23, డిసెంబర్ 2010, గురువారం

ఇదీ మన పరిస్థితి

ప్రజల కోసం మేము అని చెప్పుకునే నాయకులు జన జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నాం అని ఎందుకు అనుకోరో! గాంధేయ మార్గం అనుసరిస్తున్నాం అని చెప్తూనే తమ స్వలాభం కోసం ఉనికిని చాటుకోవడానికి రాస్తారోకో ,రైల్ రోకో ...ఒక ప్రక్క శాంతిమార్గం లో నిరాహార దీక్ష మరో ప్రక్క ముట్టడి పేరుతో హింసాయుత మార్గం ప్చ్.
జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనచోధకులకి తీవ్రమయిన అంతరాయం గంటలు గంటలు ...ప్రాణాల మీదకి వచ్చి మెరుగయిన వైద్యం కోసం వెళ్తున్న రోగులు సైతం జాతీయ రహదారుల్లో నిర్దాక్షిణ్యంగా పడిగాపులుపడవలసి వచ్చింది.రాజకీయ స్వార్ధలకోసం సామాన్య మానవులు మూల్యం చెల్లించాల్సివస్తుంది .
థూ వెధవ దాహం

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కరెక్ట్ గా చెప్పారండి. మన దేశం లో ముఖ్యం గా మన రాష్ట్రం లో గత సంవత్సరం డిసెంబర్ నుండి ఈ దౌర్భాగ్యం మరింత ఎక్కువైంది.ఒకర్ని చూసి మరొకరు కావాలని పదవులకోసం ఎలా నానా విధాలుగా మనల్ని హింసిస్తున్నారు.

Buchchi Raju చెప్పారు...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Hima bindu చెప్పారు...

@prathiudayam
ధన్యవాదాలు

శోభ చెప్పారు...

మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్దామని చెన్నై కోయంబేడు బస్టాండుకు చేరుకున్నాం. ఎంతసేపు చూసిన బస్సులు రాలేదు. అనుమానం వచ్చి కౌంటర్లో ఎంక్వైరీ చేయగా ఆంధ్రలో బంద్ జరుగుతోంది. కాబట్టి ఈరోజు బస్సులు రావు అన్నారు. దాంతో మళ్లీ కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాం. మాలాగే చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాక తిట్టుకుంటూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇదండీ మొన్నీమధ్య చంద్రబాబు నిరాహారదీక్ష సందర్భంగా మాకు కలిగిన అనుభవం..

రైతులకు, సామాన్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రాజకీయ నాయకులు చేసే దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోల వల్ల సామాన్యులకు మేలు జరగటంమాట అటుంచి.. వాళ్లను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాయన్నది నిజం. ఈ బంద్‌ల సందర్భంగా జరిగే విధ్వంసంవల్ల ఆ భారం కూడా మళ్లీ ప్రజలపైనే పడి వారి నడ్డిని ఇంకాస్త వంచేస్తోంది..

థూ వెధవ దాహం.. నిజమేనండీ.. నేటి రాజకీయ నాయకులను చూస్తుంటే ఒళ్లంతా అసహ్యం పుట్టుకొస్తోంది.

Hima bindu చెప్పారు...

@శోభారాజు
ధన్యావాదాలు