26, నవంబర్ 2009, గురువారం

"బంధం "..... ...........

ఇల్లంతా నిశ్శబ్దం.....
ప్రతి రోజు పరిచితమైందే
కాని ఈ రోజేంటి ఇంత క్రొత్తగా వుంది !
మనస్సంత కలతే .....
గుబులు గుబులుగా దిగులు దిగులుగా
నిద్ర కళ్ళతోనే గుర్తొచ్చింది నువ్వేళ్ళతావని
బరువయ్యిన మనస్సుతో నా అడుగులు భారంగా పడ్డాయి
ఇదివరకింత కలత పడలేదే మరెందుకు నాకు చింత !
ఎన్నెని సార్లడిగానోనీవు వెళ్ళాల్సిన రైలు గురించి
నా వంక దీర్ఘంగా చూస్తున్న నీ చూపు నన్ను దాటిపోలేదు
సమయం మించిపోతున్న నీ అడుగులు వడిగాపడక
నింపాదిగా వెనక్కి వెనక్కి నన్ను చూస్తూ వెళ్తోన్న ...
నీ కళ్ళ లోని దిగులు నన్ను మేఘమల్లె ఆవరించి
నే చూస్తున్న కారుఅద్దాల్లో నీ రూపు మసకబారింది
నాకర్ధం అయ్యింది ఉదృతంగా ప్రవహించే జలపాతం సహితం
తన సుదూర ప్రయాణంలో ఎక్కడోఅక్కడ నిశ్చలంగా ప్రవహిస్తుందని
ఈ "బంధం "అంతేనేమో ..... ...........

14 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఏం చెప్పాలో తెలియటం లేదండీ...చాలా అర్ధ్రంగా రాసారు. తను వెళ్ళిన ప్రతీసారి ఇలా దిగులుపడటం మీకు తప్పటం లేదు...మీరు తొందరలోనే కలత వీడాలని ఆకాంక్షిస్తున్నాను.

Hima bindu చెప్పారు...

@శేఖర్
ఇంకొంచెం సరిగ్గా చదివితే మీకు వేరే అర్ధం గోచరిస్తుంది :) ఒంటరితనం అనిపించి ఆ క్షణం లో నా చేత అలా రాయిన్చేసింది నా మనస్సు. ఎనీ హౌ థాంక్స్ ఫర్ యువర్ కన్సుర్న్

జయ చెప్పారు...

ఇలా అయితే ఎలాగండి చిన్నిగారు. విరహము కూడా సుఖమే కాదా..అని కొంత కాలం పాడుకుంటే...ఆతరువాతి ఆనందం...మీకు చెప్పాలా!మీ నూతనోత్సాహంలో మమ్మల్ని కూడా ముంచెత్తుతారు...

Hima bindu చెప్పారు...

@జయ
హమ్మ ! అది విరహం కాదండీ ఒక్కదాన్నే ఉండాలా అన్న భయం ...నా మీద నాకు పెరుగుతున్న జాలి ....వయస్సుపెరుగుతుంది గా ఆ దూకుడు తగ్గిందని :)

భావన చెప్పారు...

ఇద్దరి గుండెలు గుబులయ్యి మనసేమో దిగులయ్యి కాదంటు, కుదరదంటూ, తప్పదంటూ అనుభవిస్తున్న వంటరితనం ఎంత తుళ్ళి పడేంతలో పూర్తవదూ... చూడండీ.. అయ్యే పోయింది.. కదా... :-)

మురళి చెప్పారు...

నాదీ జయగారి మాటేనండీ.. ఇక ఆవిడకి మీరిచ్చిన జవాబుకి నా సమాధానం "అంటా మనం అనుకోడం లో ఉంది" ...ఏమంటారు?

Padmarpita చెప్పారు...

భయము వలదు కదమ్మా
బ్లాగ్ తోడుంది మీకమ్మా!:):)

జయ చెప్పారు...

భావనా! హిప్ హిప్ హుర్రే.....

పరిమళం చెప్పారు...

:( :(

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

కొంచెం చిక్కదనానికి ప్రయత్నిస్తే చాలా అద్బుతంగా వుండెదండీ

sreenika చెప్పారు...

ఇలాటి చిన్ని చిన్ని విరహాలు,
తర్వాతి కలయికలూ బంధాల్ని మరింత బలోపేతం చేయడానికే కదూ...
చాలా బాగుంది.

cartheek చెప్పారు...

చిన్ని గారు.....
నాకూ ఇది విరహం లానే అనిపించింది ఏమిటో ...... :) :)
అమ్మో కోపడద్దు....

కాని మనసుకి హత్తుకుంది...

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
బ్లాగే కదా మనకి తోడు ....నిజమే .
@మురళి
మీరు అంతేనా :(
@బావన
నిజమే చిటుక్కున అయ్యేపోయింది ...భయం పాయె :)
@జయ
-:(
@జాన్ హైడ్ కనుమూరి
ధన్యవాదాలు
@పరిమళం
-:)
@శ్రీనిక
ధన్యవాదాలు
@కార్తిక్
అబ్బబ్బాకాదు ...మనస్సుకు హత్తుకుంది అంటారా ...ధన్యవాదాలు

మరువం ఉష చెప్పారు...

హమ్మయ్య, నేను వొంటరిదాన్ని కాదు. మీబోటివారున్నారు. ఇకపోతే, తనుంటే తన కళ్ళు, తను లెనపుడు తన కోసం దిగుళ్ళు - ఇక భయ్యానికి తావేది.

మురళి, ఈ "అంతా మనం అనుకోడం లో ఉంది" అన్నది మీ మగవారికి వసతో పెట్టిన విద్యా ఏమి? ;)