21, నవంబర్ 2023, మంగళవారం
చిలకలు వాలే చెట్టు పులుగుల పాఠాలు
శీతాకాలం మొదలు అయిన దగ్గరనుండి ప్రొద్దున్నే వాకింగ్ కి వెళ్ళడానికి చాలా బద్దకంగా అనిపిస్తుంది అయినా వెళ్ళాలి తప్పదు ..చీమ చిటుక్కుమంటే లేచి గోల చేసే కోకిల హ్యాపీలుmy pets వెచ్చగా నా బెడ్ ప్రక్కనే తీవాచీలmeeda నిద్రపోతూ నేను చేసే చప్పుళ్లకు విసుగ్గు నా వంక చూసి మరింత ముడుచుకుని నిద్రలోకి జారుకుంటున్నాయి నాకు అనిపించింది జంతువులకి మనం నేర్పిస్తేనే డిసిప్లైన్ వస్తుందా అని ...ఏకాంతంలో మనలోకి మనం తొంగి చూస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు తరంగాల్లా స్తబ్దుగా ఉన్నాము అని అనుకుంటాం కానీ పైకి వినిపించని తరంగాలు ఎన్నో .... ఇంటి ప్రక్క వీధి లో అందమైన పార్కు ఉంది ఉదయాన్నే వెళ్ళినపుడు మనం తీసే గేటు చప్పుడు మాత్రమే వినబడుతుంది మెత్తటి పచ్చికలో అడుగులు వేసి వ్వాకింగ్ ట్రాక్ లోఅడుగులు వేసినపుడు గులకరాళ్లు అవి బేబీ చిప్స్ లెండి)చప్పుడు కరకర మంటూ మనతో ఏవో ఊసులు చెబుతున్నట్లు అనిపిస్తుంది పార్కులో చెట్లు అన్ని తపస్సు చేస్తున్న మౌన మునుల్లా గోచరిస్తాయి ..నిశ్శబ్దన్ని ఒక్కసారే ఛేదిస్తూ ఆ ప్రాంతం అంటా చిలకల చిలిపి రాగాలతో ...గారాలతో హోరెత్తిపోతుంది ..సరిగ్గా అప్పుడు మనం కనుక గడియారం చూసుకుంటే ఆరుగంటల ఇరవయ్యి నిముషాలు అయ్యుంటాది ,,ఎవరు చెప్పారు వీటికి సమయ పాలన మరొక పది నిమిషాలకి నాలుగు గుంపులుగా చేరి పార్కు చుట్టూ తిరిగి అనేక నలుదిక్కుల ఆహారాన్వేషణ కి కాబోలు గుంపులుగా విడిపోతాయిప్రతి దినం ఆ దృశ్యాన్ని చూడకుండా ఉండలేను ...విచిత్రంగా ఆకాశంలో ఎగిరే విహంగాన్ని చూడకుండా ఉండటం నా తరం కాదు ,,చిన్నప్పటి నుండి శబ్దం వినగానే ఇంట్లోనుండి పరిగెత్తికొచ్చికనుమరుగు అయ్యేదాకా ఆ విమానాన్ని చూసేదాన్ని పార్కు నుండి బయటికి రావాలి అంటే ఏడున్నర అవ్వాల్సిందే గన్నవరం లో ల్యాండ్ అయ్యి విమానం సరిగ్గా మా ఇళ్లమీదుగా వెళ్లాల్సిందే అదేంటో ఇది కూడా కచ్చితంగా పక్షిలా సమయ పాటిస్తుంది బ్లూ రంగులో ఉంటుంది బహుశా ఇండిగో కాబోలు ,,,,ఇక చెప్పొచిది ఏమిటి అంటే మనం పక్షుల్ని చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది వాటికి కష్టపడే తత్త్వం ఎవరో పెడతారని ఎదురు చూడవు వాటి ఇళ్లు అవే కట్టుకుంటాయి పిల్లలకి కొంత కాలం నేర్పుతాయి గర్వంగా పౌరుషంగా దర్జాగా బ్రతుకుతాయి కడవరకు ,,,మనం ఆలా ఎందుకు ఉండటం లేదో
19, నవంబర్ 2023, ఆదివారం
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా ఎద మాటున ... ..
చాలా. ......రోజుల తరువాత బ్లాగు రాయాలి అనే ఆశ వెంటాడుతుంది . నా కోసం సమయం కేటాయించడం అనేది మరల మరుగున పడిపోతుంది ... వయస్సు పెరిగేకొద్దీ నాకు ఎదో కొత్తకొత్త విషయాలు తెలుస్తూ వున్నాయి ...నిన్న మొన్న ప్రేమలు దూది పింజాలు విడిపోతున్నట్లు పోతున్నాయి ...మార్పు ఎటునుండి వస్తుంది ..మనం చూడటం లో లోపమా గతంలో ఇలానే ఉన్నారేమో బహుశా నాకు అర్ధం
కాదేమో ...ముఖ్యంగా ఒక రక్తం పంచుకుని పుట్టి ఒకరి కంచంలో ది నిరభ్యంతరంగా తినగలిగిన ఒక మంచంలో అందరం ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకుని కబుర్లు చెప్పుకున్న వైనం అంతా ఏమై పోయిందో
మన పిల్లలు ఎదిగే కొద్దీ పోల్చుకోవడం మొదలు అవుతుంది కాబోలు .. సంవత్సరాలు గడిచే కొద్దీ మరింత దూరం పెరిగిపోతుంది తప్ప దగ్గర కావడం మృగ్యం అవుతుంది .... ఒక లాలన ఒక దీవెన సడి చేయవా ఎద మాటున ... అమ్మ నాన్న పూలదండలో దారం లాంటి వారు ఆ దారం ఎప్పుడు తెగిపోయిందో అప్పులే పూలన్నీ చెల్లా చెదురు అయిపోయాయి ..మీరు ఆరుగురు ఎప్పుడు కలిసి మెలసి ఉండాలి అనే అమ్మ నాన్న కోరిక వాళ్ళతోనే తీసుకు వెళ్లిపోయారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)