3, ఆగస్టు 2009, సోమవారం

"యెగతాళి "

నాకు ఇప్పటికి అర్ధం కాని విషయం ఒకటుంది .మనిషి పుట్టుక తన చేతుల్లో లేదని ,తను ఒక మతంలోనో ,కులంలోనో ,ఒక వర్గంలోనో (అది ధనిక,పేదాకావొచ్చు)ప్రదేశంలోనో లేదా ఆడ,మగ గానో ,రంగుఆకృతి లోనో
పుట్టడానికి తన ప్రమేయం ఎంత మాత్రం లేనిదని తెలిసినా ,ఇది సత్యమని జగద్వితమైన ,కొందరు అవివేకులు మూర్ఖంగా యెగతాళి చేస్తూ పైశాచీకానందం పొందుతరెందుకో? జన్యుపరంగా మనకు సంక్రమించిన వాటిగురించి మాట్లాడి యెగతాళి చేయడం వివేకవంతుల లక్షణమైతే కాదు .మానవుని బలహీనతే అది ,ఎదుటి వ్యక్తిలోని మంచి లక్షణాలను వదిలేసి ఏదైతే తక్కువ కనిపిస్తుందో దాని మీదనే మాట్లాడటం !
నిన్న మా దగ్గర భందువుల ఇంట్లో పెళ్లి జరిగితే వెళ్ళడం జరిగిందీ.అమ్మాయి ,అబ్బాయి ఇద్దరు మాకు దగ్గర వాళ్ళే కావటంతో పైగా మేమంతా దగ్గరదగ్గర నివాసం వుండటం తో వచ్చేపోయే బంధువులతో మా ఇంట్లో కూడా కొంత హడావిడి చోటుచేసుకుంది.ఇలా బందుమిత్రులంత ఎప్పటికో కలవడం సరదాగానే వుంది .చాలాకాలం క్రిందట చుసిన బంధువులను కలవడం జరిగిందీ .మా బంధువుల్లో మా వారికి చెల్లె వరుస అయ్యే అమ్మాయి నిన్న చాల విసిగించింది.ఇటువంటి వారిని చుస్తే ఎందుకు కలిసాంర బాబు ,ఇక్కడినుండి మనమో వాళ్ళో మాయం అయితే బాగుండుననిపిస్తుంది.కొందరికి వయస్సు పెరుగుతుంది కాని జ్ఞానం,సంస్కారం మాత్రం క్రింది స్థాయిలోనే ఉంటాయి .అదే కోవకి చెందినది ఈ అమ్మాయి.ఆ అమ్మాయి పలకరింపులు కూడా చాల వ్యంగ్యంగా ను వేళకోళంగా వుంటాయి. ఆమె వచ్చిరాగానే నన్ను చూస్తూ "ఏంటి అప్పటి నుండి అలానే వున్నావు ,ఏమాత్రం గుప్పెడంత పెరిగినట్లేవు?"అన్నది .మొదట నాకు అర్ధం కాలేదు ,పెరగడం ఏమిటి అదీ ఈ వయస్సులో అని ఆలోచిస్తుండగా తట్టింది ఆమె చాల నిగుడమైన అర్ధం తో పలకరించిందని ,తనదైన తరహలోనని .నా ముఖం పై రాని నవ్వు పులుముకుని 'దేని గురించడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు 'అన్నాను ."అదే నీ ఎత్తు గురించి అప్పటికి ఇప్పటికి ఏ మార్పు రాలేదు "వంకరగా నవ్వుతు అన్నది.'ఓహో నా ఎత్తు గురించా ఇంకా ఏమి పెరుగుతాం పెరిగే వయస్సు దాటి చాల కాలం అయ్యిందిగా అడ్డంగా పెరగమంటే పెరుగుతాం కాని నిలువుగా కష్టం కదా 'అన్నాను ఒకింత తీవ్రమైన స్వరంతోనే .ఆమె కొంచెం తత్తరపడిన తగ్గకుండా "నీవు ఎన్నైనా చెప్పు మా అన్నాముందు దిగదుడుపే "అన్నది .
నాకైతే ఆమె ప్రవర్తన అర్ధం కాలేదు ,ఎన్నో ఏళ్ళ తరువాత కలిసాము ,పైగా నేను వెళ్లేదే తక్కువ తీరిక వుండక.ఈమె నా పెళ్ళయిన క్రొత్తలో అత్తగారింట్లో మా ముగ్గురు ఆడపడుచులతో పాటు నన్ను టీజ్ చేయడం ఇప్పటికి నేను మరిచిపోలేదు.వాళ్ల అన్నయ్య ప్రక్కన నేనేమాత్రం చూడటానికి బాగోలేదని దానికి కారణం ఆయన చాల పొడవు వున్నారని నేనేమో తక్కువగా వున్నానని .అప్పుడు నాది మరీ చిన్నతనం ,పైగా అదంతా కొత్త వాతావరణం వలన మాటకీ మాట అనలన్పించినా బిడియం తో భేలగా వాళ్ళేమి అంటున్న మౌనంని ఆశ్రయించేదాన్ని .పోనీ నన్ను యెగతాళి చేసిన వారేమైనా సూపర్ గ్రోమోరే ఎరువు తో ఏపుగా ఎత్తుగా వున్నారా అంటే ..ఉహు ...నా అంతే ఇంచుమించుగ.:) మా పెద్దఆడపడుచు మాత్రం "నీవు మా అన్నా ప్రక్కన నడవాలంటే హై హీల్స్ వేసుకుని నడవాల్సిందే "అని కండీషన్ . నేను ఆగలేక ఒకరోజు అనేసాను 'మీ అన్నా ఏమైనా అమితబచ్చాన అంత ఎత్త లేదా నేనేమైనాజయబాధురి ల ప్రక్కన వున్ననా ,మరీ అంత తేడ అనిపించినా పట్టుబట్టి ఎందుకు చేసుకున్నారని 'నవ్వుతూనే అన్నాను.

వాస్తవానికి అక్క ,నేను మాత్రమె మిగిలినవారికన్నా హైట్ తక్కువ ,అది మేమెప్పుడు లోపంగా బావించలేదు .ఏదో నాయనమ్మో తాతలవో జీన్స్ అనుకునేవాళ్ళం .మొదటిసారిగా పెళ్ళయ్యాకే ఎదుర్కున్నాను.అప్పటి సంఘటనా నా మనస్సులో గాడంగా ముద్రపడిపోయింది. మా పాప వాళ్ల అత్తల్ని ఇప్పుడు టీజ్ చేస్తుంటది కావాలనే ...వాళ్ల పిల్లల హైట్ గురించి ప్రస్తావించి , ఎందుకంటే ఎవరు పాపంత వుండరు ,అలా మాట్లాడకూడదు అని చెప్పిన ,'లేదు మమ్మీ ఆ ఫీల్ వాళ్ళకి తెలియాలి 'అంటు నవ్వుతుంటుంది .

ఇంతాజేసి కట్టుకున్న వాడు ఎప్పుడు ఒక్కసారి కూడా పోల్చుకోలేదు ,తగినదానివి కాదు అనలేదు .:) ఇంట్లో వాళ్లకు లేని బాద ఊళ్ళో వాళ్లకు ఎందుకో అర్ధం కాదు .ఒక్కటి మాత్రం తెలుసుకున్నాను 'వివేకంతో మాట్లాడేవారు ఒక్క మాటన్న ఎంతో ఆలోచించాలని ,అవివేకులు వంద మాటలు మాట్లాడిన వాటికేమాత్రం విలువనివ్వకుండా వదిలేసేయాలని '.'

11 కామెంట్‌లు:

సృజన చెప్పారు...

బాగా చెప్పారండి!!

భావన చెప్పారు...

కొంతమంది మనుష్యులు అంతే. అసలు సమధానం ఇవ్వటం కూడా అనవసరం, మాట దండుగ, నోరు నొప్పి, నిర్లక్ష్యం గా ఒక చూపు చాలు. నేను నా తరం వాళ్ళలో చాలానే పొడుగు, దాని వలన నా మొత్తం జీవితం లో నాకు వచ్చిన కించిత్తు వుపయోగం కూడా లేదు, నష్టాలైతే చాలానే , ఎక్కడ నుంచుని కొంచం చిన్న కామెంట్ చేసినా బయట పడిపోతాము, గుంపు లో కనపడుతు వుంటాము కదా.. (ఎన్ని సార్లు పనిష్మెంట్ వచ్చిందో నాకైతే) చాలా చీరలు మంచి కాటన్ చీరలు షిఫాన్ చీరలు అందరు కట్టుకుంటుంటే ఏదుపు మొహం పెట్టి చూడాలి (మరి పొడుగు చాలవు గా) అటువంటి టైం లో నా స్నేహితులమీద తెగ జలసి వేసేది... ఎవడి బాధ లు వాడికుంటాయి మాస్టారు,... పైగా అన్నిటికి తిడతారు తాడి చెట్టల్లే పెరిగేవు జ్ఞానం లేదు అని.. :-(

సుభద్ర చెప్పారు...

బాగా రాసారు.
కొ౦త మ౦ది మనస్సులు చాలా ఇరుకు.
అది వాళ్ళకు తెలియదు.వాళ్ళను వదిలేస్తే మరి రెచ్చిపొతారు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

హిమవన్నగము బ్రద్దలైన అగ్నికారణమవ్వడానికి కారణం సహేతుకం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నాకు తెలిసి అలాంటివారి కామెంట్స్ విని ఊరుకోకూడదు. నాలుగు చివాట్లు పెట్టె మాటలతో వాళ్ళను దిగజార్చాలి. అప్పటికి బుద్ది తెచ్చుకున్న వారెవరైనా అన్ని మూసుకుని ఉంటారు. రేపు ఎప్పుడైనా మనకు ఎదురుపడినా పాత డోసు గుర్తుకు వచ్చి మనతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వారు ఏమన్నా అంటే ఊరుకుంటే మనల్ని చేతగాని వాళ్ళగా అనుకుని మరింత దిగువ స్థాయికి దిగుతారు.

మీ కామెంట్ బాక్స్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందండి. ఓసారి దాని సంగతి చూడండి.

మురళి చెప్పారు...

'వివేకంతో మాట్లాడేవారు ఒక్క మాటన్న ఎంతో ఆలోచించాలని ,అవివేకులు వంద మాటలు మాట్లాడిన వాటికేమాత్రం విలువనివ్వకుండా వదిలేసేయాలని ' well said..

ఉమాశంకర్ చెప్పారు...

మీరన్న ఆ ఆఖరి వాక్యం అక్షర సత్యం. ప్రస్తుతానికి నేనూ దాన్నే సదా స్మరిస్తున్నా (నా ఆఫీసువిషయాల్లో గత నాలుగు రోజులుగా... :) )

Hima bindu చెప్పారు...

@సృజన
ధన్యవాదాలండి
@బావన
మీ కామెంట్ చదివి తెగ నవ్వుకున్నాను..గుంపులో నుంచి చిన్న కామెంట్ చేసినా దొరికిపోతామనేది .బాగుందండి .నిజమేనండి కొన్ని సార్లు మన చూపులే సమాధానాలు .ధన్యవాదాలు.
@సుభద్ర
ధన్యవాదాలు ,కచ్చితంగా అటువంటివారు జీవితం లో ఎక్కడో ఎప్పుడో దేబ్బతింటారు."every dog has its ownday" i blve:)

Hima bindu చెప్పారు...

@బాస్కర రామిరెడ్డి
-:)దన్యవాదములు
@శేఖర్ పెద్దగోపు
అంతా అయ్యాక ఇలా అని వుండాల్సింది అని అనుకుంటాను ,మరీ ముఖం మీద అనలేను అదే నా బలహీనత . .కామెంట్ బాక్స్ మార్చడానికి ట్రై చేస్తానండి.దన్యవదాలండి.

Hima bindu చెప్పారు...

@మురళి
ధన్యవాదాలండి
@ఉమా
good:)

పరిమళం చెప్పారు...

ప్చ్ ....కొందరంతే .......