15, ఏప్రిల్ 2020, బుధవారం

'కరోనా' కాకి

నాకిప్పుడు అర్ధం అయ్యింది ... 23 ఏళ్ళ తరువాత . హిస్టరీ పుస్తకాలు తీసినప్పుడల్లా ఇండస్ వాలి సివిలైసేషన్ అర్ధాంతరంగా అదృశ్యం అవ్వడానికి చరిత్రకారులు చెప్పే కారణాలు ఒకదాని తరువాత ఒకటి కళ్లముందు కదలాడుతుంటాయి ... శత్రువుల దండయాత్ర అని నదీముంపు  ఫ్లడ్స్ ..ప్రకృతి వైపరీత్యాలు ,,,,రకరకాలా కారణాలు ... ఒక్కోచోట శవాల గుట్టలు ...మొహంజొదారో అంటేనే చావులదిబ్బ  విశ్లేషణ !!!
ఇటీవల ఇటలీ కరోనా తో అల్లాడుతున్న దృశ్యాలు ,,నగరమంతా నిర్మానుష్యముగా {వ్వాట్సాప్ పిక్స్ }...అవి నిజమో కాదో ...మృతులను సామూహికముగా తీసుకుపోయి ఖననం చేస్తున్న తీరు ...అందమైన ఇల్లు వదిలి వెంటిలేటర్ మీదో స్మశానం లోనో ...దీర్ఘ నిద్రలో....
సీన్ కట్ చేస్తే  కొన్ని వేల సంవత్సరాల తరువాత భావితరము బుర్రబద్దలు కొట్టుకుంటుందేమో .... ఇల్లు కట్టుకునేప్పుడు  తవ్వకాలు చేసేప్పుడో  బయటపడే సామూహిక అస్థిపంజరాలు చూసి .... వాళ్లకి మాత్రం తెలియదు  'కరోనా' కాకి వీళ్లందరినీ ఎత్తుకెళ్లిందని ... 
ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే  అప్పట్లోకూడా ఇలాంటి మహమ్మారి ప్రబలి సింధు నాగరికతను అంతం చేసి ఉండొచ్చని !

5 కామెంట్‌లు:

Murali చెప్పారు...

"అప్పట్లోకూడా ఇలాంటి మహమ్మారి ప్రబలి సింధు నాగరికతను అంతం చేసి ఉండొచ్చని !"

కావచ్చు. ఇంకా రక రకాల theories ఉన్నాయనుకోండి. ఇది కొంచెం possible అనిపిస్తుంది నాకైతే.

I found this to be a well balanced and researched article: https://www.ancient-origins.net/ancient-places-asia/mohenjo-daro-massacre-00819

తేటగీతి మురళి

Hima bindu చెప్పారు...

థాంక్స్ అండీ ,తప్పకుండా చూస్తాను.

Hima bindu చెప్పారు...

చదివానండీ .. చాలా దిగులు యధా ప్రకారము .థాంక్యూ

Murali చెప్పారు...

దిగులు దేని గురించి? సింధూ నాగరికత అకస్మాత్తుగా అంతరించి పోయిందనా?

Hima bindu చెప్పారు...

అప్పటి వారి పరిస్థితిని చూసి ఆ పిక్స్ వీడియోలు చూస్తే ... ఎందుకో తెలీదు ఇండస్ వాలి సివిలైసజెషన్ లోకి వెళ్ళినప్పుడల్లా చాలా భాధ గా ఉండేది ... హిస్టరీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ..నా సివిల్స్ పరీక్షలకి ఒక ఆప్షన్ ... గతమును ఎక్కువ ప్రేమిస్తాను కాబోలు .. అమ్మమ్మ వాడిన తిరగలి రోలు రోకళ్ల సహా తెచ్చుకుని దాచుకుంటాను హ్మ్మ్