18, డిసెంబర్ 2010, శనివారం

నా షిర్డీ యాత్ర

అప్పుడెప్పుడో ఉత్తుత్తి తీర్ధయాత్రనా అమరనాథ్ యాత్ర


చేసి అందర్నీ నమ్మించేసానుకాని ఈ సారి మాత్రం నిజంగానే వెళ్ళివచ్చాను .అసలే చాలామంది మిత్రులు మొత్తుకుంటున్నారు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే యాత్రలు చెయ్యాలని ముఖ్యంగా అలనాటి సుప్రసీద్ద కవి "ధూర్జటి "కూడా మొత్తుకున్నాడని:-) ఇరవయ్యి ముప్పయ్యి ఏళ్ళ మద్య విహార విజ్ఞానతీర్థయాత్రలు చేసి అలసిన నాకు తిరిగి కొంత దైవ చింతన (అప్పుడెప్పుడో దేవుళ్ళకి వున్నా నా బాకీ లుతీర్చే నెపము )కలిగి కొత్త అప్లికేషన్లు పనిలో పని పెట్టించడానికి నా ముద్దుల కూతురు నిమిత్తమై కదిలాము కుటుంబం అంతా (ముగ్గురం ).ఈ నాలుగు రోజులు నాలుగు గంటల్లా గడిచిపోయాయి .
షిర్డీ చాల చాల మారిపోయింది చాలా కాలం తరువాత వెళ్ళడం వలన (గతం లో ప్రతి యాడాది వెళ్ళేవాళ్ళం ) రూపురేఖలే మారినట్లు కనబడింది.ఒకప్పుడు బాబా వారి సమాధి అతి దగ్గరగా తాకే అవకాశం వుండేది.సునాయాస దర్శనం వుండేదిఇప్పుడు కనీసం రెండుగంటలు తప్పదురద్దీ సమయం లో ఇంకా ఎక్కువే.కళ్ళ ముందు పూరిపాకలు చిన్న ఊరు సరయిన ఆహారం వుండేది కాదుఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ప్రాంతాలవారి రుచులతో భోజన సదుపాయంరవాణాసదుపాయంఆ ప్రాంతాన్ని చూస్తుంటే పెద్ద నగరం లా అనిపించింది .మిగిలిన దేవాలయాల్లో వున్నట్లు ఇంకా శిర్దికి కొన్ని తాకలేదు .సామాన్యులు కి కూడా ఎన్నో సౌఖర్యాలు అందుబాటులో వున్నాయి వి.ఐ.పి దర్శనాలు కొంత ఇబ్బంది కలిగిస్తున్న మిగిలిన దేవాలయాలతో పోలిస్తే లెక్కలోనికి రాదు .భక్తులతో నిత్యం కిటకిటలాడుతున్న షిర్డీ,కనీసం రూపాయి దర్శనం టికెట్ పెట్టిన చాలా ఆదాయం సమకూరుతుంది,కాని ఇటువంటివి ఏవి లేకుండానే ఆలయం చక్కగా నిర్వహించబడుతుంది.ఎన్ని ఒత్తిడులతో వున్నా బాబా ని చూడగానే మనస్సంత ప్రశాంతం గా కొండంత అండ మనకోసం అన్నట్లు అనిపిస్తుంది.వెళ్ళిన రోజే సాయంత్రం హారతికి అందుకున్నాం.చాలా సంతోషం అనిపించింది లేకపోతె అరగంట బాబా ముందు వుండటం కుదరదు కదా ! ఒకప్పటి షిర్డీ యే నాకు బాగున్నట్లు అనిపించింది..అప్పుడు స్వేచ్చ స్వచ్చత అపారంగా ఉండేవి .


13 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మరి మాకు ప్రసాదాలో!

Hima bindu చెప్పారు...

@బా .రా.రె
అడ్రెస్స్ ప్లీజ్ :-)

జయ చెప్పారు...

ఒకప్పుడు నిజంగానే చాలా ప్రశాంతంగా ఉండేది.విభూది కూడా కావాల్సినంత దొరికేది. అక్కడి గులాబీలు నాకు బాగా నచ్చేవి. ఎన్నో తెచ్చుకునే దాన్ని. ఏవిటో ఇప్పుడా మనశ్శాంతి అక్కడ లేదు. పోవాంటేనే భయంగా ఉంది. తిరుపతికి ఏనాడో మానేసాను. ఇప్పుడిక్కడికి. ఎటువంటి రష్ లేకుండా ఉండటానికి నీ ఒక్కదానికోసమే ఎక్కడా గుడి కట్టరు అంటుంది మా ఫ్రెండ్:)

అజ్ఞాత చెప్పారు...

/విభూది కూడా కావాల్సినంత దొరికేది./
హ్వా హ్వా హా. ఇది బాగుంది.
ఓ విగ్రహం పెట్టుకుంటే రోజుకు 100గ్రా పైనే విభూతి ఇంట్లోనే రాలుతోందిటగా! ప్రశాంతత మాటేమోగాని, 10విగ్రహాలు పెట్టుకుంటే సరి, బోలెడంత విభూతి.

Hima bindu చెప్పారు...

@జయ
ఇప్పటికి విరివిగా గులాబీలు ఉన్నాయండీ,నేను పిచ్చిగా కొన్నాను ఎర్రగులాబీలను.తిరుపతి విషయం లో మీ అభిప్రాయమేనాదీనుముందుముందు షిర్డీ అలానే కావచ్చు
@snkr
నాకు విభూతి దొరకలేదు.మీ ఇంట్లో విగ్రహాలు పెట్టివుంటే కొంచెం పంపించండీ :-).

రాజేష్ జి చెప్పారు...

$snkr ji
Leaving that sacred-ash to us,
You must have got lot of self-peace by just ejecting such witty(?) comment. Should I say more?

Apparao చెప్పారు...

16,17,18 ఈ మూడు రోజులు మేం అక్కడే ఉన్నాం

Hima bindu చెప్పారు...

@రాజేష్ .జి
ధన్యవాదాలు
@Apparao sastry
మేమూ అదే రోజుల్లో వున్నాము.పదహారు సాయంత్రం హారతికి బాబాకి అతి దగ్గరలో వున్నాం.ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Address కావాలా :).సర్లెండి ఈ సారి మళ్ళీ ఎప్పుడో వెళతారు కదా అప్పుడు ఇస్తాను :P

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
ఓహో !ఈ సారి నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను ప్రసాదాలు కావల్సినోరు అడ్రెస్సులు ఇవ్వండోయి అని రాస్తానేం :-) సాయి జీవితచరిత్ర.సాయిబాబా పూజ విధి వున్నాయి.కావాలంటే చెప్పండి"ఖర్చు"అవ్వుద్ది .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఎంతవుద్దెమిటి :)

veera murthy (satya) చెప్పారు...

ఐనా ప్రస్తుత కాలం లో "పవిత్ర తీర్థ" యాత్రలకి, "విహార " యాత్రలకి, " వినోద" యాత్రలకి తేడా లేకుండా పోయింది.

enjoyment కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు!

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
అబ్బో చెప్తే మీ గుండె ఆగిపోతుంది.,అసలే ఇద్దరాడపిల్లలాయే:-)
@సత్య
మరి తప్పదు కదండీ(మనది అదే బడి ) ఆ ఒక్క దాంట్లోనే విజ్ఞానం,విహారం వినోదం:-) ...అన్నీను .ధన్యవాదాలు .