12, నవంబర్ 2009, గురువారం

జేజే లు

'పూసిందిపూసిందిపున్నాగ 'అంటూ నా మొబైల్ నుండి శ్రావ్యంగా ... ఇంత ప్రొద్దున్నే ఎవరా అని బెడ్ దిగకుండానేచెయ్యి సాచి మొబైల్ అందుకున్నాను ,టైం చూస్తె ఆరు దాటింది తలుపులన్నీ వేసినవి వేసినట్లే వున్నాయి చడిచప్పుడు లేకుండా అయ్యగారు వాకింగ్ కి వెళ్లిపోయారు .ఎప్పుడైనా నేను అలా నిద్రపోతుంటే నన్ను లేపడానికి మనసొప్పక అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు . ఈ రోజు ఇంపార్టెంట్ రోజు అని గుర్తుకొచ్చింది .అల్లం ,ఇలాచి వేసి స్ట్రాంగ్ గా టీచేసి సిట్-అవుట్ లో వున్నా గూటిలో (కేనేఉయ్యాల )లో కూర్చుని తాగబోతుండగా వాకింగ్ కి వెళ్ళిన వారు లోపలి అడుగు పెట్టారు ,లోపలి పోయి ఇంకో కప్ నిండుగా వేడి వేడి టీ తెచ్చి తనకి ఇవ్వబోతు కుడి చేయి చాపమని అడిగాను తను ఆశ్చర్యంగా ఒక లుక్ నావైపు ఇచ్చి చేయి చాపాడు .మనం ఆ చేతిలో చేయి వేసి 'హ్యాపీ బర్త్ డే 'అని అభినందించి, ఇప్పుడు తాగు అని వేడి కప్ అదే చేతిలో పెట్టాను .ఎన్నిసార్లు చేస్తారండి నా పుట్టిన రోజు అన్న మావారి మాటకీ సమాధానం నా చిరునవ్వు ఒకటి విసిరి ఖాళి కప్ తో వంటింటిలోకి వెళ్ళిపోయాను మిక్సిలో గారెలకి పప్పు రుబ్బడానికి. మా అత్తగారి ప్రకారం నాగుల చవితి రోజు వుదయాన్నే అందరుకు పుట్టకి బయలుదేరుతున్న సమయంలో వాళ్ళింట్లో నాగ జాతికి చెందిన స్నేక్ పుట్టిందట :) ఆ రోజు నవంబర్ పన్నెండు .మా మామగారు ఆ నాగు కి పుట్టినరోజు ఆ తారీకు ఖాయం చేసారు ...నాలుగు ఏళ్ళ క్రితం వరకు కూడా ప్రతి నాగుల చవితికి మా ';చిన్నోడు'పుట్టినరోజు అని తలుచుకునేది ...ఇప్పుడు తలుచుకోవడానికి ఆవిడ లేరు ,నేను మా అమ్మాయి గుర్తుచేస్తాము .అసలు పుట్టిన రోజు మాత్రం ఈరోజు మాత్రమె ...ఇంకొక అయిదురోజుల్లో చాల అరుదుగా వచ్చేరోజు మా ఇంట్లో వస్తుంది .:):) Happy birth day Nag :):)

15 కామెంట్‌లు:

anagha చెప్పారు...

అయితే , మీరు వాకింగ్ కి వెళ్ళకుండా ,పున్నాయి పూలు ఎరుకోకుండా నిద్రపోతున్నరన్నమాట ,కార్తి మాసం మొదటిరోజు మీరు చేసుకున్న తీర్మానం ఏమయ్యింది ?ఈరోజేన ,అసలు మానేసేర ?ఆ రోజు పోస్ట్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను .సరే !మీ నాగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి .

జయ చెప్పారు...

నా శుభాకాంక్షలు కూడా అందుకోండి.

మురళి చెప్పారు...

నేను అడగాలనుకున్నది అనఘ గారు అడిగేశారు..
అన్నట్టు మీరు పుట్టలో ఉంటున్నారన్న మాట :):)
నా శుభాకాంక్షలు కూడా చెప్పండి..

Hima bindu చెప్పారు...

@అనఘ
దారుణమైన అభాండం ...ఒక్కరోజు నిద్రపోతే మాత్రం అలా అనేయడమే !ఆ మద్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు రెండుమూడు రోజులు భంగం అయ్యింది ..నేను అదే బాటలో వున్నాను .ధన్యవాదాలు తనకి చెప్తాను .
@జయ
ధన్యవాదాలండీ ...తప్పక అందచేస్తాను ...రాసేప్పుడు చెప్పానుప్రపంచం అంత టం టం వేస్తున్నాను అని :)

Hima bindu చెప్పారు...

@మురళి
నిజమే పడగ నీడలో ....ఒక్కోసారి వేయిపడగల తలమీద "మణి"లా మెరిసిపోతూ వుంటున్నాను -:)
పాటిస్తున్నాను మహా ప్రభో (ఆక్రందన అన్నమాట )...నాగ్ కి చెబుతాను మీ కాంక్షలు .

sunita చెప్పారు...

నా శుభాకాంక్షలు కూడా అందుకోండి.

ఉమాశంకర్ చెప్పారు...

నాక్కూడా అదే సందేహం..అయితే కింద సమాధానం దొరికింది లెండి ( మీ ఆక్రందన రూపంలో :) ) ......

ఇంతకీ మీ కార్తీక సోమవారం నాటి నిర్ణయాలు కార్తీకమాసం వరకే పరిమితమా లేక ఎప్పటికీనా? అబ్బే, ఏమీ లేదండీ, మళ్ళా ఎప్పుడైనా ఇలా పట్టుబడితే నిలదీయడానికుంటుందనీ...:)

తనకి మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయగలరు..

Hima bindu చెప్పారు...

@సునీత
ధన్యవాదాలండీ ....ఇప్పుడే తనని పిలిచి చదివి వినిపించానుఅందరి అభినందనలు.అవి విని (కొంచెంఆనందం , ఇబ్బంది ,సిగ్గు కలగలిపి )అందరికి థాంక్స్ చెప్పమని చెప్పారు.
@ఉమా
హు !మీరుకూడానా -:(
కార్తికం కే కాదు అన్ని కాలాలకి :) ఈసారి ఇలా అమాయకంగా పట్టుబడనుగా.నాగ్ కి మీ అందరి పేర్లు చదివి వినిపించానండి ...తన స్పందన పైన రాసాను .

భావన చెప్పారు...

నేను నేను... నేను చెప్పేను అని చెప్పండి నాగ్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఐతే గారెలేసి పెట్టేరు అన్నమాట పుట్టిన రోజు స్పెషల్...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

కొంచెం లేట్ అయినట్టున్నాను. అయినా పరవాలేదులెండి.నాగరాజు గారికి మా తరపున శుభాకాంక్షలు కూడా అందచేయండి.

పుట్టిన రోజు పాపాయి నాగరాజుకు జేజేలు
హిమబిందువును సిగలోన దాల్చిన ఫణిరాజుకు జేజేలు
మదిలోన హిమం నిత్య నాట్యమయూరి
ఎదలోన ప్రతిధ్వనించే హిమరాజ పుత్రి

మనసంత నిండి మైమరపించే మంచిముత్యమురా
వేడుకతోడ వినిపించె జన్మదిన గీతికరా

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అదిగోండీ..చిన్నిగారు..మళ్ళీ గారెలు అని చెప్పీ నోరూరిస్తున్నారు...నాగ్ గారికి నా తరపున శుభాకాంక్షలు తెలియజేయండి. గారెలు పంపించడం మర్చిపోకండేం!!

Hima bindu చెప్పారు...

@బావన
థన్క్యు...చెబుతాను .గారెలే కాదు ఇంకా వేరే కూడా :)
@భా.రా.రె
ఎంత అలవోకగా అల్లుతారండి కదంబ మాల !
చాల చాల బాగుంది..అన్నట్లు ఈ ఫణి కి వెనుక రాజు లేదు ...ఈశ్వరుడు వున్నాడు ,మీ అభినందనలు అందుకున్నాం .
@శేఖర్
అర్జెంటుగా అడ్రెస్స్ చెప్పేయి వేడి వేడిగా వండి పంపిస్తాను ..తనకి అందజేస్తాను మీ అభినందనలు .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అయ్యో చిన్నీ ముందు చెప్పారు కాదు. ఈశ్వరుడని తెలిస్తే అసలు మంచుకొండమీద నాట్యమాడించి ఉండేవాడిని కదా :)

పరిమళం చెప్పారు...

అరెరే ..మా ఇంటాయన కూడా నాగులచవితినాడే పుట్టారట ! తారీఖు వేరే లెండి ...మరి మాతరుపున కూడా శుభాకాంక్షలందించండి స్నేక్ గారికి ....సారీ నాగ్ గారికి :) :)

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
అవును హిమాలయ నుంచి జాలువారుతున్న మంచుబిందువు .
చెబుతాను అది అరుదైన విషయమే .
@పరిమళం
ఓహ్ !మీ ఇంట మా ఇంట ఫణి రాజులే .స్నేక్ కి అందించానండి .దన్యవాధలండీ .