మరల బ్లాగు రాయాలి అనిపిస్తుంది అన్ని బ్లాగులు చదువుతుంటే నేను రాసిన చివరిది గత సంవత్సరం నవంబర్ మాసం లో .
దాదాపు పుష్కరం నుండి మేము ఇద్దరమే ఉంటున్నాము చిన్ని పెళ్ళి అయ్యి usa వెళ్లినప్పటి నుండి వాళ్లేమో చుట్టపు చూపుగా యాడాదికి ఒక్కసారి వచ్చి రెండు నెలలు మురిపించి మెరిపించి వెళ్తారు .చిన్నికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు . పిల్లలు సగము తెలుగు ఆ సగం ఇంగ్లీషు కలబోసి మాట్లాడతారు.
ఈ జూన్ నెల చివరి వారంలో వచ్చిన పిల్లలు సెప్టెంబర్ లో వాళ్ళ ప్రయాణం దగ్గర పడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ని ప్రశ్నించడం మొదలు పెట్టారు ''మనం ఇండియా వదిలి అమెరికాలో ఎందుకు ఉండాలి ,మన రిలేషన్ అంతా ఇక్కడ ఉంటే మనం అక్కడ ఎందుకు ఉండాలి ,జాబ్ ఇక్కడే చేయొచ్చుగాఅమ్మమ్మ ఇక్కడ పెద్ద జాబ్ లో ఉందిగా మీరు ఇలానే చేయొచ్చుగా '' అని .నాకు చాలా ముచ్చట అనిపించింది పసి మనస్సుల్లో ఇన్ని ఆలోచన లు ఉన్నాయా అని ,అమెరికా వెళ్ళమని మొరాయించారు .ముఖ్యంగా హ్యాపీ కోకిలను (పెట్స్)వదిలి ఉండలేక ,అయిదు సంవత్సరాల చిన్నది ఇలా అన్నది ''let us stay here until they die ,because they are becoming old కదా అని బ్రతిమాలిందిreally touched her words ..చాలు ఈ ప్రేమ .