12, ఆగస్టు 2009, బుధవారం

"గంట గడిస్తే చాలు"

అవి నేను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. మేము నివసిస్తున్న ఊరికి అరవయ్యి మైళ్ళ దూరం లోని ప్రక్క జిల్లా లో నా మొదటి పోస్టింగు ..మావారిది సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం కావడం వలన ,పాప చదువు వలన నేనే మూడు సంవస్తరాలు రోజు నేనున్నా ఊరి నుండి గంట ప్రయాణం చేసి వెళ్లి సాయంత్రం మరల ఇల్లు చేరేదాన్ని.పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన ఆ ఊరిలో ఎవరు వుండటానికి ఇష్టపడక మేమున్న సిటీ నుండే వందల్లో షటిల్ చేసేవాళ్ళు .రైల్లో గంట లేక నలభయ్యి నిమిషాలు పట్టేది మాకు ఉదయం,సాయంత్రం అనుకూలంగా సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ లుండేవి వందల్లో వున్నా మా తోటి ఉద్యోగస్తులతో ప్రయాణం అస్సలు తెలిసేది కాదు .ఎప్పుడైనా అత్యవసరం అయినపుడు ఏదొక ట్రైన్ లో వెళ్ళిపోయేవాళ్ళం .

ఒకరోజు అత్యవసరంగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి ట్రైన్స్ కోసం వాకబు చేస్తేస్వర్ణజయంతి ఎక్ష్ప్రెస్స్ వుందని విజయవాడ వెళ్ళేవరకు ఎక్కడ ఆగదని కాకపొతే ట్రైన్ ఖాళీగా వస్తుంది కాబట్టి రిజర్వ్షన్ భోగి ఎక్కడం అంత సేఫ్ కాదు జెనరల్ఎక్కమని నాకూడా వచ్చిన సబ్ స్టాఫ్ చెప్పారు .వారు చెప్పినట్లే ట్రైన్ కి చివరిలో వున్నా భోగీ లలో ఆడవాళ్ళు కిటకిట లాడుతుంటే గబాల్న నేను ఎక్కడం ట్రైన్ కదలడం జరిగిందీ.అన్ని సీట్లు కలర్ఫుల్ గా వున్నాయి ఒక చోట ఇద్దరు ప్రక్కకి జరిగి నాకు మద్యలో సీట్ ఇచ్చారు నేను నా అలవాటు ప్రకారం నా హ్యాండ్ బాగ్ లోనుండి చదువుకోవడానికి పుస్తకం తీసుకుంటువుండగా ప్రక్కనుండి మగవాళ్ళ గొంతు వినబడింది ,ఎవరున్నారా అని నేను తలెత్తి చూడగా దరిదాపుల్లో ఎవరు లేరు ...కాని చూస్తున్న నేను ఒక్కసారే ఉలిక్కిపడ్డాను ...నా గుండె జారిపోయిందినా కాళ్ళ లో వణుకు ,నా గుండె చప్పుడు అతి స్పష్టంగా ఏడ్పు ఒక్కటే తక్కువ నా కళ్ళు పుస్తకంలో అతుక్కున్న మెదడంతా మొద్దుభారిపోయి ముడుచుకుపోయి కూర్చున్నాను వాళ్ళ లో వాళ్ళు ఒరియానో ,హిందినో గోలగోలగా మాట్లాడుకుంటున్నారు .మొత్తం కంపార్ట్మెంట్ అంతా 'హిజ్రా'లే వాళ్ళంతా దూరం నుండి ఎక్కడికో వెళ్తున్నారు.నిజానికి వాళ్ళు కనీసం నన్ను పలకరించలేదు,జరిగి మరీ ప్లేస్ ఇచ్చారు.కాని నాకు వారంటే చిన్నప్పటినుండి విపరీతమైన 'భయం'అదీ ఇప్పటికి పోలేదు
వాళ్ళు తరుచు రత్నాచల్,పినాకిని లలో చప్పట్లు కొడుతూ అక్కా,బావ అంటూ మీదమీదకివచ్చి డబ్బులు అడుగుతూ అదే అబ్బాయిలనైతే ఇక చెప్పనవసరంలేనంతగా విపరీతంగా ప్రవర్తిస్తారు.వాళ్ళ చప్పట్లు వినగానే ముడుచుకుపోతాను ,వారి వైపు చూడటానికి ఇష్టపడను,వాళ్ళు నా దగ్గరనుండి కదిలేవరకు టెన్షన్ అనుభవిస్తూనే వుంటాను .నాతోటి సిజనర్స్ నన్ను ఎప్పుడు భయపెట్టేవాళ్ళు ...వాళ్ళు వస్తున్నారు,ఇదిగో అదిగో అంటూ.అటువంటి భయం కలిగిన నేను గంటసేపు వాళ్ళ మద్య గడపడం,ఎప్పుడెప్పుడు నా గమ్యం చేరతానా అని భిక్కు భిక్కుమని ఎదురుచూస్తూ ,ఆఖరికి స్టేషన్ వచ్చాక దిగడానికి ఓపిక లేనంతగా నీరసపడిపోయాను.కార్ లో కూలబడి మావారిని చూసి భోరుమని ఏడ్చేసాను,అప్పటివరకు అతి కష్టం మీద ఆపుకుని :)విషయం తెలుసుకుని ఇంత చిన్నవాటికే బెదిరిపోయే నీవు ఇంకా ఉద్యోగం చేయగలవా అని హాస్యమాడారు .ఆ అనుభవం నన్ను చాల కాలం పీడకల లా వెంటాడింది.వాళ్ళంటే నాకు జాలే,కాని వారి ప్రవర్తన నచ్చదు .భగవంతుడికి ఎందుకింత పక్షపాతమో .....ఎందుకిలా సృస్టిస్తాడో.....లోతుగా ఆలోచిస్తే చాల భాధగా అన్పిస్తుంది ....ఇంత ఆలోచించిన వాళ్ళంటే ఇప్పటికి 'భయమే'
('నాకు హిజ్రాలంటే ఒళ్ళు మంట ' టపా కూడలి లో చదివాక రాయలన్పించింది )

16 వ్యాఖ్యలు:

రవిగారు చెప్పారు...

kompatisy ademanna hizdala kosame mamata benarjy reserve chesina coachemo?vallako mp kuda vunnadu(?), r vundi(?) r may be mla anukunta gurtu ledu.valla ni tidite kuda atrocities act amalu parachalani korutunnarata. jagarta.

చిన్ని చెప్పారు...

@రవిగారు
నేను రాసింది ఇప్పటి కథకాదు,ఎప్పటిదో,వాళ్ళను తిట్టలేదే !

...Padmarpita... చెప్పారు...

అమ్మో!! మీ స్థానంలో నేనున్నా అలాగే భయపడేదాన్ని...మీకన్నా ఎక్కువేనేమో!!

srujana చెప్పారు...

చిన్ని గారూ..నాకూ భయమేనండి.

భావన చెప్పారు...

భయం కంటే బెదురు గా బెరుకు గా వుంటుందేమో కదు.. అవును పాపం ఒక్కోసారి వాళ్ళను అలా చిత్రీకరించి మనను అంతర్గతం గా భయం పెట్టినందుకు సినిమా వాళ్ళ మీద కోపం గా అనిపిస్తుంది...

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

అమ్మో, నేనైతేనా చైన్ లాగి మరీ దిగిపోయుండేవాడినేమో...వాళ్ళంటే జాలే కానీ ఇచ్చినంత పుచ్చుకోక డిమాండ్ చేసి విసిగించటం పరమ చిరాకు.

Suresh Kumar Digumarthi చెప్పారు...

జాలి పడకండి. Just accept their difference. Then you will enjoy their presence also. సమాజం సరైన స్థానం, గుర్తింపు లేకపోవడం వలన మాత్రమే మీరు భయపడిన సంగతులు. Some where some thing happened become some one thought of it some time back. Let us start thinking.

మురళి చెప్పారు...

కళ్ళకి కట్టారండి.. నాకు వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు సమాజం మీద వాళ్లకి ఒకరకమైన కసి ఉందేమో అనిపిస్తూ ఉంటుంది..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగా రాశారు మీ అనుభవాన్ని. చివరిలో జాలేసింది మీ మీద.
తప్పకుండా వాళ్ళకు సమాజం మీద కసి ఉంటుందనేది నా అభిప్రాయం కూడా. వాళ్ళ ప్రవర్తన చిరాకుగా ఉంటుందనేది చాలా మంది కంప్లెయింట్. అయితే ఒక హిజ్రా మర్యాదగా పని చేసుకుంటానంటే ఒక చిన్న కారు షెడ్ ఓనర్ అయినా అతనికి పని కల్పిస్తాడా? మరి వాళ్ళు అడుక్కోక, డిమాండ్ చెయ్యక ఏం చేస్తారు బతకటం కోసం. వాళ్ళందరిని మన మధ్య నుండి వెలివేసినందుకు( అది వారితప్పేమీ లేకుండా) వారికి సమాజం మీద నిర్లక్ష్యభావం ఉండటం తప్పంటారా? ఇలా ఓ పెద్ద డిబేట్ చెయ్యొచ్చు ఈ విషయం మీద.

నేస్తం చెప్పారు...

నిజమే సమాజం మీద కోపం తోనో లేక అలా చేస్తే డబ్బులివ్వరు అనో చాలా అతిగా ప్రవర్తిస్తారు ఒక్కోసారి, ఆడవారిలా వస్త్ర దారణ చేసినందువల్ల ఏమీ అనిపించదు కాని అతిగా ఎక్కడ ప్రవర్తిస్తారో అని భయం తోనే వారికి దూరంగా ఉంటామేమో ..మీరు కనీసం ఆపాటి దైర్యం గానయినా ఉన్నారు.. నేను అయితే వారు నిజమైన హిజ్రాలేనా..కాదా అనే కోణం లో కూడా ఆలోచించి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని :)

సుభద్ర చెప్పారు...

good post.
naaku kopam kaadu kani,chaalaa bhayame anipistundi.pratisaari nannu nenu tittukuntaaa!malli maamule vallani chuste bhayame...
nannu vallu yepudu ebbandi petta ledu.

చిన్ని చెప్పారు...

@పద్మర్పిత
@సృజన
@భావన
నాకు తెలిసి ఆడవాళ్ళందరికి భయమే,వాళ్ళెంత ఆడవాళ్ళ లావుండాలని తమ వస్త్రాల్లోను,హావభావాల్లో ప్రదర్శించిన నాకు మగవాళ్ళ లానే అన్పిస్తారు.అందుకే భయము ,బెరుకేమో...ధన్యవాదాలు .

మధురవాణి చెప్పారు...

అవునండీ.. నాది కూడా ఇదే మాట. వాళ్ళంటే కోపం, ద్వేషం లాంటివేమీ లేవు గానీ, చాలా భయమేస్తుంది వాళ్ళని చూస్తే. ముందు వణుకొచ్చేస్తుంది. మీరు చెప్పింది వింటేనే తెలుస్తోంది అప్పుడు మీరెంత భయపడి ఉంటారో.!

చిన్ని చెప్పారు...

@బాస్కర రామిరెడ్డి
ఆహా! మీరైతే చెయిన్ లాగేసేవాళ్ళ ....వాళ్ళు మీకంత ఛాన్స్ ఇస్తారా? అదే మాలాంటి వాళ్ళైతే పోనిలెమ్మని ఊరుకుంటారు .:):)
@సురేష్ కుమార్ దిగుమర్తి
అదేంటండీ జాలి పడవద్డా...మనిషి ఒంటరిగా బ్రతకడం కన్నా శిక్ష మరొకటి వుండదేమో...కొంత కాలమే అమ్మానాన్న ,తోబుట్టువులు తరువాత ఎవరి జీవితం వారిదే ,తమకుంటూ కుటుంబం ,స్నేహితులు లేకపోవడం చాల లోటండీ...అందుకే అడుగుతున్నా భగవంతునికి ఎందుకు పక్షపాతం అని.
@మురళి
నిజమేనండీ ...మానసికంగా వారి ప్రవర్తన అలానే వుంటుంది

చిన్ని చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు
ఇప్పుడేదో సరదాగా రాసేసాను కాని ఆ గంట,ఆ తరువాత కూడా మానసికంగా చాల వీక్ అయ్యాను.మీరన్నట్లు వీరికోసం ప్రత్యేకంగా ఉపాధి కల్పించి వారికి జీవనాధారం కలిపిస్తే బాగుంటుంది,స్వచ్చన్ధసంస్థలు,ప్రభుత్వం పూనుకోవాలిసిందే,అప్పుడే మార్పు సాద్యం.
@నేస్తం
"నేనైతే వారు నిజమైన హిజ్రలేనా ...కాదా అనే కోణం లో ఆలోచించి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని :)" నవ్వి నవ్వి అలుపొచ్చిందండీ...అప్పుడు వాళ్ళు బెదిరిపోయేవాల్లేమో :)
@సుభద్ర
తెలియకుండానే ఆడవారిలోనే వారంటే ఫోభియా వున్నట్లుంది..ధన్యవాదాలు
@మధురవాణి
చాలా చాలా వణికిపోయానండీ ,గమ్యం చేరేవరకు ఆ గంట ఎలా గడిపానో దేవుడికే తెలుసు .

పరిమళం చెప్పారు...

చిన్ని గారు , నాకూ వాళ్ళంటే జాలే ..కానీ అంతకంటే భయం ఎక్కువ .వాళ్ళలో కొందరు చేసే దురాగతాల వల్ల వారందరి మీదా సింపతీ పోయి భయం కలుగుతోంది .