భావోద్వేగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భావోద్వేగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2009, శనివారం

సాయంసమయంలో

మలి సంధ్యవేళలో ...
కడలి అంచున నేను
మదిన మౌనగీతం ఆలపిస్తూ ...
అనంతమైన ఆకాశం లోని
నీలి మేఘాల పరదా కప్పుకుని
ఎగిసిపడే అలల నురుగ చూస్తూ
అల్లరి గాలికి ఎగిసిపడే వలువలనదిమి
కలల ప్రపంచంలో నీకై విహరిస్తున్నాను
తారలన్నీ రేరాజు చేరి సరసమడే వేళ
చిన్నబోయిన మోముతో దిక్కుదోజక
చుక్కల నీ జాడలు వెదుకుచు ...సొమ్మసిల్లిన నా మేను
తొలి ప్రొద్దు పొడుపుకై తూరుపు దిశ నా "తిరోగమనం"....