17, నవంబర్ 2013, ఆదివారం



యేం రాయమంటవే చిన్నారి


యేం రాయమంటవే చిన్ని-ఓ నా చిన్నారి

ఎప్పుడు అమ్మ నాన్న అంటు లేదంటే అక్కచేల్లి ,తమ్ముళ్ళు గతంతోనే గచ్చకాయలు ఆడుతున్నా నంటావా

నా స్నేహితులు ,స్నేహితులంటో ఇంట్లోవున్న నెచ్చెలి మానసపుత్రిక చిన్నారి ని నిర్లక్ష్యం చేస్తున్ననంటావా

నీ గురించి రాయమంటావా ?ఏమని రాయమంటవే చిన్నారి .......


ఆరుగురి తరువాత మాతో ఆడుకోవడానికి మా ఇంటికొచ్చిన అందాల బొమ్మవని చెప్పాలా?

ఆరిందాలా అమ్మమ్మ వెంట నట్టింట తిరుగుతూ నడయాడిన బుట్టబోమ్మవని చెప్పాలా?

అమ్మ ఎప్పుడు చదువుకోవాలంటూ పుస్తకాలు తెచ్చి నా ఒడిలో పడేసిన చిన్నారి చిన్నివని చెప్పాలా ?

నిత్యం నన్నావరించిన మలయమారుతం నీవేనని చెప్పాలా ?


చిన్ని చిన్ని అడుగులతో కూచిపూడి ని ఔపోసన పట్టిన

చిన్నారి నాట్యమయూరి సుధవని చెప్పమంటావా?

కమ్మని గాత్రంతో పరిసరలను సైతం ముగ్ధుల్ని చేసే

ఈ ఇంటి కొమ్మ వనమాలినివని చెప్పమంటావా ?


అమ్మ చదివి చదివి అలసిపోతే ,పదేళ్ళకే పెద్దపెద్ద పుస్తకాలు నాన్న కు పోటీగా చదివి విన్పించిన వైనం చెప్పమంటావా

అమ్మ నాన్నకే అమ్మల కోసరికోసారితినిపించే అన్నపూర్ణవని చెప్పమంటావా ...

అమ్మ దుఖపడుతుంటే కొండంత అండ నేనున్నానని తనువెల్ల పెనవేసుకునే ఆశవాహినివని చెప్పమంటావా ..


నీ స్నేహంతో నన్ను నీ వయస్సుకు దించిన నీ గడుసుదనం గురించి చెప్పాలా

నీవు అమ్మకి చెల్లి వి అని తెలీని జనం అంటుంటే చిందులేసిన వైనం చెప్పాలా

నీ ఆటపాటలకు సైతం నాకు చోటిచ్చిన నేచ్చేలివని చెప్పాలా

నీవేమి దాచవమ్మ మనిద్దరి మద్య ,నేనేం దాచకుడద కలనయిన !


అమ్మకిచ్చిన మాట చెప్పమంటావా

అమ్మ సాధించనిది సాధించి చూపుతనంటావా

అమ్మ కల ల హరివిల్లు అమృత దర్శిని


యేం చెప్పాలే చిన్నారి ..ఈ ప్రియదర్శిని గురించి ఇంకేం చెప్పాలే .....

(మా అమ్మాయి అలిగితే మురిపించడానికి రాసాను ....) అప్పుడెప్పుడో .. 
కలనయినా ఊహించలేదమ్మ భూగోళానికి నువ్వావల నేనివల ఉంటామని .... నువ్వెక్కడ వున్నా నేనెక్కడ వున్నా అమ్మ ప్రేమ దీవేనలు పున్నమి వెన్నెల లా  నిరంతరము వర్షిస్తూనే ఉంటాయమ్మా చిన్ని నా చిన్నారి 
కార్తిక పౌర్ణమి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నితల్లికి  కిజన్మదిన  శుభాకాంక్షలు ... ప్రేమతో  అమ్మ