18, ఫిబ్రవరి 2012, శనివారం
ఒక ఆహ్వానం ఆప్యాయంగా ....
నా ఏకైక ప్రియ గారాల పుత్రిక చిన్నారి చిన్ని కి వారం రోజుల్లో అంటే వచ్చే ఆదివారం అనురాగాల పందిరిలో ఆత్మీయుల సమక్షం లో వివాహం జరగబోతుంది .......ప్రేమ నాదం చిగురించి జీవన గానం ఆలపించే శుభ వేళలో ఆప్తులైన మిత్రులు విచ్చేసి చిన్నారులను ఆశిర్వదించ కోరుతున్నాను.....సమ్మతము తెల్పిన మిత్రులకు వివరాలు తెలియచేయగలను......
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్‌లు:
చాలా సంతోషమండి .
చిన్నారులకు శుభాకాంక్షలు , ఆశీస్సులు .
మీకు అభినందనలు .
పెద చెరువు గట్టునా
భేరి వాగింది,
పెళ్ళివా రొచ్చారు,
పెద వీధిలోకి -
పసుపుకుంకుమ లన్ని
పళ్ళాల బట్టి,
రండి పేరంటాళ్ళు
ఎదురుకుందాము!
పానకపు కావిళ్ళు
భుజాన పెట్టి
రావయ్య బ్రాహ్మడా!
రావయ్య త్వరగ!
పెళ్ళమ్మ మా యింట్లో!
పేరైన సీతమ్మ
పెళ్ళి మా యింట్లో!
పెళ్ళి పెళ్ళన గానె పెరిగే బుగ్గల్లు!
పళ్ళైన మర్నాడు తీసె బుగ్గల్లు
***** మా దేవులపల్లి వారు సేకరించుకుని స్వదస్తూరితో రాసుకున్న ***** ఈ పాట మీకు గుర్తు/పరిచయం చేస్తూ - పెళ్ళి కబురు తెలిపినందుకు, తుళ్ళిపడుతున్నందుకు సంతసిస్తూ, వివరం చెప్పినా వీలు లేదని తెలియపరుస్తూ...
ప్రతి ఒక్క క్షణమూ మీగడ తరకల్లా ఇపుడు పేరుకోవాలి. ఆపై, కరుగుతూ, పేరుతూ పూసల నెయ్యిలా ఎప్పటికీ మీ పాప సంసార పాడికుండలో ఘుమ ఘుమాయించాలి. కాచిన గిన్నె అడుగున కమ్మని గోదార్లా మీకు ఈ గురుతులు మిగిలిపోవాలి. అన్నట్టు పెళ్ళికూతురికి తొలి గాజు మీరే తొడగండి, మర్చిపోకుండా. పెద ముత్తైదువగా మీరు - ఎలా ఉంటారబ్బా - నెమలి కంఠం రంగు పట్టు చీరలోనా? చంద్రకాంత రంగు చూడీలోనా? ;)
ప్రేమతో,
ఉష.
మీ చిన్నికి తనకి కాబోయే శ్రీవారికి వివాహ మహోత్సవ శుబాభినందనలు :-)
@మాలా కుమార్
థాంక్యూ
@వేణు శ్రీకాంత్
ధన్యవాదాలు
@ఉష
మెరుపు మెరిసినట్లుంది !ఎన్నాళ్ళకి కనిపించారు ! తప్పకుండ మొదటి గాజు వేస్తాను .చుడీలు వేస్తె పెళ్లి కూతురి తల్లి ఎక్కడా అని వెదుకుతారు :) పెళ్లి ఆదివారం కాబట్టి రుధిర వర్ణం లోనే మన ఆహార్యం వుంటుంది :-)
మీ చిన్నికి ముందస్తు వివాహ మహోత్సవ శుభాకాంక్షలండీ..
చిన్ని పెళ్ళికూతురికి శుభాభినందనలు. ఇద్దరూ కలకాలం సుఖశాంతులతో కళకళలాడుతూ ఆనందమయ జీవితం గడపాలని, నా దీవనలు తప్పకుండా అందించండి. విజయవాడలోనో, న్యూజెర్సీ లోనో పెళ్ళి చేస్తే ఎలా వస్తామబ్బా!!! చక్కటి పెళ్ళిఫొటో చూపించండి మాకు. బుజ్జులుగాడికి కూడా చక్కటి పట్టు డ్రెస్ కుట్టించండి మరి.All the best.
చిన్నారి చిన్ని కి మా "వివాహ శుభాకాంక్షలు!"
@Subha
@Jaya
@Chinni Ashaa
Thanq verymuch
కామెంట్‌ను పోస్ట్ చేయండి