22, జూన్ 2013, శనివారం
9, జూన్ 2013, ఆదివారం
ఆ పరిమళం నన్నింకా వదలలేదు
వేసవి వెళుతూ వెళుతూ తనతోపాటు మల్లెపూలు మామిడి పళ్ళు తీసుకువెళ్ళి పోతుంది కదా ఆ అనుభూతిని ఇంకొంత కాలం ఆస్వాదించాలని మామిడి పళ్ళ లోని చిన్న రసాలని జ్యూస్ తీసి డీప్ ఫ్రీజర్ లో పెట్టాను ఎంచక్కగా చిన్న రసం తినాలి అనిపించినపుడు చక్కగా తీసి తినేయోచ్చని . అలానే మల్లెల పరిమళాన్ని మనస్సంత నింపుకోవాలని నిన్న మధ్యాహ్నం లక్ష పాతికవేలు మల్లెమొగ్గలు తెచ్చి డెబ్బయ్యి వేల మొగ్గలని మాలలు కట్టించి మిగిలన మల్లె మొగ్గల్ని రాసులుగా పోసి ఈ రోజు ఉదయం వరకు చల్లని నీళ్ళు చిలకరిస్తూ పసిపిల్లల్ని పొత్తిళ్ళ లో సాకినట్లు సాకాను నిన్న రాత్రంతా మా ఇల్లంతా మల్లెల పరిమళ లే ఇంటి చుట్టుప్రక్కల వరకు గుబాళింపు లే .. ఇంటి ప్రక్క వీధిలో కొలువయ్యి వున్నా రామయ్య శివయ్య దంపతులకి మల్లెల మాలలు సమర్పించి మిగిలిన లక్ష్లమల్లెపూలను శ్రీదేవి సహిత శ్రీనివాసునకి వెంకటేశ్వరస్వామి ఆలయంలో కన్నుల పండుగగా కళ్యాణం చేయించాము .చిన్ని కల్యాణం చక్కగా నడిపిన శ్రీవారికి (వెంకటేశ్వర స్వామి )కానుకగాలక్షమల్లెపూలతో జరిపించి కృతజ్ఞతలు తెలుపుకున్నాము ... ఇప్పటికి ఇంట్లో మల్లెల తాలుక పరిమళం గది గదికి ఆవరించి వుంది...స్వామి కార్యం స్వకార్యం అంటే ఇదేనేమో!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)