1, నవంబర్ 2009, ఆదివారం

నాలోనేను

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటునీవే మరుగైనా కావే ...
ఎదుట నీవే ఎదలోన నీవే .....

మరుపే తెలియని నా హృదయం
తెలిసివలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం........
గాయన్నయిన మాననీవు
హృదయన్నయిన వీడిపోవు
కాలం నాకు సాయం రాదూ
మరణం నన్ను చేరనీదు .......
పిచ్చి వాణ్ని కానీదు .....

కలలకుభయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డానూ ...........
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకలేగా
స్వప్నం సత్యం ఐతే వింత
సత్యం స్వప్నంయ్యేదుంద .........
ప్రేమకింత బలముందా ....

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవే
మరుగైన కావే.....

21 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

"అభినందన" లోని ఈ పాట నాకు మొత్తం వచ్చు :) ఎవరికీ సందేశం ఇంతకీ చిన్ని? నాకేనా... ;)

Hima bindu చెప్పారు...

@హుమ్మ్.....ఇరుకులో పెట్టేసారే ...ఊఁ ....మీకే -:) నాకు చాల ఇష్టం ,అస్తమాను నోట్లో ఆడుతుంటే వుండలేక బ్లాగ్ లో పెట్టేసా ...నిజ్జం :)

భావన చెప్పారు...

ఏదో కవిత రాసింది చిన్ని అని మొదలెట్టా చదవటం రెండూ పదాలు చదవగానే వారిని చిన్ని (ఎక్జాట్ గా అలానే అనుకున్నా ;-)) పాట రాసేసారు అనుకున్నా. బాగుంది ఈ పాట కు నాకు కూసంత అనుభందం కూడా వుంది.. అంటే కొంచం వయసు లో వున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లుంటాయి కదా ;-)

Padmarpita చెప్పారు...

నాకు కూడా బోలెడంత ఇష్టం!!!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఎందుకని మీకది అస్తమించకుండా అస్తమానం నోట్లో ఆడుతుంది? నిజంగా ప్రేమకింత భాలముందా :)?

భావన చెప్పారు...

భ.రా.రే: కామెడి గా అడిగేరా ఆ ప్రశ్న నిజం గా అడిగేరా? :-|

Hima bindu చెప్పారు...

@భ.రా..రె
నేను భావన ని సపోర్ట్ చేస్తున్న ....భాలము కాదు "భలము "...ఏదో అక్కడ టైపు దోషము .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

భావన గారూ, మీరిలా హింటిచ్చి, పానకంలో పుడకలా ప్రశ్నలు వేస్తే ఎలాగండీ? :)

చిన్నీ గారూ అదుగో మళ్ళీ "భలము" అంటారు. :), టైపాట్లు నాకలవాటేనండీ, కాకపోతే మీరు టైపు తప్పులు లేకుండా చేస్తే చదవాలని :)

Hima bindu చెప్పారు...

@భావన
తెగ రాసేసానని తప్పులో కాలేసేసార -:) ఏ రాయైతేనేం అన్నట్లు 'కళాహృదయం 'ఉండాలే కాని ఓలు రాత్తేమనకేటి .....మనం రాసినట్టే కూసంత బిల్డప్ప్ అన్నమాట -:):)
@పద్మర్పిత
మనందరిది ఒకే భంధం ఏమో :)
@భా.రా.రె
మరుపేలేని నా మనసునకు "కాలం సాయం రావడం లేదని "ఓ ప్రక్క మొత్తుకుని భాద పడ్డం చూస్తూనే అలా ఎందుకు అస్తమించడం లేదని అంటారే ...ప్చ్ ...మీకులా ఎక్కడ సత్యవతో ,సత్యభామ కనబడితే అక్కడ చూసి మరిచిపోవడం చేతకాదే....ప్రేమకి బలం వుంది మరోసారి వెళ్లి అక్కడ లుక్ వేయండీ ...హ హ హ .
@భావన
చూసారా మిమ్మల్ని భా.రా యెంత మాట అన్నారో ....మీరు "పానకంలో పుడకంట" అక్కడేమో గ్రేట్ అని పొగిడి ఇక్కడ ఇలా ...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఈ పాట వింటున్న ప్రతీసారీ సీలింగ్ ఫాన్ వైపు చూస్తూ గతంలోకి ఓ రౌండ్ వేసేస్తాను నేను...ఇప్పుడు మాత్రం ఆఫీసులో ఫేన్ లేకపోవటం వల్ల బుద్దిగా పనిచేసుకుంటున్నా... :)

Hima bindu చెప్పారు...

@శేఖర్
నవ్వి నవ్వి అలసిపోయాను .

భావన చెప్పారు...

అవును చిన్నీ చూసేవా ఈ ఘోరం. భా.రా.రే ఇక్కడోలా అక్కడోలా అంటున్నారు.. వా.. వా..

తృష్ణ చెప్పారు...

ఎక్కడికో....శిఖరమ్ అంచులదాకా తీసుకెళ్ళి వదిలేసారు కదా....
క్రింద పడిపోతానేమో...అయ్యొ..అయ్యో..ఎవరూ పట్టుకోవటం లేదు...
......నేను పాటలు పాడే టైమ్ లో..కాలెజీ రోజుల్లో... ఎన్ని సార్లో ఈ పాట పాడి పాడి...

తృష్ణ చెప్పారు...

అన్నట్లు మా కాలేజే అన్నారు...వివరం చెప్పరూ...మీరు నాకు తెలుసేమో..?
నేను ఐదేళ్ళూ అదే కాలేజ్...ఎక్కడన్నా సీనియర్ల లిస్ట్లో అయినా దొరుకుతారేమో...
అవకాశమ్ లేదంటారా...?

Hima bindu చెప్పారు...

@తృష్ణ
మీరు బాగా పాడతారా ?నేను పాడతాను కాని గొప్పగా కాదు.నా డాటర్ అధ్బుతంగా పాడుతుంది.
సేనియర్ ల్స్ట్లో అవకాశమా?సంతోషం ..మీకు ఇష్టం అయిన ఒక లెక్చరర్ పేరు చెప్పండి ,అన్నట్లు మీరు సైన్సు లేక ఆర్ట్స్ స్టూడెంట్?అది తెలిస్తే .-:)
@భావన
సమయం వచ్చినపుడు చూసుకుందాము

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీరు అలాగే సమయంకోసం వేచి చూ.............స్తూ......... వుండండి

sreenika చెప్పారు...

చాలా మందిని బురిడీ కొట్టించేసారే..రెండులైన్లు చదివాక గాని అర్ధం కాలేదు. మంచి పాట గురుతు చేసారు.

kvr చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
మురళి చెప్పారు...

నాకెందుకో ఈ పాట విన్నప్పుడల్లా 'అన్వేషణ' లో ఇదే ట్యూన్ తో చేసిన పాట గుర్తొస్తుంది..

kvr చెప్పారు...

రాయక రాయక ఒక కామెంటు రాస్తే దాన్ని ఎందుకు దిలేట్ చెసారు చెప్మా !!!!!!!! :(

cartheek చెప్పారు...

manchi pata andinchaaru chinni gaaru..