2, మే 2010, ఆదివారం

నిద్ర కరువయ్యింది


గత పదిరోజులనుండి మా ఇంట్లో వాళ్లకి కంటిమీద కునుకు వుండటం లేదు .దీనికంతటికి కారణం మా ఇంట్లోకి వచ్చిన కొత్త ప్రాణి .అది చేసే అల్లరి అంత ఇంత కాదు .వయస్సు చూస్తేనేమో నిండా మూడు వారాలు కూడా లేవు ఎన్నాళ్ళ నుంచో పాప గొడవ చేస్తున్న ఇంట్లో చూసేవాళ్ళు లేరు కష్టం అని వాయిదా వేస్తూ వచ్చాను అదీ కాక దానికి ఏదైనా అయితే తట్టుకునే శక్తి లేదని (మా చిన్నప్పటినుండి మాతో పాటు ఎన్నో పెరిగి కళ్ళ ముందు పోయాయి )నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ..కాని అనుకోకుండా ఒక రోజు చెల్లి రెండిటిని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని తీసుకువచ్చి తానొకటి మాకు ఒకటి ఇచ్చింది.బుజ్జిది రోజులపిల్ల అల్లరి చేయదేమోననుకున్న ..హమ్మ మమ్మల్ని నిన్చోనియదు ,కూర్చోనీయదు మేము ,ఎక్కడుంటే అది అక్కడే ...హాల్లో ఒక మూల అమ్మగారికి పడక ఏర్పాటు చేసాను ..ఉహు ...నిద్రపోతున్నట్లే వుండి గంటకోసారి కుయ్యో కుయ్యోమని అరుపులు ..తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాలి ,దానికేమో మద్యలో చలివేసి మళ్లీ అరుపులు మనం అపుడు తీసికెళ్ళి హాల్లో పడుకోబెట్టి అది నిద్రపోయేవరకు ఉండి చప్పుడు చేయకుండా వచ్చి నిద్రపోవాలి ,మరల అరగంటలో దానికి మెలకువ మల్లిపోయి బుజ్జగించి మన గదిలోకి తెచ్చి నిద్రపుచ్చాలి కాసేపటికి దానికి చలి ....అట్టాతెల్లారిపోయి ఇంకేం నిద్రపోతాం అని అమ్మాయిని వరండ లోకి తీసుకొచ్చి ఆడుకుంటూ దాన్ని ఏమార్చి పోయి టి తయారుచేసుకోవాలి ....మన చీర కుచ్చిళ్లో ,పైటకొంగు తోనో అది నోట కరచిమనల్ని కవ్విస్తూ ఆడుతుంటే మనం చచ్చినట్టు ఒంతమ్మ బంగాలు వదులమ్మ అని ముద్దుగా బతిమాలుకోవాల్సిందే ..లేకపోతె మా అమ్మాయితో పడలేము తనతో పాటు సమానంగా చూడట్లేదు ..అది "కుక్క "ని చీప్గా చూస్తున్నారు అంటుంది ..వచ్చిన పది రోజుల్లోనే మా ముగ్గురి మనసు దోచేసింది .ఈ "బంగారాని కి" ఇంకా పేరు స్థిరపడలేదు ..ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలుస్తున్నాం ...

14 కామెంట్‌లు:

Battula Moshe Choudary చెప్పారు...

Hi
This is Moshe Choudary Battula. I am creating a blog to help students
who are financially poor or financially backward in 2007. So many are
giving scholarships for those students. Most of the students can't
know that type of scholarships.

My blog helps poor students definitely. It is a right guide for the
students who are searching for scholarships.

Iam collecting so many trusts and foundations and government
scholarships for the students.

Please see my blog and add your comments

http://www.ocscholarships.blogspot.com

If you know any information about scholarships then mail me i'll post
the scholarship information in my blog.

If you want to join contributor to my blog you can also mail me

123bathula@gmail.com



All of Bloggers are requested to add my blog in your blogs and
help some students.

Thanks & Regards to all Bloggers for supporting me.


Your's
Moshe choudary Battula

kvsv చెప్పారు...

చాలా హాప్పిగా వుంటుందండీ పెట్స్ తో..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అరె..భలే ఉందండి బుజ్జి ముండ( నాకు జంతువులేమైనా తెగ ముద్దొస్తే అలానే అంటాను..మరోలా అనుకోవద్దు..). ఆడికి బస్ట్ సైజు ఫోటో ఒకటి తీసి పెట్టాల్సిందండి...ఇంతకు అది పమేరియనా లేక వేరే జాతిదా?..నాకు వాటిని పెంచుకోవాలంటే చాలా ఇష్టం..కానీ ఇంట్లో చూసేవాళ్ళు ఉండాలి కదా..అదే ప్రాబ్లం..

Hima bindu చెప్పారు...

@Battulamoshechoudary
మీ బ్లాగ్ చూసానండి .చాల మంచి పని చేస్తున్నారు .తప్పక నా తరుపు కాంట్రిబ్యూషన్ వుంటుంది
@kvsv
అవునండి ఎంత చిరాకులో వున్నావాటిని చూడగానే మనస్సు తేలిక అయిపోతుంది .
@శేఖర్
ఏమి పర్లేదు బుజ్జిముండ అనవచ్చు నేను అలానే అంటాను .ఇది అమ్మాయిదీనితోపాటు చెల్లి కూడా వుంది అది మా చెల్లి పెంచుకుంటుంది రెండు కలిస్తే ఒకటే ఫైటింగ్ పమేరియన్ జాతే ,రోజుల పిల్ల .వీటిని చూసుకునే వాళ్ళు ఇంట్లో ఉండాలండి లేకపోతె కష్టమే .బస్ట్ సైజు ఫోటోలు వున్నాయి కాపోతే నాతో కలిపి ఫోజులు ఇచ్చింది :-)

జయ చెప్పారు...

మీ బంగారు బాగుందండి. ఇంకా కొన్ని కబుర్లు వినాలని ఉంది. చిన్నప్పుడు కనపడ్డ ప్రతి కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చేసే దాన్ని.మా అమ్మ ఎన్ని తిప్పలు పడేదో పాపం. కుక్కపిల్లలంటే నాకంత ఇష్టం.

Hima bindu చెప్పారు...

@జయ
మనం చిన్నప్పుడు అదే పని ..మా ఆరుగురికి తోడు ఇంకోటి వుండేది మేము స్కూల్ కి వెళ్తే మా అమ్మ బోర్ ఫీల్ కాకుండా ఉండటానికి .బంగారం కబుర్లు ఎన్ని చెప్పిన తరగవండీ .

సుభద్ర చెప్పారు...

చిన్నిగారు,
మ౦చి పేరు పెట్ట౦డి ము౦దు,,,,,జిప్సీ,పెప్సి,స్వీటీ,డాలీ..........
చాలా చాలా బాగు౦ది మీ చిన్నమ్మాయి..

తార చెప్పారు...

bangarame pere fix cheyandi.

danni indian splitz andi, manam 200 vandala samvastaraluga kastapadi mana climate ki saripoye german splitz nunchi transform chesukunnadi

Hima bindu చెప్పారు...

@సుభద్ర
రోజురోజు కి మా చిన్నమ్మాయి ముద్దుగా తయారవుతుంది ..అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయి ..బంగారం ....బంగారు కన్నా ,బంగారు తల్లి అయిపోయింది .
@తారా
ధన్యవాదాలండీ .మీరు చెప్పెవరకి తెలిదు వాటి బ్రీడ్ గురించి .మీరన్నట్లే 'బంగారం ' ఫిక్స్ అయ్యింది .:-)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

మనం ఆనందంగా ఉండలంటే చెప్పే మార్గాలలో పెంపుడు జంతువును పెంచుకోవడం ఒకటి. ఇంట్లో చిన్న పిల్లలున్నా, పెంపుడు జంతువులున్నా మనం ఎక్కువ సేపు సరదాగా ఉంటాం.

Hima bindu చెప్పారు...

@విశ్వప్రేమికుడు
అవునండి ...పసిపిల్లలు పెంపుడు జంతువులు మనస్సుకు అవధిలేని ఆనందం కలిగిస్తారు .రెండురోజుల క్రితం మా ఇంట్లో ఇదే డిస్కషన్ జరిగింది .

మురళి చెప్పారు...

భలే బాగుందండీ..

Raj చెప్పారు...

మొత్తానికి మీ ముద్దుల పట్టి మమ్మల్ని బాగా ఆకట్టుకుంది..

మధురవాణి చెప్పారు...

భలే క్యూట్ గా ఉంది మీ బంగారు :-)