వారం కి ఒక్కసారైనా బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు కన్నాను కానీ నా ఆశలన్నీ అడియాశలు అయ్యిపోయే ...అదేదో కోతి కధలా ముళ్ళు పోయి కత్తి వచ్చే కత్తి పోయి పిల్ల వచ్చేలా వెదవ ముఖపుస్తకం మాయలో పడి కొట్టుకుపోతూ మునుగుతూ ..తేలుతూ హమ్మయ్య ఆ మాయలో నుండి తప్పించుకునే లోపు వెధవది వాట్సాప్ పట్టేసుకుంది వద్దు మొర్రో అనుకున్న వందల గ్రూపులు అక్కాచెల్లెళ్ల గ్రూప్ అనురాగాలు ... అనుబంధాలు ... కజిన్స్ ... ఫ్రెండ్స్ చిన్నారి బంధాలు ... ఉజ్జోగం బంధం .... కలెక్టర్ బంధం ,జిల్లా బంధం టెలిగ్రామ్ ఒకటి కజిన్ లా ... రోటరీ సేవ బంధం యోగా బంధం ...వాకర్స్ బంధం .. కులగౌరవాలు .... నాటక బంధం ...పాటల బంధం వాట్ నాట్ ...మనకి ఇష్టం వున్నా లేకపోయినా అందులోకి లాగేయ బడతాం .... మొహమాటం గా నచ్చితే ఉండటం నాలుగు రోజులాగి జంప్ ... కొన్ని నోరుమూసుకుని ఉండాల్సి రావడం ...మరి అప్పుడప్పుడు బిగ్ బాస్ లకి ఎస్ సార్ ...నోటెడ్ సార్ అనాలిగా ..ఎప్పటికప్పుడు మెస్సేజి చెక్ చేసుకోవాలి లేపోతే ఏమైనా మిస్ అవ్వుతాము మిస్ అయ్యి తిట్లు తినేసిన రోజులున్నాయి ....అట్లా అలవాటయిన టెలిగ్రామ్ వాట్సాప్ నేడు వ్యసనం అయ్యి కూర్చుని నా సమయం మొత్తం మింగేస్తుంది .... అక్కడికి చాలా వాటినుండి తప్పుకున్న నాకు నచ్చిన వాటినుండి తప్పుకోలేక పోతున్న ....అందుకే బ్లాగు లేకపోతున్న ....చదవలేకపోతున్న ...ఎక్కడికి పోయిన వైఫై ఉందొ లేదో చెకింగ్... అన్నట్లు బ్లాగు బంధాలు లేదనుకుంటాను :-)... అది కూడా గ్రూపు చేసేస్తేపోలా --;) ;)
9, అక్టోబర్ 2016, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)