15, జూన్ 2009, సోమవారం

హాస్యం

నాకు చాల ఇష్టమైన వాటిల్లో హాస్యం ఒకటి .చిన్నప్పటినుండి జోక్స్ చెప్పమని మా అమ్మ తమ్ముళ్ళు ,చెల్లెళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళం .మా చిన్న మామయ్యా అయితే యాక్షన్ తో సహా మరీ చెప్పేవాడు .వాడు వేసే కోతి వేషాలకి పగలబడి నవ్వే వాళ్ళం .,ఎక్కువగా సెలవల్లో ఊరు వెళ్లి నప్పుడు రాత్రి బోజనాలు అయ్యాక అందరం ఇంటి ప్రక్క అరుగుల మీద కూర్చుని అర్ధరాత్రి వరకు పిల్ల పెద్దా కాలక్షేపం చేసేవాళ్ళం . నవ్వి నవ్వి పోరపోఎది , అంతలా నవ్వకు ,నవ్వినంత ఏడుస్తావు అనేవాళ్ళు అమ్మమ్మ వాళ్లు ...నిజంగానే నవ్వినంత ఎడుస్తామేమోనని భయం వేసేది .కథలు పుస్తకాలు చదివే వయస్సు వచ్చాక హాస్యం ఎక్కువగా వున్నా వాటికి ప్రేఫెరేన్స్ ఇచ్చేధాని ...తరువతరువత అన్ని చదివేయడం మొదలు పెట్టాను .చిన్నప్పుడు బుడుగు పుస్తకం బోల్డన్ని సార్లు చదువుకున్న ,..మల్లిక్ ,యర్రంశెట్టి వి హాస్యకథలు చాల వుండేవి ,ఒక్కటి వదలకుండా చదివేదాన్ని .బాపు ,బాలి కార్టూన్స్ ..బొమ్మలు చెప్పే హాస్యం పడిపడి చూసేదాన్ని ,ఇప్పటికీ చూస్తున్న ,అలానే సరసి కార్టూన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి ..

ఇకపోతే సినిమాలకు వెళ్ళాలి అంటే సినిమా మొత్తం నవ్విచ్చేధిగా వుంటే తప్పకుండా చూసేదాన్ని ...చాలామంది హాస్యనటులు తమ హావభావలతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు. నాకు శ్రీలక్ష్మి అంటే చాల నచ్చుతుంది ..ఆ అమాయక ముఖం తోనే హాస్యం కురిపించేది .అలానే బ్రహ్మానందం ముఖం చూడగానే నవ్వోచ్చేట్లు వుంటుంది .అది ఇదీ అనేది లేకుండా హాస్యరసం తో వుందంటే చూడకుండా వుండేదాన్ని కాదు . అంత ఇష్టం అన్నమాట .

ఈ మద్య సాహిత్యం లోను ,సినిమాల్లోనూ హాస్యరసం దిగజారుతుంది .,స్వాతి లాంటి పత్రికల్లో హాస్యం కథ అని ప్రచురిస్తారు ,పరమ చెత్తగా వుంటాయి ,ఒకే మూస పోసినట్లు , సగంలోనే చదవకుండా మూసేసయ్యలని అన్పిస్తుంది .అలానే సినిమాలు తయారయ్యాయి ...హాస్యం దిగజారుతుంది ..సభ్యత మరిచి ,వాడరాని పద ప్రయోగాలతో వెకిలితనం అడుగడుగునా ప్రదర్శిస్తూ అదే హాస్యం గా చూపిస్తున్నారు ..అది అపహాస్యం అవుతుంది .

ఇకపోతే బ్లాగ్ విషయానికి వస్తే మొదట్లో చాల సంతోషపడ్డాను ..ఎన్నో చదవచ్చు అని ....ఈ నాలుగు నెలల్లో అర్ధమయ్యింది ఏమిటంటే ఇన్ని వందల బ్లాగ్స్ లో మంచిగా వుండేవి నలభయ్యి ...యాభయ్యి కి మించి వుండవని .మొదట్లో కొన్నిబ్లాగ్స్ హాస్యంగా రాస్తున్నారనుకుని చదివాను ...రాను రాను వారు వాడే పద ప్రయోగం చూస్తుంటే తిన్నాది వోమిట్ అవుతుంది...వారు అలా రాసి ఏమి పైశాచికానందం పొందుతారో అర్ధం కాదు ..ఇలాటి వారిని parverted అని అనుకుని జాలిపడి అటువైపు చదవకుండా వుంటే సరిపోతుందని అని అనుకుంటున్నాను .వారు స్వంతగా ఏమి రాయలేక పిచ్చి రాతలు రాస్తూ దానికో polishedga పేరు తగిలించుకుని ఆనందపడుతున్నారు...

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మేము మీకు హాస్యం గురుంచి చెప్పేటంత వాళ్ళం కాదు..ఎవరి బ్లాగ్ వాళ్ళది మనం వాళ్ళని critisiize చెయ్యవచ్చు ఇది బాగా లేదు అని చెప్తాం మార్చుకుంటే సంతోషం లేకపోతే లైట్..

మురళి చెప్పారు...

సున్నితమైన హాస్యాన్ని సృజించలేని భావ దారిద్ర్యం పుణ్యమా అని చౌకబారు హాస్యం పుంఖాలు పుంఖాలుగా వచ్చి పడుతోంది..అన్ని మాధ్యమాలలోనూ.. మనకు నచ్చని దానిని తిరస్కరించే హక్కు మనకెప్పుడూ ఉంటుంది.. 'అలా ఎందుకు రాస్తున్నారు/తీస్తున్నారు?' అంటే అది వాళ్ళ సంస్కారానికి సంబంధిన విషయం....

అజ్ఞాత చెప్పారు...

andukena meeru anta lively ga jokes cut chestaru....bagunnara madam

మరువం ఉష చెప్పారు...

మన అంచనాలకి అందని వాటిని వదిలేద్దాం. మన అనుభవల్లోచే మనదైన హాస్యాన్ని రాబట్టుకుందాం. అన్నిటా అనివార్యమైన మార్పు అందులోనూ వచ్చింది. కనుక ప్రశించటం కన్నా, మధన పడటం కన్నా సరదాలు, నవ్వులు పంచే రచనలే మనం వెదుక్కుందాం. ఏమంటారు, చిన్ని?

Hima bindu చెప్పారు...

@మురళి
@ఉష
మీరన్నదానితో ఏకీభవిస్తాను .ధన్యవాదములు.
@సిరిచంధన ......నన్నెప్పుడు చూసావయ్..ఎవరయినా నవ్విస్తే నవ్వుతాము.
@అజ్ఞాత ....ధన్యవాదములు

anand gottumukkula చెప్పారు...

hello. I hope you r fine. According to me, at any cost the things happened in childhood stage, never comes back again. I enjoyed a lot in my school days.



D.O.B 3/3/1989

anand_gottumukkula@yahoo.com

anand gottumukkula చెప్పారు...

I too will agree with u. In the past the jokes r by the clean words and by clean scenes. But now-a-days the jokes became quite vulgar.

now the jokes are of two types
1 :cheating the other person
2: critisising a person.

Hima bindu చెప్పారు...

@ANAND
thanq Anand.