"హాయ్ చిన్ని"నా వీపు చురుక్కుమంది. వెనక్కి తిరిగి చుసిన నా కళ్ళకి రంగు రంగుల చీరల్లో ఒకరినిమించి ఒకరు అందాలు ఒలకబోస్తూ'అతివలు'ఒక్కసారే అంతమందిని పోల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవ్వుతున్న నన్ను రక్షిస్తూ మా విజ్జి క్లూ లు ఇస్తుంటే చెప్పనీకుండా గోల చేస్తున్న ఆ బృందాన్ని చూస్తూ ఒక్కొక్కరిలో ఆ నాటి చిన్న పిల్లల్ని వెదుక్కుంటూ పోల్చి చెబుతుంటే కేకలు పెడ్తున్న మమ్మల్ని చూసి చుట్టుప్రక్కల వారుమండపం లోని వధువరులను వదిలి మా కేరింతలు ,అల్లరి నే చూసి ఆనందించరనే చెప్పొచ్చు. ఒక్కొక్కరు చేసిన అల్లర్లు ఏకరువు పెట్టుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూఆడుతూ పాడుతూ విస్మయంగా ఒకరినొకరు చూసుకొంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు విచారించుకుంటూ విందు బోజనాలు ఆరగిస్తూ చిన్నపిల్లలం అయిపోయాం.
ఎన్నోఏళ్ళ తరువాత నవంబర్ ఐదవ తారీకుసాయంత్రం సికింద్రాబాదు లోని ఒక గార్డెన్ లో మా మిత్రబృందమంతాకలిసాము .ప్రతి యాడాది నా స్కూల్ మిత్రులమంతా ఏదొక సందర్భం పురస్కరించుకుని ఎవరోకరి ఊర్లో,ఇంట్లోనో కలసి ఒకటిరెండురోజులు గడుపుతుంటాము.మేమంతా ఏలూరు సెయింట్ తెరిసాలో కలసి చదివాము అందరం ఫస్ట్ క్లాసు బోర్దిన్గ్లోను వుండేవాళ్ళం.కేవలం హాస్టల్లో వున్నా మా క్లాసు పద్నాలుగుమంది బాచ్ వరకే ఈ విదంగా కలుసుకుని మంచి చెడుకి ఒకరికొకరు తోడ్పాటుగా వుంటున్నాము .ఈసారి మాత్రం వినూత్నంగా హాస్టల్లో ఐదు నుండి పదివరకు చదివిన మిత్రులంతా కలవడానికి మా మిత్రురాలు ఏర్పాటు చేసింది.తన ఇంట జరిపే వివాహ వేదికను అందరు కలవడానికి వేదిక చేసింది.నాలుగైదు తారికులు మా హాస్టల్ వారందరికీ గెట్ టుగదర్ ఏర్పాటు చేసింది నాలుగు వెళ్ళలేక ఐదున వెళ్ళిన మా అక్క చేల్లెల్లని అంత సులభంగా పోల్చుకోలేకపోయారు.మేమును అందర్నీ గుర్తుపట్టడానికి కష్టపడాల్సి వచ్చింది .మా సేనియర్ అక్కలు ,జునియర్ చెల్లెళ్ళు కలబోసి చూస్తుంటే తెలియని ఉద్విగ్నత మా జునియర్ అయిన ఇద్దరి అమ్మాయిల అకాల మరణ వార్త కూడా కలచివేసింది .స్వచ్చమైన భాల్యం మా అందరిలోతాండవిచ్చింది.హిపోక్రసి వదిలేసిన మా పిలుపులు ఆ ప్రేమలు మరపురాని అనుభవం అని చెప్పొచ్చు.మా కెరీర్‌ని తీర్చిదిద్దిన మా స్కూల్ సెయింట్ తెరిసాని ఆ క్షణాన'తల్లిని'తలుచుకున్నట్లు తలిచాము .అందరం మరొకసారి కలవాలని తీర్మానం చేసుకున్నాం . ప్రముఖ రాజకీయనాయకులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు,సినిమారంగానికి చెందిన ప్రముఖులు,తారలు విచ్చేసిన ఈ వివాహ వేడుకలో మా చిన్ననాటి మిత్రుల కలయిక ఇంకెంతోశోభనిచ్చింది. .
8, నవంబర్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
17 కామెంట్లు:
పాత స్నేహితుల కలయికలోని ఆనందం ఎంత చెప్పినా తనివితీరనిది. ఎప్పటికీ తరగనివి. కాల క్రమాణ వొచ్చిన మార్పులు, మంచీ చెడు తెలుసుకున్నపుడు పొందే ఆ రకరకాల అనుభవాలు యెదలోయలలో స్థిరపడిపోతాయి. తరచుగా స్నేహితులను కలుసుకుంటున్న మీకు అభినందనలు.
paatha mithrulu kalisi thirigina aarojulu anni adbhthale jeevithamlo...
నేను, చెల్లి కాకుండా ముందు తరంలో మా అమ్మ కూడా సైంట్ తెరీసా స్టూడెంట్సుమే కానీ ఎప్పుడూ ఇలా రీయూనియన్ కి వెళ్ళలా :(
చిన్నప్పటి Hostel matesని కలవడం నిజ్జంగా thrilling experience!
బాగుందండి మీ మిత్రుల కలయికల కిల కిల లు, మొన్న సికింద్రాబాద్ వైపు ఒకటే పకపకలు కిల కిల లు అని అందరు చెప్పుకున్నారు మీరేనా. ? :-) ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈ నాడు ఆ హాయి లేదేమి నేస్తం.. ఆ రోజులు మును ముందిక రావేమిరా.. అని పాడుకున్నారా..
బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. పాత మిత్రులందరినీ ఒకసారి కలిస్తే బాగుండుననిపించింది...
@జయ
ధన్యవాదాలు .నిజమే కదా చిన్ననాటి స్నేహంలోని మాధుర్యం ఎంతకాలం అయిన దాని తీపి పోదు ,ఎటువంటి బేషజాలు లేకుండా మనం మనంగా ప్రోజెక్ట్ అయ్యే లేతమనసుల స్నేహం దేనికిని సాటి రాదనే చెప్పొచ్చు.నా ఫ్యామిలీ తరువాతి స్థానం నేను స్నేహితులకే ఇస్తాను ,ఇంకొంచెం చెప్పాలంటే మనసుకు నచ్చిన స్నేహితుల్ని నా స్వంతవారిగానే భావిస్తాను .
@కార్తిక్
మీరు చెప్పింది వాస్తవమే .
@తెరెసా
నాకు మీరు గుర్తొచ్చారు ,అప్పుడెప్పుడో నా బ్లాగ్ లో చెప్పారు మీరు అక్కడే చదివారని ...అవకాశం వస్తే ఎప్పుడు మిస్ కాకండి .మా ఫ్రెండ్ రాధిక రమణి కాకర్ల గుర్తొచ్చింది వాళ్ళ మదర్ కూడా అక్కడే చదివారు .అప్పుడు ఇప్పుడు కూడా అది మంచి స్కూల్ ఉభయ గోదావరి ,కృష్ణా జిల్లాల వాళ్ళు అక్కడే చదివేవారు
@భావన
హమ్మో హమ్మో !మా కిలకిల రావాలు సప్త సముద్రాలు దాటి మీ కృష్ణ గీతానికి సంగీతం సముకూర్చిన సంగతి చెప్పరేమబ్బా-:(
మీరు చాలా అదృష్టవంతులండి,
పాతమిత్రులు కలవడం ఎంత మధురంగా ఉంటుందో..
జ్ఞాపకాల వీధుల్లో
అనుభవాల ముత్యాలేరుకుంటూ
అనుభూతుల సరాలల్లుకుంటూ
ఒకరి మాల మరొకరు
అలంకరించుకుంటూ
అలా అలా విహరిస్తూ..
ఎంత మధురమైన భావన ?
మీకు అభినంధనలు
బావుందండీ మీరు మీఒకప్పటి ఫ్రెండ్స్ ని కలవడం .. అయితే హఠాత్తుగా ముగించినట్టు అనిపించింది .... :(
చిన్నీ గారండీ, బాగుందండీ.
నాతో పది వరకు చదివిన సుబ్బలక్ష్మికి అక్కడితో చదువాపించి పెళ్ళిచేసేసారు. నేను యూనివర్సిటీ వరకు వెళ్ళాను కనుక, ఈ నడుమ కొన్నేళ్ళు గడిచిపోయాయి. యువకి సంవత్సరం వయసున్నప్పుడు ఓసారి ప్రయాణంలో నా చున్నీ గుంజుతూ ఒకరు పలకరించే సరికి కాస్త నలిగిన కాటన్ చీర, ప్రక్కన దాదాపు తనంత ఎత్తున్న ఆడపిల్లతో "మీరు నువ్వూ ఉష కదా?" అంటున్న తనని ఒక్క కళ్ళకాటుక వలన గుర్తు పట్టాను. తను కంటి నిండా కాటుకతో పెద్దకళ్లతో వుండేది. నేను అటూ ఇటూ పరుగెడుతున్న యువాతో సతమతమౌతూ, తనని కాస్త కుశలం అడిగేసరికి "ఏమే ఇంకా ఇక్కడే వున్నావా?" అంటూ రయ్యిన వచ్చిన ఆ సదరు భర్త గారి ధాటికి బెదిరి "ఇక వెళ్తానంటూ" సెలవు తీసుకుంది. అలాగే మరో సారి తార్నాక యేరియాలో పరుగున వచ్చి అక్కున చేర్చుకున్న మంజు, సిడ్నీలో మరొకరి ఇంట హఠాత్తుగా ప్రత్యక్షమైన శశి, ... ఫార్మల్ గా కలిసే కన్నా ఇలా అనుకోకుండా కలిసిన జ్ఞాపకాలు నాకు భలే ఇష్టం.
@మురళి
ప్రయత్నించండి :)
@శ్రీనిక
ధన్యవాదాలండీ ..మీరు చెప్పిన విధం ఇంకా బాగుంది .
@ఉమా
మీరు భలే కనిపెట్టేశారు ....రాయడం మొదలు పెట్టక రాసే మూడ్ పోయింది ,అన్యమనస్కంగా రాసాను :)
@భా.రా.రె
ఏమి బాగుందండీ :)
@ఉష
ఒక్కసారే మా సుబ్బా అనుకున్నాను ...మా సుబ్బలక్ష్మి డాక్టర్ చదివింది :)మొన్న వచ్చింది కూడా.
ఏం బాగుందంటే... హ్మ్
ఆనాటి హృదయాల ఆనందగీతం
మదిలోన మెదలేటి మధుర జ్ఞాపకం
ఏనాడు చెరగని సరదాల బాల్యం
ఈనాటి జీవితానికి సోపానం
చిన్ని గారు ఎంత అదృష్టవంతులు మీరు !అభినందనలు !
నాగేశ్వర్రావు గారి సినిమాలోని ఈ పాట టైటిల్ గా పెట్టినప్పుడే అనుకున్నాను...మీరు పాత మిత్రులని కలిసి తొమ్మిదో నెంబరు ఆకాశ వీధిలో ఉండిఉంటారని.
మీ ఆనందం టపాలో కనపడింది. ఓ ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదండీ..
@భా.రా.రె
బాగుందండీ:)
@పరిమళం
ధన్యవాదాలు
@శేఖర్
నిజమే ఫొటోస్ పెట్టి ఉండాల్సింది ...అందర్ని చూడడానికి మీ అందరికి కళ్ళు చాలవు :)
చిన్ని గారూ నాది కూడా శేఖర్ గారి మాటే..
@ప్రణీత
అలానే పెడతాను :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి