం పోసినట్లుంది .పోయిన గురువారం ఇదేరోజు హైదరాబాదు కిమ్స్ లో నాన్న ఆరుగురు పిల్లలం అల్లుళ్ళు కోడళ్ళుఅమ్మ మనవళ్ళు ఆందోళనలో నాన్న చుట్టూ ఉన్నాము మరునాడు నాన్న కి జరగబోయే పిట్యుటరి గ్లాండ్ సర్జరీ గురించి ధైర్యం చెబుతూ(..రిస్క్ సర్జరీ అని అంత భయపెట్టారు )..శుక్రవారం సర్జరీ పూర్తయ్యి శనివారం స్పృహ లోకి వచ్చేవరకు అక్కడక్కడే తిరిగాము నాన్న అందర్నీ గుర్తుపట్టే వరకు ఒకింత ఆందోళన .దేవుని దయవలన (మానస్ పాణి గ్రహీ )నాన్న సర్జరీ తరువాత పూర్వపు స్థితికి వచ్చారు .మా అందరి జీవితాల్లో తిరిగి వెలుగు వచ్చింది ముఖ్యంగా అమ్మ జీవితంలో...........