21, జూన్ 2009, ఆదివారం

మా నాన్న

ఈ రోజు ఉదయాన్నే పేపర్ తీయగానే కనిపించింది "మారిన నాన్న పాత్ర "....ఫాదర్స్ డే సంధర్భంగా రాసిన ఆర్టికల్ లలో ....నిజంగానే నాన్న లు మారారు ...ప్రపంచం మొత్తం ఒక్క కుగ్రామం అవ్వుతున్న తరుణం లో ..మార్పు స్పష్టంగా కనబడుతుంది ,మా అమ్మ నాన్న కి , మా నాన్న కి ,మా అమ్మాయి వాళ్ల నాన్నకి ఎంత దూరమో ..తరం తరం నిరంతరం "మార్పు "...కారణాలు ఎవైనా కావచ్చు ....మానవ సంభంధాలలో ఈ మార్పు స్వాగతించ దగ్గవే .
నా వ్యక్తిత్వం పై నాన్న ముద్ర చాల వుందనే చెప్పవచ్చు .రెండేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి సంరక్షణలోనే పెరిగి ఎంతో ప్రయోజకుడై న మా నాన్న ,తన పిల్లలకు కే కాకుండా ఎంతో మంది పేద ,అనాధలకు ఆశ్రయం కల్పించి వారి వున్నతాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు .నేను బాగుండాలి నాతోటి వారు బాగుండాలి అనే సూత్రం నాయనమ్మ ఉగ్గుపాలతో పోసి నాన్న ను పెంచింది .చిన్న కుటుంబములో పెరిగిన నాన్న పెద్దయాక తన కుటుంబాన్ని పెంచుకున్నారు ,,,అందుకే మేము ఆరుగు పిల్లలం . నాన్న మాకు ఊహ తెలిసి ఎవర్ని కొట్టడం తెలిదు ..అస్సలు ఎంతో అల్లరి చేసే నేనే ఎప్పుడు దెబ్బలు తినలేదు ...కాని ఆయన వునికి చాలు ఆ పరిసరాలు నిశభ్ధం ఆవరించడానికి ..ఒక విధంగా అమ్మే మా దృష్టిలో నాన్న ను పులి ని చేసిందని చెప్పొచ్చు ..మాకు భయం వుండాలని నాన్న కి అది ఇష్టం వుండదు ,ఇది ఇష్టం వుండదు ,ఇలా చేస్తే కోపం వస్తుందీ అని చెప్పి మమ్మల్ని కంట్రోల్లో పెట్టిందని చెప్పొచ్చు.:)..
నాన్న ఇంట్లో పెద్దగా డామినేట్ చేసినట్లు కనబడినా నిజానికి అన్నింటా అమ్మ నిర్ణయానికే వదిలేసేవారు .తను చేసే ఉద్యోగాన్ని అంకిత భావంతో చేసేవారు.వృత్తి దైవంగా భావించేవారు ...నిజానికి ఆయన ఫ్యామిలీ తో గడిపే సమయం కన్నా ఉద్యోగం తో గడిపిన సమయం ఎక్కువ ,అయిన ఎక్కడ అలసట చెందకుండా ,విసుగు లేకుండా మాకే లోటు తెలీకుండా, మా అందరిని రాకుమార్తెల్లా పెంచారు ,ప్రేమానురాగాలు పంచారు . ఏడాదికి కి ఒక ఊరు తన కూడా తిప్పారు.మేము కాలేజి చదువుకి వచ్చాక పాపం తనే ఒంటరిగా తిరిగారు .
చదువు విషయం లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పుల గురించి వివరిస్తూ మాకు వాటి పట్ల ఆసక్తి కలిగేలా చేసిన ఘనత నాన్నదే .ఒక్క ఇంటినుండే ఒక్కసారే నలుగురు పిల్లలు సివిల్సేర్విసే మెయిన్ ఎగ్జామ్స్ రాసిన ఘనత మా నాన్న పిల్లలకే దక్కింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు .ఆరుగురికి మంచి మంచి చదువులు చెప్పించి తండ్రిగా తనవంతు భాద్యతను నిర్వర్తించారు .చదువొక్కటే కాదు లోకం అంటు పిల్లల అభిరుచికి తగ్గట్లు ప్రోత్సాహం ఇచ్చారు .మా ఇల్లోక చిన్న గ్రంధాలయం చేసి మాలో సాహిత్యాభిలాష పెంచారు .తన వృత్తి లో రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న మా నాన్న మాకు ఆదర్శంగా నిలిచారు .ఈరోజు మేము అందుకుంటున్న యోగ్యత పత్ర్రాలు మా నాన్న పెంచిన మొక్కలే కదా ...! ఇరవయ్యొకటో సంవత్సరం లో మా రెండో పాపను పోగొట్టుకుని పూర్తి డిప్రెషన్ లో వున్నా నన్ను ఓదార్చి ,ఇంటి ఆవరణలోని నిండు పూతతో వున్నా కొబ్బరి చెట్టుని చూపించి ,వాటికి వచ్చిన పూతంతా నిలవదుగా ,కొన్ని మాత్రమేగా పిందెలుగా మారి కాయలవ్వేది ....అని మరణం గురించి మాట్లాడి నాలో తాత్విక దృష్టి పెంచి ధ్యానం సాధనగా చేసుకుని తిరిగి భాహ్య ప్రపంచం లోకి రావడానికి చేయూతనిచ్చారు. నాన్న ఈ నాటికి వుద్యోగ విరమణ చేసి పదవ సంవత్సరం ,అరవయ్యి ఎనిమిది నిండి అరవయ్యితోమ్మిది జరుగుతున్న మా నాన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ,,,భావి తరానికి స్పూర్తిగా వుండాలని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.

12 వ్యాఖ్యలు:

జ్యోతి చెప్పారు...

మీ నాన్నగారికి అభినందనలు. అందరు అమ్మలు, నాన్నలు ఇంతేనేమో ...

ఉష చెప్పారు...

చిన్ని, మీ కుటుంబంలోని తండ్రులందరికీ "ఫాదర్స్ డే" శుభాకాంక్షలు... ఇక నాన్నగార్ని తలచుకుని నా మనసు పలికిన గీతమిది.. "ఆ నాన్న కూతురు!!!" http://maruvam.blogspot.com/2009/06/blog-post_21.html మా నాన్నగారి జీవితానికి మీ నాన్నగారికి దగ్గర పోలికలున్నాయి. నేను నా కవితకి ఒక వ్యాఖ్యగా వ్రాస్తున్నాను తనని గురించి. వీలైతే చదవండి.

నా చిన్నారి పొన్నారి నా చిట్టి అమ్మలు! కవితపై మీ చివరి వ్యాఖ్యకి కాస్త సందేహం కలిగినా తిరిగి మనసుని కదపటం ఎందుకని అడగలేదు. ఇది మీకు ఎంత సాంత్వననిస్తుందో తెలియదు. నేను బాబు తర్వాత మూడు గర్భస్రావాలకి గురయ్యాను. నిజమే అవి రాలిపోయిన పిందెలేమో. నాకు ప్రాప్తం లేని సంతానమేమో. దాదాపు మూడు సంవత్సరాలు వాక్సిన్స్ వేయించుకుని నా చెల్లే నాకు తిరిగి పుట్టాలి అన్న భావనతో స్నేహని ఈ లోకంలోకి తెచ్చుకున్నాను. 'చిన్న గీత పెద్ద గీత' మాదిరిగా మీ బాధకి ఇది కాస్త ఉపశమనం ఇస్తుంది అని వ్రాసాను.

చిన్ని చెప్పారు...

@జ్యోతి
ధన్యవాదములండీ ...మీ ఇంట్లోవారికి కూడా అభినందనలు .
@ఉష
తప్పకుండా చేబుతానండి...మా తాత గారికి కూడా (అమ్మ వాళ్ళ నాన్న ) అందచేస్తాను మీ అభినందనలు . మీ కవిత చదువుతూ నన్ను కాంట్రోలె చేసుకోలేకపోయాను .భగవంతుడు మనుష్యులకు ఇచ్చిన వరం "మరపు" అంటాను ....కొన్ని వద్దనుకున్న వెంటాడుతోనే వుంటాయి ...ఆ పాప కి వాడిన వస్తువులు నా భీరువాలో ఒక అరలో వుంటాయి ,ఆ గ్లాస్కో జుబ్బాలు ,జోహ్న్సొంస్ పౌడర్,సోప్ ఇప్పటికి కొత్తగా.......మల్లెపూవుల్లా .......ఎన్నో ఏళ్ళు గడిచాయి ...ప్చ్ .

పరిమళం చెప్పారు...

చిన్ని గారు ! కొబ్బరిపూతను జీవితానికి అన్వయించి నాన్నగారు మిమ్మల్ని ఓదార్చడం చదువుతుంటే ఆయన వ్యక్తిత్వం తెలుస్తోంది . ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకొంటూ పితృ దినోత్సవ శుభాకాంక్షలు .

చిన్ని చెప్పారు...

@పరిమళం
ధన్యవాదములండీ .

అజ్ఞాత చెప్పారు...

మీ నాన్నగారు మీ గురించి చేసిన పనులన్నీ జ్ఞాపకం పెట్టుకొని వాటిని గుర్తుచేసికోవడం కూడా గొప్ప విషయం.

చిన్ని చెప్పారు...

@హరేఫల
ధన్యవాదాలండి ....కాని తల్లి దండ్రుల ఋణం తీర్చుకోలేనిదండీ... ఈ సందర్భంగా నాకో పద్యం గుర్తొస్తోంది ...."తల్లిదండ్రుల మీద దయ లేని పుత్రుడు "....

Sirisha చెప్పారు...

nijam ga valla runam tirchukolendhi...manam chese tappulaki devudi daggara anna kshmarpana untundo ledho kani...talli tandri matram enthati tappu naina kshimchestaru...

మురళి చెప్పారు...

చాలా చాలా బాగుందండి...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కుటుంబంలో నాన్న ప్రవర్తన పిల్లల వ్యక్తిత్వాలపై చాలా ప్రభావం చూపుతుంది. తండ్రిదగ్గర స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్న పిల్లలకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పాళ్ళు కూడా ఎక్కువే ఉంటాయి. మీ నాన్న గారు ఆ కోవలో తండ్రిలానే ఉన్నారు. భయం కాకుండా ప్రేమను పంచుతున్న ప్రతీ తండ్రికీ జయహో....

చిన్ని చెప్పారు...

@శిరిష
@మురళి
@శేఖర్ పెద్దగోపు
మీ అందరికి ధన్యవాదములండీ.

తృష్ణ చెప్పారు...

చాలా బాగా రాసారు.మీ తపాలన్ని చదవాలి వీలుచుసుకుని.