ఇంతకి ఏవిటా పేజి ఏమా కథ అని చదివే వారికీ సందేహం రావచ్చు .,అవి "టారో, రాశి ఫలం .అదేంటో నా నక్షత్ర ప్రకారం ,అలానే పుట్టిన తేది ఒకటే రాశి ని సూచిస్తాయి .ఇలా హరోస్కోప్ చదవడం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పీటర్ విడాల్ చదవడం తో అలవాటయ్యాయి ,తరువాత లిండాగుడ్ మాన్ పుస్తకాలు అలా సరదాను పెంచాయి .జ్యోతి ,ఆంధ్రభూమి వార పత్రికల్లో వార ఫలాలు చదవడం అలవాటు అయ్యాయి .అసలు కథలోకి వెళితే
టారో లో ప్రతి వారం మనకి కలిసి వచ్చే రంగు సూచిస్తారు .ఆ రంగులు మనం ధరిస్తే మనపై గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటాయని నమ్మకం .అట్లా ఆ వారం మనం వాడాల్సిన రంగులు గుర్తుపెట్టుకుని పూలు (ఫ్లవర్‌వాజ్ లోకి )ఆ రంగుకు దగ్గర ఉండేట్లు చూసుకోవడం చేస్తుంటాను .ఒక్కోసారి వరుసగా ఒకే రంగు సూచిన్చొచ్చు .అప్పుడు వుంటాది నా పని :-) ఆ మద్య వరుసగా కలసి వచ్చే రంగు తెలుపు అని రాస్తే రెండు మూడు వారాలు ధవళ వస్త్రాలు ధరించడం జరిగింది ,ఏదో ముఖ్యమైన ఫంక్షన్ కి ఫ్యామిలీ తో వెళ్తూ పార్టీవేర్ తెలుపులో తీయగానే ...అసలీ రంగు వదలవా ఏమైంది నీకు అని క్లాసు చెప్పించుకున్నాను ....అయిన మనం నోరు మెదపలేదు చెప్తే "ఫూల్"అనిపించుకోవాలని .అలానే కాషాయం వరుసగా రెండు సార్లు ....హబ్బ ఆ రంగులో ఎక్కువ చీరలు లేక భలే కష్టపడ్డాను దగ్గర గా వుండేవి కట్టి నడిపెసాను.
నిన్న రాసిన దాన్లో గులాబి రంగు కలిసి వచ్చేది అని చదివాక తీరికగా బౌల్స్ లో గులాబి పూలు వేసి అక్కడక్కడ సర్ది వర్డ్రోబ్ లో వారం కి సరిపోయే పింక్ సారిస్ తీసి వేరేగా సర్దుకున్నాను .నిన్న గులాభి రంగు చీర కట్టిన కాసేపటికి మా అమ్మ తో కాసేపు ఫోన్ లో ఫైటింగ్ పెట్టుకున్నాను .మద్యాహ్నం మా తమ్ముడు వస్తే వాడి తో సరదాగా కబుర్లు చెబుతూనే వాడిని ఫటమని తిట్టేసాను .సాయంత్రం మా పార్వతిని(పని ) పిలిచిమరి పని ఎలా శుబ్రంగా చేయాలో ఘాట్టిగా క్లాస్స్ తీసుకున్నాను .మా అమ్మాయి చదువుకుంటుంటే మద్య మద్యలో తను చదవలేనప్పుడు ప్రక్కనే కూర్చుని చదివి పెడతాను మద్య మద్యలో ప్రశ్నలు వేస్తాను ....నిన్న తను వెంటనే కొన్నిటికి జవాబులు ఇవ్వలేదని నీవల్ల కాదులే అని అనవసరంగా తిట్టేసాను .ఇక చివరిగా మా ఇంటాయనతో (శ్రీవారు)తో కూడా గొడవ అయ్యింది ..ఎప్పుడు అస్సలు బాక్ రిప్లై ఇవ్వను ...తీక్షణంగా ఒక లుక్ లుక్‌కి ప్రక్కకి వెళ్ళిపోయే నేను ఎదురు నిలబడి మాటకి మాట అన్నాను ....బహుశ డైజస్ట్ అయ్యుండదు :-) నాకేమైనా బ్లడ్ ప్రేస్సర్ షూట్ అయ్యిందేమోనని డౌట్ కాని ఆ చాయలేమి మనల్ని ఇంకా చేరలేదు .
నాకు నేను ఆలోచించుకున్నాను ..ఎందుకింత రెబిలియాస్ గా ప్రవర్తిస్తున్నానో అని ......నో డౌట్ గులాబి రంగు ప్రభావం అని అనుకున్న ....సరయితే రెండో రోజు కూడా చూద్దాం అనిపించింది .ఆఫీసు కి సమయం కంటే రెండుగంటలు ఆలస్యంగా వెళ్లాను .,ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళేదారిలో మా లేన్ నుండి కార్ మెయిన్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఆర్ .టి .సి . సిటీ బస్సు వాయు వేగం తో వచ్చి నూలుప్రోగంత దూరం లో ఆగింది ,ఇక అయిపోయాను అనుకుంటూ తల త్రిప్పెసుకున్నాను ...కాని ఏదో అదృష్టం ఘోరప్రమాదాన్ని తప్పించింది .అది తప్పినా అయిదు నిమిషాల్లో మా ఆఫీసు ప్రాంగణం లో హెయిర్ పిన్ బెండ్ లాటిది వుంటాది ,అక్కడ వాటర్ కాన్స్ తో ఆటో వస్తు కార్ ని కొట్టాల్సింది సడెన్ బ్రేక్ తో ఆపుకున్నాడు .ఆఫీసు రూం లో నా టేబుల్ పైనున్న ఫోటో ఫ్రేం (నా ఫోటో వుంటుంది )గంట క్రితం పడి పగిలిపోయింది ...తీసి గాజుపెంకులు క్లీన్ చేస్తున్నారు .నాకు చాలా భాద అన్పించింది సుమారు అయిదేళ్ళ నుండి వుంది ,ఉద్యోగాసోపానం ఇయర్ బుక్ , ఎగ్జిబిషన్లో నాచేత రిలీజ్ చేయిన్చినపుడు సురేష్ గారు ప్రెజెంట్ చేసింది ,మంచి కొటేషన్స్ తో వుండే ఫ్రేం అది. కొన్ని నచ్చి మనం అపురూపంగా చుసుకున్టున్నప్పుడు ఏమైనా జరిగితే భరించలేము ఇలా ఎందుకు జరుగుతుది అని కాసేపు ఆలోచించగా నాకు హటాత్తుగా 'గులాబి ' గుర్హోచ్చింది .ఆఫీసు లో ఎక్కువ సేపు గడపకుండా ఇంటికి వచ్చేసి ఆహ్లాదమైన నీలం లోకి మారిపోయాకగాని నా మనస్సు శాంతించలేదు .ఈ వారం పొరపాటున గులాభి రంగు బట్టలు కాని గులాభి రంగులోని పూలు కాని అంటరాదని ఘట్టిగా తీర్మానించేసుకున్నా ......ఏం చేద్దాం నేనో "సెంటి -మెంటల్ "............
7 కామెంట్లు:
:-) :-)
మీకూ నాకూ రెండు పోలికలున్నయండీ! అవేంటంటే..
1. "మనకి అనుకూలంగా రాసి వుంటే ఇక మనల్ని పట్టలేమో ...ఏమైనా తేడాగా రాసుంటే" అసలు నమ్మాలో వద్దో కూడా అర్ధం కావడం లేదు" అనేస్తాను"
2. అదేంటో నా నక్షత్ర ప్రకారం ,అలానే పుట్టిన తేది ఒకటే రాశి ని సూచిస్తాయి.
కాకపోతే, నేనేమో మీలా పాటించాను. ఊరికే చూసి ఊరుకుంటా! అయినా నాకున్న తిక్కకి తోడు అవి మరీ గుర్తుంచుకుని పాటిస్తే.. అమ్మో కొత్త సమస్యలొస్తాయి. ;-)
అన్నట్టు నాకో సందేహం.. ఒకవేళ పింక్ కలర్ వేస్కున్నందుకే యాక్సిడెంట్లు తప్పిపోయాయేమో! ;-) ఏదయితేనేం.. అంతా బాగే కదా.. అది హ్యాపీ :-)
ప్చ్..ఇలాగే నేను కూడా చిన్నప్పుడెప్పుడో ఒక రంగు చొక్కా తొడుక్కొని పరీక్షకు వెళితే వందకు వంద మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రతి పరీక్షకు అదే రంగు. ఒకసారి రంగు పడింది అనుకోండి:)
yeah blame it on pink! :)
హ్మ్ బావుంది మీ గులాబీ గాధ, ప్రమాదాలు తప్పాయి అంతవరకు సంతోషం.
నాకు ఒకప్పుడు ఇలాంటి పిచ్చి కొంచం ఉండేది. నాకు అకౌపచ్చ మంచిది అని ఎవరో చెప్తేనో, ఎక్కడో చదివితేనో తెలిసింది. ఒక పరీక్షకి ఆకుపచ్చ డ్రెస్సు వేసుకున్నాను. బ్రహ్మాండం....అద్భుతంగా రాసేసాను. 100 కి 100 అనుకున్నా. మరుసటి రోజు పరీక్షకి అదే డ్రెస్సు...పరీక్ష అదిరిపోయింది. మూడోరోజు ఆ డ్రెస్సు తీస్తూ ఉండగా, మా అమ్మ అరిచింది "ఏం నీ మిగతా బట్టలన్ని చిరిగిపోయాయా?" అంతే మారుమాట్లాడకుండా వెనక్కి పెట్టేసాను. నాకున్నది ఒకే ఒక ఆకుపచ్చ డ్రెస్సు, మా అమ్మకి ఒళ్ళు మండితే అది ఎవరికైనా ఇచ్చేస్తుంది, ఎందుకొచ్చిన గొడవలే అని తెల్ల డ్రెస్సు వేసుకుని వెళ్ళాను...ఆరోజూ పరీక్ష సూపరుగా రాసాను. ఒహో మొదటి రోజు ప్రభావమే ఉంది కామోసు అనుకుని ఇంకోసారి అలాగే ఆకుపచ్చ డ్రెస్సుతో మొదటి పరీక్ష రాసాను. రంగుపడింది, నా మొహం పచ్చగా పాలిపోయింది. ప్రశ్నాపత్రం ఇచ్చిన మనిషి కరడుగట్టిన ఛండశాసనుడు.ఇంకేం చెప్తాం.....అదన్నమాట సంగతి.
@మధురవాణి
నీలాంబరి గా మారాక ప్రశాంతం గా అయిపోయానండి .ఇప్పటికి గులాబి అనే మాట వింటుంటేనే గుబులుగా వుండండి .నేను ఈ ఫన్ డే చదవడం మొదలెట్టినప్పటి నుంచే వారం వారం రంగులు మొదలు పెట్టాను .అంత క్రితం సోమవారం ధవళం మంగళ వారం కాషాయం బుధవారం పెసరపచ్చ ..ఇలా వాడేదాన్నిపూర్వం పెద్దలు ఏడువారాల నగలు ధరించినట్లు .
@భా .రా .రె
పరీక్షల్లో వాడే బట్టలు ,పెన్స్ ,స్కేలు సహా సెంటిమెంటు తో నడిపెదాన్ని (చిన్నప్పుడు కాదు ).మా చిన్నచెల్లి వరుసగా నాలుగేళ్ళు ఒకటే డ్రెస్ మైంటైన్ చేసింది ఎంతమంది ఎడ్పించినా
@శరత్ కాలం
ధన్యవాదాలు
@కొత్తపాళీ
మరేం చేస్తానండి .....సాక్షి ఫన్ డే లో రాసిన ఆవిడని యేమనలేక :-(
@సౌమ్య
బాగుంది :-) మా ఇంట్లో ను ,ఇంకా కొంత మంది స్నేహితులకి ఇలాటి సెంటిమెంట్స్ బోలెడు వున్నాయి ..ప్చ్ అది మన తప్పుకాదు ట్రాన్సిషన్ లో వున్నాం అనుకుంటాను కొన్ని మూర్ఖంగా అనిపిస్తాయి లోతుగా ఆలోచిస్తే ......
బాగా రాశారు.. టారో నేనూ చదువుతాను కానీ ఫాలో అవ్వను.. రాశి ఫలాలు కూడా అంతే.. నాకు గానీ వాళ్ళు 'ఈ వారం అద్భుతంగా ఉంటుంది' అని రాశారంటే ఆ వారంలో కచ్చితంగా ఏదో ఒక చెడు జరగడం అన్నది కొన్నిసార్లు జరిగింది.. ఇప్పుడు చదివి సరదాగా పక్కన పడేయడమే.. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులకి, మిత్రులకీ వాళ్ళ రాసి ఫలాలు చదివి విన్పించి సరదాగా ఏడిపిస్తూ ఉంటా (వాళ్ళ రాశికి ప్రత్యేకంగా ఏవన్నా రాస్తే.. )
@మురళి
అవునవును ...మీలాంటి స్నేహితులే మాకు ఇలా టారో చదవటం అలవాటు చేసారు :-(
కామెంట్‌ను పోస్ట్ చేయండి