25, మే 2010, మంగళవారం

ఆదివారం అబిడ్స్ లో వెయిటింగ్

చాలా సంవత్సరాల తరువాత పని పాట లేకుండా వచ్చేపోయే జంటలని ,జనాన్ని ,బస్సుల్నిచూస్తూ అభాగ్యనగరం లో అబిడ్స్ సెంటర్ లో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగున్నర వరకి గడిపాను.ఉదయం ఇంటి దగ్గర నుండి బయలుదేరేప్పుడే చదువుతానికి ఏమైనా పుస్తకాలు పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పిన నా మనస్సు పుస్తకం మీద చచ్చిన లగ్నం కాదని ముందే తెలిసి ఒక్క న్యూస్ పేపర్ మాత్రం వెంట తెచ్చుకున్నాను .మా పాప రాసే ఒక పరీక్ష కి మనం ఎస్కార్ట్ అన్నమాట .ఉదయం రెండుగంటలు మద్యాహ్నం రెండుగంటలు జరిగే ఈ పరీక్ష మద్యలో మూడుగంటలు విరామం .ఇంటికి వెళ్లి రావడానికి ముప్పావుగంట సమయం వృధా అందుకే పూర్తి సమయం అక్కడే గడపడానికి నిర్ణయించుకుని మావాళ్ళని పంపించేసాను సాయంత్రం వచ్చి పిక్ అప్ చేసుకోమని ఒక ఆర్డర్ పడేసాను నన్ను చూసి మా పిన్ని కొడుకు ఇంటర్ చదివేవాడు నాతో ఉంటానని ఆగిపోయాడు .
.పరీక్ష హాల్లోకి తొమ్మిది గంటలకే అంతా పరుగులు తీసారు .క్యాంపస్ లో చెట్టు కిందో లేక వరండాలోనో కూర్చుందామని ప్లాన్ చేసుకున్నాను ..ఈ లోపు అక్కడికి సెక్యురిటి కి వచ్చిన పోలీసు అధికార్లు హింది ఉర్దుల్లో ఏమేమో మాట్లడేసుకుంటున్నారు ..మనకి కొంచెం కొంచెం మాత్రమె అర్ధం అవుతాదాయే (ఇదర్ ఆయియే లాటివన్నమాట ) పేరెంట్స్ ని ఇతరులను పంపించేద్దాం అని అనుకుంటున్నట్లు అనిపించి వెళ్లి అడిగాను" మేము ఇక్కడే కూర్చుంటాం "అని ."ఎగ్జం ఇస్టాట్ అయ్యింది మీరు ఉరుకున్ద్రి "అని నా వైపు జాలిగా చుస్తూపక్కనే వున్నా ఒక సెక్యురిటి హెచ్చరించాడు .ఓహో మనం పరీక్షలు రాసేవాళ్ళ కనబడుతున్నామా అని కాసింత మనసులో మురిసిపోయి (మా బంగారం పుణ్యానా దాని వెనుక పరుగులు తీస్తూ నెల రోజుల్లో నాలుగు కేజీలు తగ్గిపోయానయ్యే) అబ్బే నేను రాయడం లేదు మా వాళ్ళు లోపలి వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తాము అని ,నాలాటి వాళ్ళు చాలా మంది చేరారు ,కాని కాంపస్ లో ఉండటానికి వీలు లేదనేసారు.
.ఉస్సృమంటూ నిట్టూర్చి నా కూడా వున్నా మా కజిన్ తో రోడ్ ఎక్కాను .ఎదురుగా mcdonald's వుంది కాని అది పదకొండు గంటలకి ఓపెన్ చేస్తారాయే ,ఏ ఇంటికి పోవాలన్నా చాలా దూరం ...కాలేజి బయటనున్న బస్సు స్టాపులో కూర్చున్నాం వచ్చేపోయే బస్సుల్ని చూడొచ్చని...అలా కూర్చున్నామో లేదో బస్సులు ఆగే ప్రదేశం అంతా మురుగు కాల్వ ఒక్కసారే ఏరులా పొంగి ప్రవాహం ....అదే నీళ్ళలో దిగి ప్రయాణికులు బస్సు ఎక్కడం దిగటం ...భయంకరమైన దుర్గంధం నీళ్ళు చిమ్మి పైకి మా మీద పడేంత ,అక్కడినుండి లేచి కొంచెం ప్రక్కకి నడిచేసరికి జార్జ్ చర్చి అని పూరాతన భవనం కనబడింది జనం లోపలి కి బయటికి తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళ ప్రార్ధనలు అయ్యినట్లున్నాయి ..లోపలికి పోయి ఏదొక చెట్టుకింద కూర్చోవచ్చులేమ్మని ఇద్దరం లోపలి కి వెళ్లి ఆ ప్రాంగణం లో వాళ్ళ కోసం వేసివున్న ప్లాస్టిక్ చైర్స్ లో కూర్చున్నాం .నేను సీరియస్ గా సాక్షి పేపర్ తో ,వాడేమో వాడి మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ....వాళ్ళేమో ప్రార్ధనలు అయ్యి ఆడవాళ్ళు గుంపులుగా కబుర్లు గోల గోల ...పది దాటేక ఓపిక నశించి మరల రోడ్ మీదికి వచ్చేసరికి ఎదురుగా macdonald's తెరచి వుంది ..హమ్మయ్య ఏ.సి లో కూర్చోవచ్చని రోడ్ కస్టపడి దాటి (మనకి అసలే భయం )లోపలి కి వెళ్లేసరికి ..ఇంకా సర్విస్ స్టార్ట్ కాలేదు వెయిట్ చేస్తామంటే కూర్చోండిఅని నమ్రతగా......అదే మాకు కావాల్సింది అంటూ ఆనందంగా సెటిల్ అయ్యి ....ఇక చూడండి టి.వి లో వచ్చే మాధవన్ సినిమా సఖి చూస్తూ వాళ్ళ స్పీకర్ల హోరులో నుండి వచ్చే పాశ్చాత్య సంగీతం వింటూ ఇటు సినిమా డైలాగులు వినబడక ...చీమల దండులా నెమ్మదిగా జంటలుగా వస్తున్న టీనేజి పిల్లల్ని చూస్తూ ...బురకాల్లో వచ్చిన హిందూ గాళ్స్ ని చూస్తూ .....చేసే పనిని ఆ మాత్రం దైర్యం లేక తెగువ చూపిస్తున్న అమ్మాయిల్ని చూసి మెచ్చుకోవాలో నోచ్చుకోవాలో అర్ధం కాని పరిస్థితి ...మొత్తం ఫ్లోటింగ్ ఈ వయస్సు వారిదే ....అసలు వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇంతింత డబ్బులు ఎలా వస్తున్నాయో ,పేరెంట్స్ ఎందుకు ఇంతింత ఇస్తున్నారో ...ఏ మాత్రంఆ పిల్లలు కష్టపడకుండా వచ్చిన డబ్బు ఇలా దుర్వినియోగం....ఆ అమ్మాయిలూ మరల లేచి బయటికి వెళ్ళే ముందు నల్లటి ముసుగులు తగిలించుకుని వెళ్తుంటే నాకు సంభంధం లేకపోయినా మనస్సు చివుక్కుమంది .ఈ మాటలు నా డాటర్ తో అంటుంటే అయ్యో మమ్మీ ఇక్కడ ఇది చాల సహజం చాలామంది ఇలానే చేస్తారు ...ముస్లిమ్స్ వాడే పరదాలు మన వాళ్లకి ఇలా పనికివస్తాయి అంది .పూర్వం యవనులు అరబ్బులు ,టర్కిష్ వారినుండి మన స్త్రీలను కాపాడుకొవాడానికి వాడిన పరదా నేటి ఆధునిక యుగం లో ఇంకొకరకంగా............ఇలా..ప్చ్...
సాయంత్రం వరకి మాకు వేదికగా ఉపయోగపడిన రెస్టారెంటుకి ఒక వెయ్యిరూపాయలు మూల్యం చెల్లించి (నానా గడ్డి తిన్నందుకు :-)) బయటపడ్డాం.
....-0-.........

...




























8 కామెంట్‌లు:

భావన చెప్పారు...

హి హి హి జై మెక్డోనాల్డ్, మీకు ఒక కొత్త విషయం తెలిసింది. నెలలో తగ్గిన నాలుగు కిలోల లో ఒక కిలో ఆ రోజు తిరిగి తెచ్చేసుకుని వుంటారు గా..

budugu చెప్పారు...

why did hindu gals wear buraqa? enlighten me...i did nt understand.

జయ చెప్పారు...

సో, ఎంట్రన్స్ లు రాయటం మొదలయ్యిందన్నమాట. మీ పాప కి నా బెస్ట్ విషెష్. మీ బంగారం ని అడిగానని చెప్పండి. పాప చదువుకు అడ్డం పడొద్దంది జయా ఆంటీ అని చెప్పండి.

Hima bindu చెప్పారు...

@భావన
ప్చ్..:-( అదే అనుకున్నాను ....మనకేమో బొత్తిగా కంట్రోల్ వుండదాయే ఐస్ క్రీం గట్ర చుస్తే .
@budugu
నేను సరిగ్గా అర్ధం అయ్యేట్లు రాయలేదనుకుంటాను ....ఏముందండి బుర్కాల్లో అబ్బాయిలతో బైక్ ల మీద వచ్చి అక్కడే బురక తీసేసి మరల వెళ్ళేప్పుడు వేసుకోవడం....నిజానికి అది వారి వ్యక్తిగతం కాని వాళ్ళు చిన్న పిల్లలు (టీన్స్) ధైర్యం వుంది కాని పెద్దవాళ్ళని ,తెలిసిన వాళ్ళని పేస్ చేయలేక ....ఇలా ......
@జయ
బంగారం కి చదవగానే చెప్పానండి జయ ఆంటీ అడిగారని :-)
హహహ .....ఎంట్రెన్స్ రాయడం ఏమిటి ?మీరు వింటే హచ్చార్యపోతారు....

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అమ్మో మీరు అన్ని గంటలు వెయిట్ చేసారా? నిజంగా గ్రేట్ మీరు...
మీ అమ్మాయి ఇంజనీరింగ్ సర్వీసెస్(IES) గానీ రాస్తున్నారా?
బంగారం గాడికి అడిగానని చెప్పండి..అలాగే ఈ వేసవిలో వాడికి ఎక్కువగా అయిస్ క్రీం లు తినమని చెప్పండి..:-)

Hima bindu చెప్పారు...

@శేఖర్
ఇ బదులు ఇంకో అక్షరం పెట్టుకోండి:-) ఈ బంగారం గాడికి ఏం పెట్టిన తినేస్తాడు .....మామిడి పళ్ళు తింటుంటే మీదకి యెగిరి మనల్ని తిననీయడం లేదు ,చూడకుండా తినాల్సివస్తుంది :-(

Unknown చెప్పారు...

చిన్ని గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

పరిమళం చెప్పారు...

నాకూ అప్పుడప్పుడూ సినిమా హాల్స్ లో , రెస్టారెంట్స్ లో ఇటువంటి వాళ్ళని చూసినపుడు చాలా బాధనిపిస్తున్దండీ ...తల్లితండ్రులు వీళ్ళని నమ్మి కాలేజ్ కి పంపిస్తుంటే వీళ్లేమో ఇలా ..ప్చ్ ...