14, జూన్ 2009, ఆదివారం

వినయం

మా స్కూల్లో ప్రతి వారం మోరల్ క్లాసు వుండేది ,దానికి ప్రత్యేకంగా ఒక టీచర్ వుండేవాళ్ళు .క్లాసు లేనప్పుడు ఆవిడ ఎక్కడ ఎదురైన వినయంగా విష్ చేసి పక్కకు తప్పుకునేవాళ్ళం ..క్లాసు జరిగిన రోజయితే ఇక చెప్పక్కరలేదు మోస్ట్ ఓబిడ్ యంట్ స్టూడెంట్స్ ల బిహేవే చేసేవాళ్ళం ...ఇంతకీ అంతలా ప్రభావం చూపేది విన్న గంటైన . అలా స్కూల్లో వినయంగా వుండటం నేర్చుకున్నా:) ఇంట్లో చిన్నప్పుడు అమ్మ బోల్డన్ని కల్పిత కథలు మా అందరికి కూర్చోబెట్టుకుని మరీ చెప్పి క్రమశిక్షణ తప్పితే ఎలాటి కష్టాలు పడతారో సోదాహరణంగా వివరించి మరీ చెప్పేది (అలాబెదరేయకపోతే పాపం తట్టుకోగలదా మా అల్లరి ) పెద్దల పట్ల ఎంత వినయంగా వుండాలో మరీ చెప్పేది ,పెద్దవాళ్ళు కనపడగానే గ్రీట్ చేయాలని ,పని చెప్పిన నోరుమూసుకు చేయాలని ,ఫలాని వాళ్ల పిల్లలు చాల మర్యాదగా ప్రవర్తిస్తారు ,అని నలుగురు చెప్పుకోవాలని కోరేది .పాపం ఆవిడ పుణ్యమాని ,నాన్న గారి భయం కానివ్వండి బయటివారి తో చిన్నైన పెద్దైన మర్యాదగా మసులుకోవడం అలవాటైంది .ఇప్పటికి నాన్న ముందు అతి వినయంగా వుంటాము .

ఈ అతి వినయం వల్ల అవతలి వారితో మాట్లాడేప్పుడు వాళ్ళేం చెబుతున్నారో అర్ధం కాదు ..అన్నిటికి అలాగే నాన్న ,అలాగే నాన్న అంటు అస్సలు ఆయనేం చెబుతున్నారో మనస్సుకి ఎక్కేది కాదు .తరువాత పక్కన వాళ్ళని అడగడం అయ్యేది ....ఇంతకీ నాన్నేం అన్నారు అని . కాలేజీ లో ఫాదర్స్ ,సిస్టర్స్ వద్ద కూడా ఇలాటి అనుభవమే కలిగేది ....తరువాత తర్వాతా వుద్యోగంలో బాస్ దగ్గర ....ఇక్కడ మరీను వాళ్ళేం చెప్పినా ....సర్ ..సర్ ...సర్ ...ఎదురు ఒక్క మాట మాట్లాడే పని వుండదు . కేవలం వాళ్ల ఆర్డర్ మాత్రమే వినాలాయే .అంతా అయ్యాక ఏం చెప్పాడా అని విశ్లేషించుకుని ఆ ప్రకారంగా చేయాలి ,అదే విధంగా వాళ్ళనుండి కాల్ వచ్చిన నెంబర్ చూడగానే సగం బ్లాంక్ ..ఆ బ్లాంక్ మైండ్ తోనే సర్ ...సర్ ..సర్ ..ఫోన్ పెట్టాక తీరికగా అవలోకనం చేసుకోవాలన్న మాట . చాల సార్లు విని మరల కొలీగ్ కి కాల్ చేసి అడిగిన సందర్భాలున్నాయి .

నా క్రింది వాళ్లు ఇదే పంధా ...కాని నా క్రింది ఆఫీసుర్స్ కి నాతో ఇంతా ప్రాబ్లం వుండదు ...కలిసిపోతాను కాబట్టి :)మా ఆఫీసు లో వున్నా అటెండర్ లలో ఒక అబ్బాయ్ అతి వినయం మనల్ని చూడగానే చేతులు కట్టుకుని ..సినిమా టైపు లో మాటకు ముందు "అమ్మగారు " అంటూ బోల్డంత కామెడి .వెంటపెట్టుకు ఎక్కడికైనా వెళ్ళిన ఫలానా చోటుకు వెళ్ళాలి అంటే "అలానే అమ్మగారు " అంటాడు ..కార్ ఎక్కాక డ్రైవర్ కి అడ్రెస్స్ చెప్పడం రాదూ ...తెల్లమొహం వేసుకు చూస్తూ నీళ్లు నములుతుంటాడు ...నేను పైకి ఏమి అనను కాని మనసులో ఎంజాయ్ చేస్తాను ...నా ఫ్రెండ్స్ ఎవరయినా ఆఫీసు కి వచ్చినా అడుగుతుంటారు ,,మీ అతివినయం ఎక్కడా అని .....మా అతి వినయం తో పని చెప్పేకంటే వేరే అటెండర్ కి చెప్పడం బెటర్ అనుకుంటాను . సరే ఈ వినయం కథ ఇలా ఉంటే ఈమద్య మూడు నెలల నుండి ఇంకో వినయం తగిలాడు ...ఇంటి దగ్గర . మా చెల్లి మూడు నెలల క్రితం ఒక డ్రైవర్ ని పెట్టుకుందీ .తను మా పైన వుంటుంది , మనకి ఉదయానే ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ టీ త్రాగడం అలవాటు . వాళ్ల డ్రైవర్ పుణ్యమాని బయట తిరగడానికి లేకపోయే ....తను ఉదయానే వచ్చి కూర్చుంటాడు ఎదురుగ వున్నా చెట్ల క్రింద ..బయట కనబడితే చాలు అతి వినయంగా నమస్కారం పెడతాడు ,,అది ఎన్ని సార్లైనా అతనికి మనం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ,అతన్ని చూసి భేదిరిపోయి ఇంట్లోకి పారి పోవాల్సి వస్తుంది . నైట్ డ్రెస్ లో తిరగే అవకాశం లేకుండా పోయింది ...చెల్లి వాళ్ల పాప ప్రవేట్ క్లాస్ కోసం ఉదయానే రప్పిస్తుంది ఆ అబ్బాయిని .,,.పైకి వెళ్ళాలంటే తూర్పు వైపే మెట్లు వుంటాయి ...ఆ అబ్బాయ్ పైకి వెళ్ళేప్పుడు మా వంటగది కిటికీ వైపు చూస్కుంటూ నేను కనబడగానే అక్కడినుండే మరల నమస్కారం పెడతాడు ....నేను ఆఫీసు కి వెళ్ళేప్పుడు అక్కడ వుంటే మా డ్రైవర్ కన్నా ముందు లేచి మరల ఓ నమస్కారం పెట్టి నేను కార్ ఎక్కి పోయే వరకు అతి వినయంగా అక్కడే నిలబడతాడు ..మా చెల్లి తో మొత్తుకుంటున్నా "మీ భాస్కరుడి అతి వినయం తట్టుకోలేక పోతున్నానే " అంటూ ...చెబితే ఫీల్ అవ్వుతాడని అదొక మొహమాటం ....అతి వినయం కొన్ని సార్లు ఎంత ఇబ్బంది పెడుతుందో అని నవ్వుకుంటూ ఊరుకోవడం తప్ప ఏమి చేయలేము చెప్పిన అర్ధం చేసుకుంటారో లేదో .........

7 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

చాలా బాగుందండి.. మొదటి సగం చాలా చక్కగా రాశారు.. రెండో సగం కొంచం హడావిడిగా రాసినట్టు ఉన్నారు.. అక్కడక్కడా అచ్చుతప్పులు.. వీలయితే సరిచేయండి.. నాక్కూడా బోల్డంతమంది 'అతివినయాలు' తగిలారు.. రాస్తాను, ఎప్పుడైనా...

మరువం ఉష చెప్పారు...

మా నీలకంఠారెడ్డిని గుర్తు చేసారు, మా ముందు నడుస్తూ ముక్కూమొహం తెలియనివాళ్ళకి కూడా "తప్పుకోండమ్మా, తప్పుకోండయా ఇంజనీరు గారి పాపలొస్తున్నారు" అని చంపుకు తినేవాడు. ఆ పాప అన్న పదాన్ని సాగదీసి ఏడిపించే కుర్రాళ్ళతో మాకు తంటాలు వందలు. అలాగే మా మస్తాను, డ్రైవరు చంద్రయ్య, సుబ్బాలు .... చాల్లేండీ చదివేవారికి చికాకొచ్చేటంతమంది. ఒకవిధంగా వాటికి అలవాటుపడే ఈ దేశాల్లో మొదట్లో మరీ అనామకులమయిపోయాం అనిపించేది.

Hima bindu చెప్పారు...

@మురళి
మీరన్నట్లు చాల అచ్చు తప్పులు వున్నాయి , నేను ఖాళీగా కూర్చుని రాసుకుంటుంటే మా అమ్మాయి చూడలేక తనతో కూర్చుని పాఠలు చదవమని ఒకటే షంటింగ్....అదుగో ....ఇప్పుడే ఇప్పుడే అంటూ హడావిడిగా పూర్తి చేసాను .తన్క్యు .
@ఉష
మీ నీలకంఠం మమ్మల్ని నవ్విచ్చారండీ .. అచ్చం మేము కూడా ఇలాటి వైభోగం అనుభవించాం నాన్న గారి హయాంలో -:)

హరే కృష్ణ చెప్పారు...

హ హ్హ..బాగా రాసారు చిన్ని గారు
అతి వినయం తో మీకు మతి తిరిగేలా చేసిన అటెండర్ కి మీరు బర్త్ డే కి చాక్లెట్ ఇవ్వలేదేమో :)

పరిమళం చెప్పారు...

ఈ రోజుల్లో కూడా అదీ సిటీలో అటువంటివారున్నారంటే గొప్ప విషయం !

Hima bindu చెప్పారు...

@హరే కృష్ణ
మీకు తెలిసిపోయిందా నేను నా పుట్టినరోజు కి చాకీ ఇవ్వలేదని -:)
@పరిమళం
సిటీ ,టౌన్ కాదండీ లెక్క ...కేవలం ఈ స్టేట్ గవర్నమెంటు కే వున్న జాడ్యం ...బాస్సిజం అట్లా వుంటాదీ,ముఖ్యంగా రెవిన్యు ,పోలీసు వ్యవస్థలో చూస్తాము . మిగిలిన శాఖల్లో వుంటుంది కాని ఈ రెండంత కాదు.

ఉమాశంకర్ చెప్పారు...

"అన్నిటికి అలాగే నాన్న ,అలాగే నాన్న అంటు అస్సలు ఆయనేం చెబుతున్నారో మనస్సుకి ఎక్కేది కాదు .తరువాత పక్కన వాళ్ళని అడగడం అయ్యేది ....ఇంతకీ నాన్నేం అన్నారు అని..

హ్హ హ్హ హ్హ , బావుంది, :)