12, మే 2010, బుధవారం

నేను చేసిన తప్పేవిటి? -బంగారు


ఈ రోజు నేను ఏమి చేసిన అమ్మ( చిన్ని) తప్పులు పడుతుంది ...హ్మం ...ఏంచేయాలి :-(
నేను ఏమి చేసిన ముద్దు ముద్దుగా గారం చేస్తూ నన్ను చూడ వచ్చిన వారందరికీ
నేను చేసే పనులు గొప్పగా చెప్తూ నన్ను వాళ్ళ ముందు ప్రదర్శనలు ఇమ్మని బ్రతిమాలి
లాలిచ్చి నాతో పనులు చేయించుకుని ఇప్పుడేమో హు...అయిన నేను గమ్మున వుంటానా!
అమ్మ కి ఘాట్టిగా ఇచ్చాను ...నాకు సపోర్టుఅక్క ( చిన్ని వాళ్ళమ్మాయి) డాడీ వచ్చారు ...అయిన
లెక్కచేయలేదు ,వాళ్ళని నోరుమూసుకోమంది..వాళ్ళని వాళ్ళ పని చూసుకోమంది ,నా పని ఆవిడ
చూస్తోందట...యెం చూస్తుందో నేను చూస్తాను .
అసలు నేను చేసిన తప్పేమిటో చెప్పండి .....
తనని పని చేసుకోనివ్వకుండా కాళ్ళ కి అడ్డం పడుతున్ననట .ఒక్కర్తే పని చేసుకుంటుంది అని జత వెళ్ళడం
తప్పా!అమ్మకన్నా ముందు నడవాలని పోటి పడ్తు ముందుకి వెళ్ళడం తప్పేమిటో .....ముందు వెళ్ళాను అనే
ఆనందం తో కాళ్ళ దగ్గర అందిన చీర కుచ్చిళ్ళ తో ఆడుకున్నాను ...అది తప్పట .మరి తను నాకు అందేట్లు
ఎందుకు కట్టాలో..హ్మం ....తిట్టిన ఏమనకుండా తనకి తోడుగా పనయ్యేదాకా వున్నానా ...అస్సలు కృతజ్ఞత
లేదు.
అమ్మ ఎక్కడుందో కాలి మువ్వలు మనకి పట్టించేస్తాయి .ఏదో పుస్తకం చదువుతుంది కదా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని
తన కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చున్నాను ,నా కళ్ళు మువ్వల మీద పడ్డాయి భలే వున్నాయని చూద్దామని ఒకటి పీకాను
అమ్మ పుస్తకం లో వుండి నన్నేమి గమనించలేదు సరికాద ఇంకోటి తీద్దామనుకుని కాలిపట్టి లాగబోయి కాలు కొరికాను
అది తప్పంటా...ఇంకా నయం గట్టిగ కొరకలేదు .అప్పుడు చూసింది నేను ముందు తీసిన మువ్వని ...నేను నేల మీద పడిన
మువ్వని తీద్దాం అనుకునే లోపు తనే తీసేసుకుని నా చెంప మీద ఒక్కటిచ్చింది ,చిన్నదాన్ని అని కూడా చూడకుండా :-(
మువ్వ తింటే నేను చచ్చిపోతానంటా...అంటే ఏంటో ?
అలిగేసి హాల్లోకి వచ్చి డాడీ కాళ్ళ దగ్గర కూర్చుని నా దారిన నేను టి.వి లో క్రికెట్ వస్తుంటే డాడీ తో పాటు చూస్తూ కూర్చున్నాను .
ఇంతలోనే అమ్మ వచ్చేసి "నీకు కూడా ఆ పిచ్చి పట్టిందా,మంచి అలవాట్లు నేర్చుకో "అని నన్ను అక్కడి నుంచి లేపేసింది ,డాడీ వంక
చుర చుర చూస్తూ ...మా ఇద్దర్ని కలిపే తిట్టిందని నా అనుమానం .
అమ్మ అసలే కోపంగా వుందని అక్కడనుంచి లేచి వెళ్లి
అక్క చదువు కుంటుంటే ప్రక్కనే కూర్చున్నాను ,అక్క కి నేనంటే ఎంతో ప్రేమ ,పరీక్షలయ్యాక నాతోనే ఆడతానని చెప్పిందిలే .
అక్క లా చదువుదామని అక్కతో గొంతు కలిపాను,అమ్మ చుస్తే మురిసిపోతదని .. ....అంతే "అసలు నీకు బుద్దివుందా ?అక్కని చదుకోనియవా
ఎందుకు గోల చేస్తున్నావ్ "అంటూ కోప్పడింది .నాకొకటి అర్ధం అయ్యింది అమ్మకి కొంచెం తిక్క వుందని ...
నేనేమి చేసిన తప్పేనా...?...ఏమి చేయలబ్బా :-(

17 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

బంగారూ
ఏడవకమ్మా. నీకు చక్కని తల్లి వుంది. మా పోకిరికీ తల్లి వుంది కానీ ఏం లాభం.

మధురవాణి చెప్పారు...

:-) so sweet of you Bangaru ;-)

ప్రేరణ... చెప్పారు...

నిజమే కదా!నువ్వేంటి, నువ్వు చేసిన తప్పేంటి?:)

Sravya V చెప్పారు...

I enjoyed the read, definitely this the is one of your best post !

Ram Krish Reddy Kotla చెప్పారు...

ayyo papam bangaru..nee thappu em ledammaa :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఒరేయ్ బంగారం బుజ్జులూ...నువ్వలా ఫీలవకూడదురా...ప్రతీ ఇంటిలోనూ కొన్ని పద్దతులుంటాయి..అవి ఏంటో నువ్వు అర్ధం చేసుకుని మెలగాలి..అంతేగానీ ఖాళీగా ఉన్నావని ఏదో ఒకటి పీకితే నిన్ను పీకుతారు ఎవరైనా...అయినా ఇప్పుడు నీకు అర్ధం అయింది కదా..అమ్మకు ఏమి చేస్తే కోపం వస్తుందో..ఇకపై అలా చేయకుండా బుద్దిగా ఉండు..సరేనా!

@చిన్నిగారూ,
ఇదేం బాలేదండి..మా వాడిని చిన్నపిల్లోడని కూడా చూడకుండా చెంపమీద కొడతారా?

Padmarpita చెప్పారు...

అయ్యో బంగారు పోనీలేమ్మా...
పడ్డవారు చెడ్డవారుకారులే:)

మురళి చెప్పారు...

అంతే బంగారం అంతే.. ఈ పెద్దోల్లున్నారే... :-) :-)

Hima bindu చెప్పారు...

@శరత్ కాలం
@మధురవాణి
@ప్రేరణ
@Sravya vattikuti
@Kishan reddy
దాన్యవాధలండి .నిజమే ఆ బుజ్జి ది చేసిన తప్పేమీ లేదు .దానితో ఇరవయ్యి నాలుగు గంటలు ఆడేవాళ్ళు కావాలి..:-)
శ్రావ్యగారు గుండె తడిలో నుంచి వచ్చినవి సహజంగా బాగుంటాయి .

Hima bindu చెప్పారు...

@శేఖర్
బంగారం చాల అల్లరిదండీ ....మరి మువ్వ గొంతులో అడ్డుపడితే ఎలాగండి ...ఈ రోజైతే నాతో పాటు క్యాంపు కి తీసుకుపోయాను వాళ్ళ అక్క ని చదువుకోనివ్వడం లేదని .ఇది అమ్మాయి :-)
@పద్మర్పిత
అందరు బంగారు పార్టీనే :-)
@మురళి
హు....అంతేనా ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

వాడు అమ్మాయని నాకు గుర్తుందండీ...జనరల్ గా ఎవరిమీదైనా లవ్వు ఎక్కువైతే 'రా' భాష వాడేస్తుంటాం కదా..ఆ భాషలో స్త్రీలింగం కాస్త పుంలింగం అయిపోతుంది...:-)( మొన్నటి ఆదివారం సాక్షిలో ఖదిర్ బాబు గారి కధలో ఆయన కూడా ఈ పాయింట్ చెప్పారు)

మరువం ఉష చెప్పారు...

చిన్నీ, ఇది బహుశా రెండో టపా కదు? ఈ బుజ్జాయి మీద. నిజంగానే ఇలా పెంపుడు జంతువులు భలే మన జీవితంలో భాగమైపోతాయి. మా అమ్మగారు తన పుట్టింటిని గూర్చి చెప్పిన ఏ ఊసుల్లోనూ వీటి ప్రసక్తి లేకుండాపోలేదు - శోభ, జిప్సీ, లైకా, పెడ్రో, సుబ్బు...ఇప్పటికీ పెద్ద మావయ్య గారి మాటల్లో "సిద్దు" గాడు. ఒక్కోసారి ఫోను చేయగానే ముందుగా వినపడేది వాడి గొంతే. కాకిని వాలనీయడు, అలా కాకిగోల, వీడి అరుపులు. "మీరు కాసేపు ఆగండి, వాడి గొంతు వింటాను." అని మరీ వినటం నాకు అలవాటు.

బంగారు, అలా బెదరకూడదు. బాగా అలగరా అమ్మాయ్, మారాములు సాగించు చిన్నారి. :)

Praveena చెప్పారు...

Chaala interesting ga vundi ee post :)

Hima bindu చెప్పారు...

@శేఖర్
ఓకే ...మనకి కూడా వుంది ఆ అలవాటు :-)
ఖదీర్ కథలో రాసింది భలే గుర్తుపెట్టుకున్నారే !
@ఉష
అవునండి.ఇప్పుడు ఇంటికి రాగానే అప్రయత్నంగా నా కళ్ళు బంగారు తల్లి కోసం వెదుకుతున్నాయి ..అవి మనుష్యుల కంటే ప్రేమగా ,అభిమానంగా ఉంటాయండి ...అందుకే మీ అమ్మగారి కబుర్లలో సహజంగా వుండటం .ఎన్నో మైళ్ళ దూరం లో వుంది కూడా కేవలం సిద్దు గొంతు వింటున్నారంటే చుడండి ..అవి మన మనసులోకి ఎలా చొచ్చుకుని వస్తాయో.కాని అవి చనిపోతే ఆ దిగులునుండి బయటికి రావడం చాల కష్టం..అయిన ఈ సారి దైర్యం చేసేసాను
@ప్రవీణ
ధన్యవాదాలండి ..

భావన చెప్పారు...

హుమ్ బంగారు నైనాకాక పోతిని చిన్ని బ్లాగ్ లో కెక్కగా... గులాబి రంగైనా కాక పోతిని చిన్ని భరతం పట్టగా. ;-) మా వూళ్ళో ఒక అబ్బాయి కారు నంబర్ ప్లేట్ బంగారం (మన తెలుగు అబ్బాయేలే). ఈ రోజు పొద్దుట వర్క్ లో ఆ అబ్బాయి కార్ ప్లేట్ చూడగానే మీ బంగారే గుర్తు వచ్చింది. చెప్పలేదు లే చెపితే ఫీల్ అవుతాడేమో ఆ అబ్బయి అని,అదివాళ్ళ ఆవిడకు ప్రేమ గా బంగారం అనినంబర్ ప్లేట్ వేయించి మరి బహుమతి గా ఇచ్చి ఈ యనే వాడేస్తున్నాడూ ఆ కార్ ను. ;-)

జయ చెప్పారు...

మీ బుజ్జి బంగారం మీద మా అందరి కళ్ళు పడిపోయాయండి. జాగ్రత్తమ్మ దిష్టి తగిలేను. అయినా మీరు కాంపుల కెళ్ళాలిగా,పోనీ నాకిచ్చేస్తారేంటి. మా కాలేజ్ లో జాయిన్ చేసేస్తాను. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉంటుంది.

Hima bindu చెప్పారు...

@భావన
హ్మం ...నా భరతం పడతార ?.......ఆ అబ్బాయి ఎవరో మా వారి లాటి వాడనుకుంటాను .ఈ మద్య అలానే నాకని కొని తనే తిరుగుతున్నాడు :-)
@జయ
తీసుకోండి జయగారు ...బొత్తిగా అల్లరిది అయిపోయింది ,మీదగ్గరైన డిసిప్లిన్ అయిన నేర్చుకుంటాది.:-)