28, మే 2010, శుక్రవారం

WHO WILL CRYWHEN YOU DIE?

నిజంగా నా కోసం వీళ్ళంతా ...వీళ్ళుఅంతా నా వాళ్ళేనా ! ఇంతమందిని బాధ పెడుతుందా నా ఎడబాటు ...నాకోసం ఇంతమంది ...ఇంకా డైజస్ట్ కావడంలేదు ఎప్పటికైనా ఇటువంటి సందర్భం వస్తుందని తెలుసు కాని దానిని ఇలా ఎదుర్కుంటాను అని ఊహించలేదు.మనకి ఏదైనా జరిగిన ,ఎడబాటు కలిగిన మన కుటుంబ సభ్యులు ,బంధువులు ,ఆప్తమిత్రులు కన్నీరుపర్య్వంతం అవడమే తెలుసు ...కాని ఇంతలా ఏమి కాని నాకోసం వెక్కిళ్ళు పెట్టి కళ్ళన్నీ కెంపులు చేసుకుని బెంగగా ,జాలిగా చూస్తున్న ఈ అమ్మాయిలూ ,.ఈ అబ్బాయిలు మాత్రం ...వీళ్ళ మొహం లో ఇంత వేదన ,నైరాశ్యం మునుపు ఎన్నడు చూడలేదే.!.ఎవరు వీళ్ళు .యేమవుతానని నాకోసం ఇంత దిగులు .ఇంకా ఎవరికోసం మేం పని చేయాలనీ అంటున్నారు పిచ్చివాళ్ళు నేనే అంటే నాకంటే సెంటిమెంట్ ఫూల్స్ లా వున్నారు .చెదిరిన నా మనసుకి సూటిగా వారి వైపు చూడలేని నా కళ్ళు ,మూగబోయిన నా గొంతు చెప్పకనే చెప్పాయి వీళ్ళు అందరు ఎప్పటికి నావాళ్ళేనని . .

13 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

?

ప్రణీత స్వాతి చెప్పారు...

అర్ధం కాలేదండీ..?

Hima bindu చెప్పారు...

నేను చచ్చిపోవడంలేదండి...ఏ జబ్బు రాలేదు :-)
పది సంవత్సరాల నుండి ఒకే స్టేషన్ లో పని చేస్తున్నాను వివిధ హోదాల్లో ,ఇప్పుడు వేరే డిపార్టుమెంటు కి మూవ్ అవ్వుతున్నాను.ఈ ఎడబాటు .ముఖ్యంగా నా స్టాఫ్ తట్టుకోలేక పోతున్నారు. వాళ్ళను ఎలా సముదాయించాలో అర్ధం కావడం లేదు ...నాకు చాల భాద గానే వుంది .అసలుకే ఒక చిన్న మొక్క మీద కూడా అనుబంధం పెంచేసుకోవడం మనకో బలహీనత .

Hima bindu చెప్పారు...

@ప్రణీత స్వాతి
నేను ఉద్యోగ రీత్యా ఇప్పటివరకి పని చేసినవారికి దూరం కాబోతున్న ...రెండురోజుల నుండినా స్టాఫ్ భాద చూస్తుంటే ....అతిశయోక్తిగా కనబడవచ్చు కాని యదార్ధం . దూరం అవుతుంటేనే ఇలా వున్నారు చనిపోతే నా కోసం ఎడ్చేవాళ్ళు చాల మంది ఉన్నారనిపించింది :-)

ప్రేరణ... చెప్పారు...

చిన్నిగారు పదిహేడు ఏళ్ళు ఒకే స్టేషన్ లో చేసి నేను జూన్ పస్ట్ కి వేరొక చోటుకి బదిలీ కాబోతున్నాను. మీ భాధను అర్థం చేసుకోగలను, but we have to...

మరువం ఉష చెప్పారు...

:) నేను సిడ్నీ నుంచి వచ్చేసేప్పుడు కలీగ్స్ అంతా కలిసి రాసిచ్చిన కార్డ్ తీసి చదువుకున్నాను. దానికి ఒక కొమ్మకి రకరకాల కోతులు వేళాడుతూ ఉన్న బొమ్మ. ఇక కామెంట్స్ అంటారా ;) చిన్నీ, కాస్త ఎక్కువ పేరాశ పడుతున్నారేమో, ఇలాగ కూడా ఆలోచించండి.

అవును వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే!

Hima bindu చెప్పారు...

@ప్రేరణ
నిజమేనండి ...డిపార్టుమెంటు వదిలి డెప్యుటేషన్ పై వెళ్తున్నాను అండీ ...కెరీర్ పరంగా నాకు మంచి అవకాశం.
@ఉష
అత్యాశ అంటారా ...కాదండి అందుకే అన్నాను అతిశయోక్తి కాదని .

జయ చెప్పారు...

చిన్ని గారు 'కాలం' ఉంది కదండి. కొత్త ప్లేస్ లో ఇటువంటి అనుభవాలే ఇంకా తీపి గుర్తులుగా మీకు తగలొచ్చు. అప్పుడప్పుడు పాత వారిని కలిసి ఆనందపడొచ్చు. మెల్లిగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. I wish you all the best & a bright future.

జయ చెప్పారు...

చిన్ని గారు 'కాలం' ఉంది కదండి. కొత్త ప్లేస్ లో ఇటువంటి అనుభవాలే ఇంకా తీపి గుర్తులుగా మీకు తగలొచ్చు. అప్పుడప్పుడు పాత వారిని కలిసి ఆనందపడొచ్చు. మెల్లిగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. I wish you all the best & a bright future.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఓ..అదా సంగతి...ఒక్కనిమిషం నాకు ఏమీ అర్ధం కాలేదండీ...

మాలా కుమార్ చెప్పారు...

అబ్బ ఒక్క క్షణం ఎంత గాభరా పెట్టారండి. అనతేనండి వీడుకోలు ఎప్పుడూ బాధా కరమే .

మిరియప్పొడి చెప్పారు...

Zll the best anbdi

Hima bindu చెప్పారు...

@జయ
నిజమేనండి కాలం ని నేను పూర్తిగా నమ్ముతాను .థాంక్సండి
@శేఖర్
అవును...అది సంగతి :-)
@మాలా కుమార్
రాబిన్ శర్మ రాసిన పుస్తకం టైటిల్ అండీ ఇది ...కంగారు పెట్టానా!
@మిరియప్పొడి
తప్పకుండా అందుకున్ననండి మీ మిరియాల ఘాటు .:-)