బ్లాగులు క్రమం తప్పక రాయాలి అనే నా కోరిక అస్సలు సాధ్యపడటం లేదు అడపాదడపా వచ్చి చూసిపోతున్నా కానీ కలం కదలడం లేదు. నా పాత రాతలు చదువుకుంటే రాయాలి అనే తీవ్రమైన కాంక్ష మొదలు అయ్యింది ఎన్నో మదిని దాటినా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చదువుకుంటుంటే సంతోషం భాధ కలగలిపి భావన . బ్లాగులు రాయడం దాదాపు ఆపేసాను . ఆ మధ్య తీరుబాటు కాక మనస్సు బాగోక రకరకాల కారణాలు . ప్రస్తుతం కొంత తీరుబాటు అయినా కొలువులోని వున్నా ఉద్యోగం లో పైపైకి వెళ్లేకొద్దీ ఓల్డ్ ఏజ్ దగ్గర పడే కొద్దీ అంటే సామాన్లు సర్దేసుకునే పని దగ్గరకి వచ్చే కొద్దీ అన్నమాట ..పని తక్కువ అవ్వుద్ది ..ఆఫీసుకి వెళ్లినా ఎదో ఒకటి అరా ఫైళ్లు చూడటం మినహా మిగిలిన సమయం లో న్యూస్ పేపర్ మొదటి నుండి చివరి వరకి చదివేసుకొవడం వీలయితే నాలుగు టీలు మగవాళ్లయితే నాలుగు దమ్ములు తీయడం కాసేపు వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టా అరచేతిలోనే చూసేయడం మనలా తోచి తోచని వాళ్ళతో ఫోన్లో బాతాఖానీ .అందుకే . కాస్త సమయాన్ని సద్వినియోగం చేద్దాము అనే దురాలోచన నాలో మొదలు అయ్యింది ... my blog is semi dairy of mine
12, మే 2022, గురువారం
బ్లాగ్ లోకి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)