కరోనా కాకి అని గత టపాలో పేర్కొన్నాను .....కరోనా కాకి కాదు గ్రద్ద ....ముమ్మాటికీ ఇది మహమ్మారి ఇట్లా వచ్చి అట్లా తన్నుకు పోతుంది .దీనికి వయస్సు నిమిత్తం లేదు ....తెలుగు బ్లాగు మిత్రులు అందర్నీ దుఃఖం లో ముంచి వేసింది ....పాట తో నేను ...వీధి అరుగు ..నాతొ నేను నా గురించి ...మూగవి అయ్యాయి .కరోనా తీసికెళ్ళి పోయింది ...మీరు లేరని తెలిసి నా తోబుట్టువు పోయినంత దుఃఖం లో మునిగిపోయాను ...మిస్ యు .
30, ఏప్రిల్ 2021, శుక్రవారం
13, మార్చి 2021, శనివారం
మరల కలుస్తాము?
బ్లాగ్ రాసి చాలా కాలం అయ్యింది ....రాయాలి అంటే చాలా వుంది ....పంచుకునే విషయాలు ఆహ్లాదకరంగా ఉంటే ఏమైనా రాయొచ్చు ...ఇటీవల కాలం లో ముఖ్యంగా 2017 నుండి వరుసగా ఆత్మీయులు నన్ను కన్నవారు మూడు నెలల క్రితం ఆత్మీయ తోబుట్టువు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నాను ...మరుపు మనిషికి ఇచ్చిన వరం అంటున్నారు కానీ ఆ వరం నా విషయం లో మృగ్యం తెచ్చ్హి పెట్టుకున్న ఆనందాలు అవి మాత్రం ఎంతసేను ...మత్తు మందులకు ఎందుకు బానిస అవుతారో అర్ధం అయ్యింది .... సున్నిత మనస్కులు మాత్రమే అనుకుంటాను ... రెండోసారి ఒక యోగి ఆత్మా కథ చదివాను కానీ నా ప్రశ్నలకి సమాధానం దొరకలేదు.. . ఒకటే ఆలోచన వీళ్ళు ఎక్కడికి వెళ్లి వుంటారు?నిజంగా మనకి తెలియని లోకాలు ఉంటాయా? మరల కలుస్తాము?
14, జనవరి 2021, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)