8, జులై 2010, గురువారం

మార్పు

కొన్ని నెలల క్రితం తెగ భాదపడి పోయేదాన్ని ''బ్లాగులకి "తెగ ఎడిక్ట్ అయిపోతున్నాను అని ఎలా తగ్గించాల అనికూడా ఆలోచనలు చేయడం ,వాటిని ఆచరించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది .బ్లాగుల వలన నేను రెగ్యులర్ గా చదివే పుస్తకాలు ,నవలలు కూడా తగ్గాయి అలానే కొన్ని పెర్సనల్ రిలేషన్స్ మీద కూడా ప్రభావం పడింది .
ఎట్టకేలకు నా ప్రయత్నం లేకుండానే ఈ మధ్యకాలం లో బయటకి రాగలిగాను .కారణం విపరీతమైన పని ఒత్తిడి ,ఉదయం ఇంటినుండి బయట పడ్డాను అంటే ఇల్లు చేరేవరకి వేరే ధ్యాస వుండటం లేదు .ప్రయాణం లో ఒక మూడుగంటలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది .ప్రస్తుతానికి అయితే వృత్తీపరమైన జి.ఓలు సంభందిత సమాచారం చదువుకోవడం తో గడుపుతున్నాను ,ఒక నెలపోతే ప్రయాణం లో బోల్డన్ని పుస్తకాలు చుట్టి రావచ్చు.కళ్ళ ఎదురుగా ఇంటా-బయట సిస్టం వున్నా ఓపెన్ చేసిన ఇదివరకు వలె కూడలో,హారమో ,జల్లెడో,మాలికో చూడాలని అనిపించడం లేదు .నాకు అర్ధం అయ్యింది ఏవిటంటే చేతికి ,మనసుకి తగినంత పనిలేకపోతే రకరకాల ఎడిక్షన్స్ వస్తాయని :-) అంటే ఇన్నాళ్ళు పనిపాట లేకుండా కాలక్షేపం చేసానుఅని అంతా అనుకునే ప్రమాదం వుందని తెలుసు ,బట్ అదేమికాదు ,ఇప్పుడు ఇంకా భాధ్యతలు మరింతపెరగడం మాత్రమె ఈ మార్పుకి కారణం .ఎనీ హౌ ఈ బంగారులోకం మాయ నుండి బయటకి రాగలిగాను .:-)

4 కామెంట్‌లు:

హను చెప్పారు...

adi mana valla kadu lenDI

Manjusha kotamraju చెప్పారు...

నిజమేనండి,,నేను కూడా బాగా addict అయిపొయాను ఈ బ్లాగు కు,,బయటకు రాలేకపొతున్నాను??

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>నాకు అర్ధం అయ్యింది ఏవిటంటే చేతికి ,మనసుకి తగినంత పనిలేకపోతే రకరకాల ఎడిక్షన్స్ వస్తాయని..

:-):-)

కరెక్టేనండీ హిమబిందు గారు...

Hima bindu చెప్పారు...

@hanu
@manju
@sekhar
thanq